-19 నుంచి స్పాట్ వాల్యూయేషన్ -ఏప్రిల్ చివరివారంలో ఫలితాలు
ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
ఇంటర్‌పరీక్షలు బుధవారం నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను ఇంటర్‌బోర్డు రమాశంకర్‌నాయక్ సోమవారం విలేకరుల సమావేశంలో వివరించారు. ఫస్టియర్, సెకండియర్ కలిపి రాష్ట్రవ్యాప్తంగా 19,78, 379 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాబోతున్నారని, వారిలో ఫస్టియర్ నుండి 9,29, 090 మంది, సెకండియర్ నుండి 10,49,289 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. పరీక్షల నిర్వహణ కోసం 2661 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందులో 975 ప్రభుత్వ, 187 ఎయిడెడ్, 1499 ప్రయివేటు కాలేజీలు ఉన్నాయని తెలిపారు. 95 సెల్ప్ కేంద్రాలుంటే, 230 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని అన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ ఉంటుందని, జిల్లా పరీక్షల కమిటీ, హైపవర్ కమిటీల ఆధ్వర్యంలో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. 133 ఫ్లయింగ్, 135 సిట్టింగ్ స్క్యాడ్స్‌ను నియమించామని తెలిపారు.
అక్రమాలకు పాల్పడిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పరీక్ష పేపర్ లీక్ కాకుండా ఉండేందుకు ఉదయం 8.30 గంటల నుండి 8.45 గంటల వరకు హాల్‌లోకి విద్యార్థులకు ప్రవేశం ఉంటుందని, ఆ తర్వాత వచ్చిన విద్యార్థుల బాధ్యతను కాలేజీల యాజమాన్యాలు తీసుకోవల్సి ఉంటుందని సూచించారు. ముఖ్యమైన పరీక్షలు ఈ నెల 29తో ముగుస్తాయని, స్పాట్ వాల్యూయేషన్ ఈ నెల 19 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. ఏప్రిల్ చివరివారంలో ఫలితాలు విడుదల చేస్తామని, స్పాట్ వాల్యూయేషన్‌లో తప్పులు దొర్లకుండా చూస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఎన్నికలు పరీక్షలకు ఆటంకం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో లెక్చరర్స్ పాల్గొనబోరని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వలన నాలుగైదు రోజులు స్పాట్‌వాల్యూయేషన్ ఆలస్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన 24 గంటల్లోనే ఇంటర్‌బోర్డు రెండుగా విభజన అవుతుందని పేర్కొన్నారు.
No comments:
Post a Comment