Sakshi | Updated: March 15, 2014 03:05 (IST)
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో ఉపాధ్యాయుల సర్వీసుల క్రమబద్ధీకరణకు డీఈఓ ఏ రాజేశ్వరరావు ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. విద్యా డివిజన్ వారీగా ఉపాధ్యాయుల సర్వీస్ క్రమబద్ధీకరణకు షెడ్యూల్ ప్రకటించారు. మొదటగా కందుకూరు డివిజన్ పరిధిలోని 17 మండలాల ఉపాధ్యాయుల సర్వీస్ క్రమబద్ధీకరణను చేపట్టనున్నారు.
దీని కోసం స్థానిక డీఆర్‌ఆర్‌ఎం హైస్కూలులో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. మండలాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో, ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న సెకండరీ గ్రేడు టీచర్లు, భాషా పండితులు, స్కూల్ అసిస్టెంట్లు, ఇతరుల సర్వీస్ రెగ్యులర్ చేస్తారు.
షెడ్యూలు ఇదీ..
కందుకూరు డివిజన్ పరిధిలోని 17 మండలాల ఎంఈఓలు ఎవరు ఏ రోజు సర్వీస్ క్రమబద్ధీకరణ ప్రతిపాదనలు, సేవాపుస్తకాలు తీసుకురావాలో డీఈఓ షెడ్యూలు ప్రకటించారు. ఈ నెల 24న కందుకూరు, వలేటివారిపాలెం, కొనకనమిట్ల మండలాలు, 25న లింగసముద్రం, గుడ్లూరు, జరుగుమల్లి మండలాలు, 26న ఉలవపాడు, సింగరాయకొండ, కొండపి మండలాలు, 27న పెదచెర్లోపల్లి, పామూరు, మర్రిపూడి మండలాలు, 28న హనుమంతునిపాడు, కనిగిరి, చంద్రశేఖరపురం మండలాలు, 29న వెలిగండ్ల, పొన్నలూరు మండలాల ఎంఈఓలు ఉపాధ్యాయుల సర్వీస్ క్రమబద్ధీకరణ ప్రతిపాదనలు, సర్వీస్ రిజిస్టర్లు, ఒంగోలులోని ప్రత్యేక విభాగంలో సమర్పించాలని కోరారు.
No comments:
Post a Comment