ఆరోగ్యంగా ఉండాలనుకున్నవారు నువ్వుల నూనెను ఎంచుకోవటం మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇది రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. నూనెలన్నింటిలో కంటే రుచికరంగా ఉంటుంది. ఈ నూనె సుగుణాలు తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..
* గుండె ఆరోగ్యంగా పని చేయాలంటే నువ్వుల నూనె తప్పని సరి. ఇది గుండెకు అవసరమైన 'ఫోలిక్ ఆమ్లం'ను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. రక్తన్ని శుద్ధి చేసి, లినొలెక్ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. అలాగే నరాల బలహీనతకు మంచి ఔషధం.
* నువ్వుల నూనెను ప్రతి రోజూ వంటల్లో ఉపయోగించటం చాలా మంచిది. ఎందుకంటే ఒత్తిడిని తగ్గించటంలో దీని ప్రాత కీలకం. అధిక రక్త పోటు రాకుండా నివారిస్తుంది.
* రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది. డయాబెటిస్ రాకుండా కాపాడుతుంది. దీంట్లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది.
* మిగతా నూనెలతో పొల్చుకుంటే నూవ్వుల నూనెలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఈ నూనెలో జింక్ ఎక్కువ శాతం ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా తయారు చేస్తుంది. దాంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
* దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి. అలాగే ఫ్రీ రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తాయి.
No comments:
Post a Comment