నిరుద్యోగులు అన్ని రంగాల్లోనూ రాణించాలి
ప్రజాశక్తి-నల్గొండ Sat, 6 Jul 2013, IST
నిరుద్యోగులు అధైర్యపడకుండా అన్నిరంగాల్లోనూ రాణించాలని అదనపు జెసి నీలకంఠం కోరారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ జాతీయ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ కంప్యూటర్స్ వారు నిర్వహించిన మల్టీమీడియా యానిమేషన్ అండ్ వెబ్డిజైనింగ్ కోర్సుల్లో శిక్షణ పొందిన నిరుద్యోగులకు ఆయన శనివారం స్థానికంగా సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత శిక్షణ పొందినవారు పట్టుదలతో ముందుకెళ్లి ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగుల యువతకు చిన్నపరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం నుండి సహాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పీడి రాజేశ్వర్రెడ్డి, నీ-ఎంఎస్ఎంఇ ప్రొగ్రామ్ డైరెక్టర్ జయకర్రావు, హెచ్ కంప్యూటర్స్ నిర్వాహకులు ఎంఎ జలీల్, గణేష్గౌడ్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment