MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Friday, January 10, 2014

ఆర్టీసీలో కాంట్రాక్టు ఉద్యోగ నియామకాలు రద్దు

ఆర్టీసీలో కాంట్రాక్టు ఉద్యోగ నియామకాలు రద్దు Posted on: Fri 10 Jan 18:30:35.216924 2014 హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ (ఆర్టీసీ) లో కాంట్రాక్టు ప్రాతిపదికన జరిగే ఉద్యోగ నియామకాలను రద్దు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. బస్ భవన్ లో శుక్రవారం జరిగిన ఆర్టీసీ పాలకమండలి సమావేశంలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి పాలకమండలి కొత్త విధానాన్ని పొందించింది. ఇకపై తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల పేరిట నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాత కొత్త విధానంలో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు. ప్రస్తుత కాంట్రాక్టు కార్మికుల్లో 9,518 మందిని ఈ నెలాఖరుకు క్రమబద్ధీకరించాలని ఈ పాలక మండలి నిర్ణయించింది.


ACT NEWS


ACT SRIKAKULAM


ACT

1 comment:

Anonymous said...

"పోరాడితై పోయేదేమిలైదు. బానిస సంకెళ్ళు తప్ప".
"హక్కులకై కలబడు. బాధ్యతలకై నిలబడు".
"ఏదైన సాదించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం విమర్శిలను ఎదుర్కొనే సహనం ఉండాలి".

మిత్రులారా ఏకంకండి,
రేపు అనగా 11-01-2014 వ తేదిన హైదారాబాద్ నందు ఇందిర పార్కు వద్ద కంప్యూటర్ ఉపాధ్యాయుల సమస్యల సాధనకై జరగబోయే ధర్నాకి అన్ని కంప్యూటర్ ఉపాధ్యాయుల సంఘలు మరియు కంప్యూటర్ ఉపాధ్యాయులు రావలసిదిగా కోరుచున్నాం.
ఇట్లు,
ఐక్యకర్యచరన వేదిక.