పాఠ్య పుస్తకాన్ని అర చేతిలో పట్టుకుని బోధించటం ఇదీ ప్రస్తుత విద్యావిధానం.అసలు పుస్తకం చేత పట్టుకోకుండా కేవలం రిమోట్ కంట్రోల్‌తో బోధించటం త్వరలో ఆవిష్కృతం కాబోతోంది.అదేమిటని ఆశ్చర్యపోతున్నారా? నిజమే నమ్మండి.
డిజిటల్ విద్య అనేది యానిమేషన్, లైవ్ చిత్రాలతో మిళితమై ఉంటుంది. ఇది విద్యార్థులకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీని వల్ల వారిలో సృజనాత్మక శక్తి పెరగటంతో పాటు ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది. తరగతులు ప్రారంభమై 50 రోజులు పైబడుతోంది. ఈ విద్యకు ఒక కంప్యూటర్, ఎల్‌సీడీ ప్రొజెక్టర్, భారీ తెర తదితర సామగ్రితో పాటు విద్యుత్తు సౌకర్యం ఉండాలి. ఇవన్నీ ఉంటే డిజిటల్ క్లాసులు అందుబాటులోకి వచ్చినట్లే. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కేవలం 40 పాఠశాలల్లో మాత్రమే ఈ విధానం అమలవుతోంది. ప్రభుత్వం కంప్యూటర్, తెరలు, పాఠ్యాంశాలకు సంబంధించిన కంటెంట్ సీడీలను మాత్రమే సరఫరా చేస్తోంది. మిగిలినవి పాఠశాలల ఉపాధ్యాయులు దాతల సహకారంతో వాటిని అధిగమిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ప్రతి ఉన్నత పాఠశాలలో డిజిటల్ బోధనకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేయటానికి పాఠశాల విద్యాశాఖ ద్వారా రూ.1.45 లక్షలు అందించాలని భావిస్తోంది. వాటికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం కోరింది. గుంటూరు జిల్లాలో రావెల పాఠశాలలో పూర్తిగా దాతల సహకారంతోనే డిజిటల్ తరగతులు ప్రారంభించి జిల్లాకు ఆదర్శంగా నిలిచారు. ఇటీవల కర్ణాటకకు చెందిన పాఠశాల విద్యాశాఖ బృందం గుంటూరు జిల్లా రావెల జడ్పీ ఉన్నత పాఠశాలకువచ్చి ఈ తరగతులు జరుగుతున్న విధానాన్ని పరిశీలించింది. తమ రాష్ట్రంలో వీటి అమలుకు ఇక్కడ అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆ రాష్ట్ర విద్యాశాఖ బృందం వ్యాఖ్యానించింది.
బోధనకే పరిమితం! ఇప్పటి వరకు ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకంలో ఏది ఉంటే అది పిల్లలకు మూసపద్ధతిలో బోధించి మీ చావు మీరు చావండని చేతులు దులుపుకొనేవారు. ఈ క్రమంలో అసలు నదులు, ప్రాజెక్టులు, పరిశ్రమలు.. పట్టణీకరణ, పోడు వ్యవసాయం వాటి విధి విధానాలు ఎలా ఉంటాయో కూడా కనీస పరిజ్ఞానం ఉండేది కాదు. దీనికి కారణం అసలు పరిశ్రమల వూహా చిత్రం ఎలా ఉంటుంది? అందులో ఏయే సెక్టార్లు ఉంటాయి.. ఏదైన ఒక వస్తువు ఉత్పత్తి ఎలా జరుగుతుందో నేరుగా పరిశ్రమలకు తీసుకెళ్లి చూపించకపోయినా.. కనీసం ఇలా ఉత్పత్తి జరుగుతుందని యానిమేషన్, విజ్వులైజ్డు పద్ధతుల ద్వారా తెలియజేసే ఏర్పాట్లు ఇప్పటి దాకా మన పాఠశాలల్లో లేవంటే అతిశయోక్తి కాదు. టీచర్ పాఠ్యపుస్తకంలో ఉన్న చిత్రాన్ని బ్లాక్ బోర్డుపై గీసి చెప్పటం మినహా మరో మార్గం లేదు. ఈ క్రమంలో ఆ బోధన వారిచెవికెక్కక పిల్లలు బుర్రబద్ధలు కొట్టుకుంటున్నారు. దీనికి స్వస్తి పలకాలని తరగతి గదిలోనే ప్రతి అంశంపై విద్యార్థికి కనీసం కొంత విషయ పరిజ్ఞానంతో పాటు అందుకు సంబంధించిన పరికరాలపై పరిచయం ఉండాలని చెప్పి డిజిటల్ విద్యలో భాగంగా ప్రతి పాఠ్యాంశాన్ని సోదాహరణంగా కంప్యూటర్ ద్వారా బోధించటానికి చర్యలు చేపట్టింది. అందులో భాగమే ఈ డిజిటల్ తరగతులు.

No comments:
Post a Comment