MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Sunday, September 24, 2017

కంప్యూటర్ విద్యను కొనసాగించాలని వినతి. కంప్యూటర్ విద్య అమలువుతుందా ???

జీవో.72లో...
1975నాటి రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా  1998 నవంబరు 16 నుంచి అమలయ్యేటట్లు విద్యాశాఖలోని స్కూల్‍ అసిస్టెంట్‍, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్‍ టీచర్లు, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రాప్టు, డ్రాయింగ్‍ పోస్టులను జిల్లా కేడర్‍గా, డైట్‍ సీనియర్‍ లెక్చరర్లు, మండల విధ్యాధికారులు, హైస్కూల్‍ ప్రధానోపాధ్యాయులను  జోనల్‍ కేడర్‍గా నిర్ణయించారు.
మరి ఏది కంప్యూటర్ ఉపాధ్యాయుల గురించి ఉత్తర్యులు (G.O) ??? 
ప్రభుత్వ బడుల్లో నిరుపయోగంగా రూ. కోట్లు విలువ చేసి కంప్యూటర్లు....   
పాఠశాలలో కంప్యూటర్ విద్య కొసం ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాల్సి ఉందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. 
పాఠశాలలో కంప్యూటర్ విద్య అమలువుతుందా ??? లేదా అటకెక్కిన కంప్యూటర్ విద్య ...
కొంత మంది కంప్యూటర్ ఉపాధ్యాయుల నాయకులు : కంప్యూటర్ ఉపాధ్యాయులను తిరిగి నియమించుట జరుగుతుంది అంటున్నారు... అమలు అవుతుందా....



No comments: