Posted on: Fri 10 Jan 18:30:35.216924 2014
హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ (ఆర్టీసీ) లో కాంట్రాక్టు ప్రాతిపదికన జరిగే ఉద్యోగ నియామకాలను రద్దు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. బస్ భవన్ లో శుక్రవారం జరిగిన ఆర్టీసీ పాలకమండలి సమావేశంలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి పాలకమండలి కొత్త విధానాన్ని రూపొందించింది. ఇకపై తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల పేరిట నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాత కొత్త విధానంలో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు. ప్రస్తుత కాంట్రాక్టు కార్మికుల్లో 9,518 మందిని ఈ నెలాఖరుకు క్రమబద్ధీకరించాలని ఈ పాలక మండలి నిర్ణయించింది.
No comments:
Post a Comment