I C T Schools and Project, Computer Education, Andhra Pradesh India
Pages
Home
Contact Us
RTI ACT
ICT
Other
OTHER STATES
మన తెలుగు భాషా
NEW PAGE (AP ASC)
MEMBERSHIP
MARQUEE
URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!
Wednesday, April 15, 2015
శ్రీ శ్రీ శ్రీ భధ్రమహాంకాళి అమ్మవారి గ్రామదేవత మహోత్సవములు - ఇలిసిపురం, శ్రీకాకుళం
శ్రీ శ్రీ శ్రీ భధ్రమహాంకాళి అమ్మవారి గ్రామదేవత మహోత్సవములు - ఇలిసిపురం, శ్రీకాకుళం
తేది 12-04-2015 ది నుండి 05-05-2015 వరకు.
పండగ దినములలో భక్తులు చేయవలసిన పూజా కార్యక్రమములు
తేది 12-04-2015 ఆదివారం ఉదయం 8 గం||ల నుండి చల్లపిడతల పండగ.
మట్టి చల్లపిడతలు కొని ఒక పిడతలో ముందురోజు అనగా శనివారం వండిన అన్నంతో తొలి అన్నం అన్నంతీసి, కొంత మజ్జిగవేసి, ఒక నీరుల్లిపాయ ఒలిసిపెట్టి, మరసటిరోజు ఉదయం ముర్రాట, వేప కొమ్మలు ఈ చల్లపిడత పట్టుకొని డప్పులుతోపాటు బయలుదేరి రావలెను.
తేది 16-04-2015 గురువారం ఉదయం
8
గం||లకు శ్రీ మరిడమ్మతల్లి పండగ
తీపి అట్టు, బెల్లంతో పరమన్నాం, వడపప్పు, ముర్రాట, వేపకొమ్మలు పట్టుకొని శ్రీ మరిడ్మతల్లి అమ్మవారి తిరువీధిలో
ఉజిడీ బండి
బుట్టలో వేసి దండం పెట్టుకోనవలెను.
తేది 19-04-2015 ఆదివారం మ||
2
గం||లకు శ్రీ దుర్గమ్మతల్లి పండగ
శ్రీ దుర్గమ్మ పండగ ప్రారంభ సమయంలో పండ్లు, కొబ్బరికాయ, ముర్రాట సమర్పించవలెను.
తేది 23-04-2015 గురువారం సా||
3
గం||లకు శ్రీ దుర్గమ్మతల్లి పండగ అనుపు
శ్రీ దుర్గమ్మ తిరువీధి ఉత్సవము జరుపు కొన్నప్పుడు, పండ్లు, కొబ్బరికాయ, ముర్రాట శ్రీ దుర్గమ్మ రధం దగ్గర సమర్పించవలెను.
తేది 26-04-2015 ఆదివారం రాత్రి
12
గం||ల నుండి సనపచాటుట.
గమనిక:
సనపచాటు సమయంలొ ఎవరు బయట ఉండరాదు. సనపచాటుతున్నతనకి ఎదురుపడరాదు.
తేది 27-04-2015 సోమవారం శ్రీశ్రీశ్రీ భద్రమహంకాళి రాత్రి
12
గం||ల నుండి ప్రారంభం
శ్రీ భద్రమ్మతల్లి తిరువీధి సమయంలో పండ్లు, కొబ్బరికాయ, ముర్రాట శ్రీ భద్రమ్మతల్లికి సమర్పించవలెను.
గమనిక:
తేది 28-04-2015 నుండి 05-05-2015 తేది వరకు రోజు తప్పిరోజు కూటిగఠాలు పట్టుకొని మీమీ ప్రాంతాలకు వచ్చినప్పుడు భక్తులు దమ్మలవారి కాలుకడిగి దండం పెట్టవలెను.
తేది 05-05-2015 మంగళవారం సాయంత్రం ౩ గం||ల నుండి
శ్రీ శ్రీ శ్రీ భద్రమహంకాళితల్లి (తిరువీధి ఉత్సవము ) అనుపు పండగ.
పండ్లు, కొబ్బరికాయ, ముర్రాట శ్రీ భద్రమ్మతల్లి తిరువీధిలో మీమీప్రాంతాలకు వచ్చినప్పుడు సమర్పించవలెను.
గమనిక:
ఏటపోతులు ( కోళ్ళు గొర్రెలు, మేకలు ) శ్రీ భద్రమ్మతల్లి వచ్చినప్పుడు, అమ్మవారి ఎదురుగా వేటలువేయరాదు. అమ్మవారి దురంగా ఉన్నప్పుడు, వెళ్లిపోయిన తరువాత గాని వెనుకవేటగాని, కమిటీవారిని సహకరించవలెను.
ఇట్ల
ఆలయ కమిటీ, ఇలిసిపురం, శ్రీకాకుళం
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment