MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Saturday, March 15, 2014

అమ్మో 31వ తారీఖు !


-    కాంట్రాక్టు పారామెడికల్‌, ఎఎన్‌ఎం గుండెల్లో గుబులు  -    ప్రతిపాదనలు పంపని శాఖాదిపతులు  -   స్థంభించనున్న వైద్యసేవలు?  -    కొనసాగించకుంటే కలెక్టరేట్ల వద్ద ఆందోళన 


Posted on: Sat 15 Mar 03:28:09.811268 2014
 ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
      ప్రతీ నెలా చివరి రోజు అంటే అందరిలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఎందుకంటే తర్వాత రోజు జీతాలు వస్తాయని. కానీ వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేసే కాంట్రాక్టు పారామెడికల్‌, ఎఎన్‌ఎంలు, సెకండ్‌ ఎఎన్‌ఎం, యూరోపియన్‌ ఎఎన్‌ఎం, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిలో మాత్రం ఈ నెల 31వ తారీఖు అంటే గుండెల్లో గుబులు కలుగుతోంది. కారణం వీరి కాంట్రాక్టు ఆ రోజుతో ముగుస్తుంది కాబట్టి. ఆ తర్వాత రోజు నుంచి విధుల్లోకి వెళ్లే అవకాశం ఉండదు. మరోవైపు ప్రభుత్వానికి శాఖాధిపతుల నుంచి ప్రతిపాదనలు వెళ్లలేదు. ప్రభుత్వం కూడా వీరిని కొనసాగింపు దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 
ఇంకా వెళ్లని ప్రతిపాదనలు 
   వైద్య ఆరోగ్య శాఖలోని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ విభాగంలో 7 వేల మంది కాంట్రాక్టు పారామెడికల్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. మార్చి 31వ తేదితో కాంట్రాక్టు ముగుస్తున్నా వీరిని కొనసాగించే విషయమై ఇప్పటికీ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లలేదు. ప్రతిపాదనలు వెళ్తే దీనిపై ముఖ్య కార్యదర్శి ఆర్థిక శాఖ ఆమోదం తీసుకుని, మళ్లీ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కు పంపిస్తారు. ఇక్కడి నుంచి కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులు కింది స్థాయి వరకు పంపాల్సి ఉంటుంది. ఇంకా 15 రోజుల సమయం ఉంది. ఇంత తక్కువ సమయంలో ఈ పని సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 'కాంట్రాక్టు పారామెడికల్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది కొనసాగింపు గురించి ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ప్రభుత్వానికి ఇంకా ప్రతిపాదనలు పంపలేదు. పంపిస్తాం' అని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ ఎస్‌.అరుణకుమారి తెలిపారు. 
కొనసాగించకూడదని ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధానపరిషత్‌ (ఎపివివిపి) లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు మొత్తం సుమారు 5 వేల మంది ఉన్నారు. మార్చి 31వ తేది వరకే వీరిని కొనసాగించాలని, ఆ తర్వాత కొనసాగించకూడదని ఇప్పటికే ఎపివివిపి కమిషనర్‌ కనకదుర్గమ్మ ఆదేశాలిచ్చారు. వీరి కొనసాగింపు గురించి ప్రభుత్వానికి లేఖ రాశామని తగిన ఉత్తర్వులు రాలేదని సమాచారం. 31వ తేది తర్వాత వీరిని కొనసాగిస్తే మేం జీతాలివ్వలేమని, అందుకే కొనసాగించడం లేదని తెలిసింది. 
బెదిరిస్తున్న జిల్లా అధికారులు
   కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ పరిధిలో సుమారు 16 వేల మంది కాంట్రాక్టు ఎఎన్‌ఎంలు, సెకండ్‌ ఎఎన్‌ఎంలు, యూరోపియన్‌ ఎఎన్‌ఎంలు పనిచేస్తున్నారు. ఇప్పటికే వీరికి ఆరు నెలల నుంచి జీతాలు లేవు. వీరిని కొనసాగించే విషయంపై సందిగ్ధం నెలకొన్నది. తొలగించాలని ఆదేశాలు రాకున్నప్పటికీ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తారని జిల్లా అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శాఖలో రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఫైళ్ల విభజన పని జరుగుతోంది. దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపుపై ఇంకా దృష్టిపెట్టలేదు. 
కలెక్టరేట్‌ వద్ద ఆందోళన
    ఎఎన్‌ఎం, స్టాఫ్‌నర్స్‌, ఫార్మాసిస్టు, ల్యాబ్‌టెక్నీషియన్‌, ఆఫ్తాల్మసిస్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం జిఓ నం.39ని జారీ చేసింది. ఈ పోస్టుల్లో ఇప్పటికే 12 ఏళ్ల నుంచి కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిని రెగ్యులరైజ్‌ చేయకుండా ప్రభుత్వం మోసం చేసింది. రాతపరీక్ష నిర్వహించడం, సర్వీసు వెయిటేజి ఇస్తామని ప్రభుత్వం ఆశచూపినా దీన్ని సిబ్బంది అంగీకరించడం లేదు. రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాంట్రాక్టు పారామెడికల్‌, ఎఎన్‌ఎం, సెకండ్‌ ఎఎన్‌ఎం, యూరోపియన్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల గురించి ఇప్పటికే కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌, వైద్యవిధానపరిషత్‌ కమిషనర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కు రెండు రాష్ట్రాల యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ విజ్ఞప్తి చేసింది. మార్చి 31వ తేదితో పూర్తవుతున్న కాంట్రాక్టు కొనసాగించాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాదానాయక్‌, బలరాం, ఆంధ్రప్రదేశ్‌ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్లూరి వెంకటేశ్వర్లు, పలివెల శ్రీనివాసులు తెలిపారు. కొనసాగించకుండా చర్యలు తీసుకోని పక్షంలో రెండు రాష్ట్రాల్లోని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. వీరిని కొనసాగించకుంటే వైద్య, ఆరోగ్యశాఖ, ఆసుపత్రుల్లో సేవలు స్థంబించే అవకాశముంది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన నడుస్తోంది. పైగా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. గవర్నర్‌ పరిపాలన వ్యవహారాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారామెడికల్‌, ఎఎన్‌ఎం, సెకండ్‌ ఎఎన్‌ఎం, యూరోపియన్‌ ఎఎన్‌ఎం, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కాంట్రాక్టు కొనసాగింపు ఉత్తర్వులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.

No comments: