హైదరాబాద్ : అంగన్ వాడీ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. తాము చేస్తున్న సమ్మె కొనసాగుతుందని అంగన్ వాడీ ప్రకటించింది. సోమవారం అంగన్ వాడీ చేసిన పోరాటానికి ప్రభుత్వం తలొగ్గింది. చర్చలకు రావాలని సీఎస్ సాయంత్రం ఆహ్వానించారు. అంగన్ వాడీ వర్కర్ల, హెల్పర్ల యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.రోజా, మరికొందరు సిఐటియు నేతలు సచివాలయానికి వెళ్లారు. సమస్యల పరిష్కారం పై ఈనెల 26వ తేదీన మరోమారు చర్చలకు రావాలని అంగన్ వాడీ కార్యకర్తలకు సీఎస్ సూచించారు. భేటీ అనంతరం అంగన్ వాడీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. మా సమస్యలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, దీనిపై 26వ తేదీన చర్చలకు రావాలని సీఎస్ సూచించడం జరిగిందని తెలిపారు. ఇందిరాపార్కు వద్దనున్న ప్రతినిధులతో చర్చించిన తరువాత తమ భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని అంగన్ వాడీ ప్రతినిధులు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలతో కూడిన ఒక నివేదిక ఇవ్వడం జరిగిందని, 26వ తేదీన చర్చలకు వస్తామని అప్పుడు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే కృతజ్ఞతలు తెలియచేస్తామని లేకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
MARQUEE
Tuesday, February 25, 2014
చర్చలు విఫలం..సమ్మె కొనసాగుతుంది - అంగన్ వాడీలు Posted on: Mon 24 Feb 18:13:05.21079 2014
హైదరాబాద్ : అంగన్ వాడీ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. తాము చేస్తున్న సమ్మె కొనసాగుతుందని అంగన్ వాడీ ప్రకటించింది. సోమవారం అంగన్ వాడీ చేసిన పోరాటానికి ప్రభుత్వం తలొగ్గింది. చర్చలకు రావాలని సీఎస్ సాయంత్రం ఆహ్వానించారు. అంగన్ వాడీ వర్కర్ల, హెల్పర్ల యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.రోజా, మరికొందరు సిఐటియు నేతలు సచివాలయానికి వెళ్లారు. సమస్యల పరిష్కారం పై ఈనెల 26వ తేదీన మరోమారు చర్చలకు రావాలని అంగన్ వాడీ కార్యకర్తలకు సీఎస్ సూచించారు. భేటీ అనంతరం అంగన్ వాడీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. మా సమస్యలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, దీనిపై 26వ తేదీన చర్చలకు రావాలని సీఎస్ సూచించడం జరిగిందని తెలిపారు. ఇందిరాపార్కు వద్దనున్న ప్రతినిధులతో చర్చించిన తరువాత తమ భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని అంగన్ వాడీ ప్రతినిధులు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలతో కూడిన ఒక నివేదిక ఇవ్వడం జరిగిందని, 26వ తేదీన చర్చలకు వస్తామని అప్పుడు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే కృతజ్ఞతలు తెలియచేస్తామని లేకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment