MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Tuesday, February 25, 2014

అంగన్ వాడీ పోరుతో దద్ధరిల్లిన నగరం... Posted on: Mon 24 Feb 16:13:03.091169 2014


హైదరాబాద్ : మాపై ఉక్కుపాదం మోపుతారా..మా తడాఖ చూపిస్తామని అంగన్ వాడీలు పోరాటాన్ని ఉధృతం చేశారు. సోమవారం అంగన్ వాడీలు చేపట్టిన 'చలో హైదరాబాద్' కార్యక్రమం ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించింది. వీరిని చెదరగొట్టడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలను అంగన్ వాడీలు తిప్పికొట్టారు. పోలీసులు ఈడ్చుకెళుతున్నా వారు కదలలేదు. తమ వారిని తీసుకెళ్లకుండా అడ్డు తగిలారు. పోలీసులు ఇష్టమొచ్చినట్లు లాగడంతో కొంతమంది మహిళా కార్యకర్తలకు గాయాలయ్యాయి. తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకునే దాక ఇక్కడి నుండి వెళ్లేది లేదని వారు భీష్మించుకూర్చొన్నారు. మా కడుపుమంట చల్లార్చాలి..మా న్యాయమైన డిమాండ్లు తీర్చాలి..పోలీసుల వైఖరి నశించాలి..అంటూ అంగన్ వాడీలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వీరి నినాదాలతో ఇందిరాపార్కు మొత్తం మారుమోగిపోయింది. వీరి చైతన్యాన్ని చూసిన పోలీసులు చేతులెత్తేశారు. అంగన్ వాడీ కార్యకర్తలతో అశోక్ నగర్, ఇందిరాపార్కు రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ రహదారిపై వాహనాల రాకపోకలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఇక్కడనే బైఠాయిస్తామని అంగన్ వాడీలు పేర్కొన్నారు. కనీస వేతనాలు చెల్లించాలని, తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా అంగన్ వాడీలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అంగన్ వాడీ వర్కర్లకు నెలకు రూ. 3,500, ఆయాకు రూ.1,950 మాత్రమే చెల్లిస్తున్నారు. అరకొర వేతనాన్ని మూణ్నెల్లు, ఆర్నెల్లకొకసారి చెల్లిస్తున్నారు. అంగన్ వాడీలు ఎలాంటి ప్రయోజనం ఆశించకుండానే మాత, శిశు సంరక్షణలో అపారమైన కృషి చేస్తున్నారు. తమిళనాడు, కేరళ కర్నాటక వంటి రాష్ట్రాల్లో అంగన్ వాడీలకు కనీస వేతనాలు చెల్లిస్తున్నారు. కాని మన రాష్ట్రంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో వీరికి వచ్చే వేతనం సరిపోవడం లేదు. దీనితో తమ వేతనాలు పెల్లించాలని..సమస్యలు పరిష్కరించాలని అంగన్ వాడీలు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం నుండి స్పందన లేకపోయేసరికి సోమవారం చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు. లక్షలాది మంది అంగన్ వాడీలు హైదరాబాద్ కు వచ్చారు. పోలీసులు ఆయా జిల్లాల్లో అరెస్టులు చేశారు. కొంతమంది లెక్క చేయకుండా ఇందిరాపార్కు వద్దకు చేరుకున్నారు. లక్షలాదిగా తరలిరావడంతో ఇందిరాపార్కు పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. వీరిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. పలువురిని ఈడ్చుకెళ్లారు. పోలీసుల వాహనాలకు అడ్డంగా అంగన్ వాడీలు పడుకున్నారు. వీరి పోరాటానికి ఎమ్మెల్సీ, ప్రొ.కె.నాగేశ్వర్ మద్దతు తెలిపి రోడ్డుపై బైఠాయించారు. పోరాట ఉధృతి తెలుసుకున్న పలు పార్టీల నేతలు అంగన్ వాడీల పోరుకు మద్దతు తెలిపారు.

No comments: