మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి
ప్రజాశక్తి - కరీంనగర్ టౌన్ Thu, 4 Jul 2013, IST
సిఐటియుజిల్లా కార్యదర్శి సంపత్
కనీసవేతనం రూ. 15వేలు, ఎనిమిది గంటల పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5 తరువాత ఎప్పుడైనా సమ్మెకు సిద్దమని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ సంపత్ అన్నారు. 108 సర్వీసెస్ కాంట్రాక్టు ఎంప్లాయూస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గురువారం రిలే దీక్షలు ప్రాంరంభమయ్యాయి. ఈ దీక్షలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సిబ్బందిని జివికె సంస్థ వేధింపులకు గురి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడ ప్రమాదం జరిగినా వెంటనే స్పందించే 108 ఉద్యోగులకు కనీస వేతనాలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని ఆరు నెలలుగా సంస్థకు, ప్రభుత్వానికి పలు మార్లు విన్నవించినా స్పందన కరువైందని పేర్కొన్నారు. సిబ్బంది న్యాయమైన ఆందోళనకు ప్రజలు స్పందించాలని కోరారు. రిలే దీక్షలకు స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షలో సంఘం జిల్లా అధ్యక్షులు సిహెచ్ రాజు, ఉపాధ్యక్షులు ఎ రాజేందర్, సహాయక కార్యదర్శి టి రాజేందర్, కమిటీ సభ్యులు టి ఎల్లాగౌడ్, సదాచారి, గోపికృష్ణ, రవి, సంపత్, రాంభూపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
No comments:
Post a Comment