హైదరాబాద్ : అంగన్ వాడీ పోరాటానికి ప్రభుత్వం తలొగ్గుతున్నట్లు కనిపిస్తోంది. న్యాయబద్ధమైన డిమాండ్ లను తీర్చాలని కోరుతూ లక్షలాది మంది అంగన్ వాడీలు ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిపై పోలీసులు ప్రతాపం చూపడంతో అంగన్ వాడీ కార్యకర్తలు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. ఎక్కడికక్కడనే బైఠాయించారు. కార్యకర్తలను అరెస్టు చేసిన వాహనాలు వెళ్లకుండా రహదారులపై పడుకున్నారు. ఎండ వేడికి లెక్కచేయకుండా కూర్చొవడంతో పోలీసులు చేతులెత్తేశారు. పోలీసుల వైఖరి పట్ల అన్ని వైపుల నుండి విమర్శలు వచ్చాయి. తమ సమస్యలు తీర్చకుండా ఇక్కడినుండి కదిలేది లేదని అంగన్ వాడీలు భీష్మీంచుకూర్చొన్నారు. ఎక్కడికక్కడ అంగన్ వాడీలు బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. దీనితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చలకు పిలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం మాత్రం రాలేదు. కొద్ది గంటల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
MARQUEE
Tuesday, February 25, 2014
అంగన్ వాడీలను చర్చలకు పిలిచిన సీఎస్ ? Posted on: Mon 24 Feb 16:09:44.393796 2014
హైదరాబాద్ : అంగన్ వాడీ పోరాటానికి ప్రభుత్వం తలొగ్గుతున్నట్లు కనిపిస్తోంది. న్యాయబద్ధమైన డిమాండ్ లను తీర్చాలని కోరుతూ లక్షలాది మంది అంగన్ వాడీలు ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిపై పోలీసులు ప్రతాపం చూపడంతో అంగన్ వాడీ కార్యకర్తలు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. ఎక్కడికక్కడనే బైఠాయించారు. కార్యకర్తలను అరెస్టు చేసిన వాహనాలు వెళ్లకుండా రహదారులపై పడుకున్నారు. ఎండ వేడికి లెక్కచేయకుండా కూర్చొవడంతో పోలీసులు చేతులెత్తేశారు. పోలీసుల వైఖరి పట్ల అన్ని వైపుల నుండి విమర్శలు వచ్చాయి. తమ సమస్యలు తీర్చకుండా ఇక్కడినుండి కదిలేది లేదని అంగన్ వాడీలు భీష్మీంచుకూర్చొన్నారు. ఎక్కడికక్కడ అంగన్ వాడీలు బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. దీనితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చలకు పిలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం మాత్రం రాలేదు. కొద్ది గంటల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment