MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Sunday, July 7, 2013

అంగన్‌వాడీ ఆయాలకు ఉద్యోగ భద్రత కల్పించాలి

అంగన్‌వాడీ ఆయాలకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ప్రజాశక్తి-సిరిసిల్ల   Thu, 4 Jul 2013, IST 
అంగన్‌వాడీ ఆయాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని రహీమున్నీసాబేగం అన్నారు. పట్టణంలోని ఆర్‌డిఓ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు నిర్వహి స్తున్న రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. దీక్షనుద్దేశించి సిఐటియు నాయ కులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే కనీస వేతన చట్టాన్ని అమలుచేయాలని అన్నారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్ల వయోపరిమితిని 55సంవత్సరాలకు పెంచాలన్నారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ కల్పించాలని, ఉద్యోగ విరమణ అనం తరం అంగన్‌వాడీవర్కర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ. 50వేలు గ్రాడ్యుటీ ఇవ్వాలన్నారు. చివరి జీతంలో సగం మేరకు పింఛన్‌గా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంగన ్‌వాడీ సంస్థను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించకూడదని అన్నారు. అంగన్‌ వాడీల ద్వారా గద్దెనెక్కిన రాజకీయ నాయకులు వారి సమస్యలను పట్టించు కోకపోవడం దారుణ మన్నారు. ప్రభు త్వం ప్రతిపనినీ అంగన్‌వాడీలకే అప్ప జెప్పి వారితో వెట్టిచాకిరీ చేయిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ద్వారా అమలు అవుతున్న సంక్షేమ పద ¸కాలను అంగన్‌వాడీ కుటుంబాలకు కల్పించేలా చూడాలన్నారు. పెరుగుతున్న నిత్యవసర ధరల దృష్ట్యా అంగన్‌వాడీల వేతనాన్ని రూ.6వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దీక్షలో సైదాషఫి, వింధ్యారాణి, శ్రీవాణి, మంగ, ఒగ్గు విజయ, వనజ, శాంత, సరోజ సుమారు 200మంది ఆయాలు, అంగన్‌వడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
వేములవాడ రూరల్‌ :అంగన్‌వాడీలకు కనీస వేతనం పెంచాలని, సూపర్‌వైజర్‌ పరీక్షకు వయోపరిమితిని 55సంవత్సరాలు పెంచాలనే డిమాండ్లతో వేములవాడ మండల పరిషత్‌ కార్యాలయంలో ఆవరణ కార్యాలయంలో రెండవ రోజు నిరాహారదీక్షను కొనసాగించారు. ఈ దీక్షలో వేములవాడ ప్రాజెక్టు పరిధిలోని చందుర్తి, బోయినిపల్లి గ్రామాల అంగన్‌వాడీలు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడి కేంద్రాలను స్వచ్చంద సంస్థలకు కానీ మరేఇతర సంస్థలకు అప్పగించరాదని ఐసిడిఎస్‌ను సంస్థగతం చేయాలని డిమాండ్‌ చేశారు. సూపర్‌ వైజర్‌ పరీక్షలకు వయో పరిమితిని 55సంవత్సరాలకు పెంచాలన్నారు. అంగన్‌వాడీలకు ఐసిడిఎస్‌తో పాటు అనేక అదనపు పనులు రాష్ట్ర ప్రభుత్వ మాతో చేపిస్తుందని దీనిలో బిపిఎల్‌ సర్వేలు, బిఎల్‌వో డ్యూటీలు ఓటరు గుర్తింపు, రేషన్‌కార్డుల పంపిణీ, ఇందిరమ్మ అమృత హస్తం వంటి ప్రభుత్వ పథకాలను కింది స్థాయి ప్రజలకు చేరవేస్తున్నప్పటికి ప్రభుత్వం అతి తక్కువ జీతాలు ఇస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో భూజ్యోతి, తార, ఆయోష, రమాదేవి, విజయ, మంజుల, పద్మ, రాజ్యలక్ష్మి, వజ్రవ్వ, జి. లక్ష్మి, పద్మ, మమతలతో పాటు అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

No comments: