MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Tuesday, February 25, 2014

అంగన్‌వాడీల ఆగ్రహజ్వాల Posted on: Tue 25 Feb 03:02:20.760728 2014


- సిఎస్‌తో రేపు మరోసారి చర్చలు   
- సమ్మె కొనసాగింపు : నేతల పిలుపు  
- అక్రమ అరెస్టులు 
- అడుగడుగునా నిర్బంధం  
- దద్దరిల్లిన ధర్నాచౌక్‌  
- నేడు గవర్నర్‌ దృష్టికి సమస్యలు
- అంగన్‌వాడీల ఆగ్రహ జ్వాల
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో 
             అంగన్‌వాడీ కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించింది. అంగన్‌వాడీ కార్యకర్తలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రాష్ట్రవ్యాప్తంగా అడుగడుగునా అక్రమ అరెస్టులకు పాల్పడ్డారు. ప్రభుత్వ నిర్బంధాన్ని, పోలీసుల దమనకాండను అధిగమించి అరెస్టులకు భయపడకుండా చలో హైదరాబాద్‌ కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కార్యకర్తలు సోమవారం రాజధానికి వేలాదిగా తరలివచ్చారు. ఇందిరాపార్క్‌ వద్దకు కదంతొక్కారు. ఇందిరాపార్క్‌ వద్ద ఇసుకేస్తే రాలనంత మంది అంగన్‌వాడీలు వచ్చారు. డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు సచివాలయం వైపు దూసుకెళ్లారు. ఇందిరాపార్క్‌ వద్ద మెయిన్‌రోడ్‌పై బైఠాయించారు. దీంతో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, సిఐటియు నేతలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతి చర్చలకు ఆహ్వానించారు. అంగన్‌వాడీల సమస్యలను సావధానంగా విన్న మహంతి బుధవారం మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు. అంగన్‌వాడీల యూనియన్‌తో చర్చలు జరిపి మూడు రోజుల్లో నివేదిక పంపాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరిని ఆదేశించారు. అనంతరం అంగన్‌వాడీల సమ్మె కొనసాగుతుందని యూనియన్‌ నేతలు పిలుపునిచ్చారు. కనీస వేతనాలు రూ.10 వేలు పెంచాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని ఈనెల 17వ తేదీ నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మె చేపడుతున్న విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌కు అంగన్‌వాడీల సమస్యలను వివరించనున్నారు.
అంగన్‌వాడీలపై అడుగడుగునా నిర్బంధం
అంగన్‌వాడీ కార్యకర్తలపై పోలీసులు అడుగడుగునా నిర్బంధం ప్రయోగించారు. చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి రాకుండా ముందే అక్రమ అరెస్టులకు పాల్పడ్డారు. ముందే బుక్‌ చేసుకున్న బస్సులను, లారీలను రాకుండా చేశారు. రైళ్లలో వచ్చిన వారిని రైల్వేస్టేషన్లలోనే వేలాది మందిని అరెస్టు చేశారు. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ, జెబిఎస్‌ల నుంచి వచ్చే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
పోలీసులు దమనకాండకు నిరసనగా అంగన్‌వాడీ కార్యకర్తలు కాచిగూడ రైల్వేస్టేషన్‌లోనే బైఠాయించారు. కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. కొద్దిసేపటి తర్వాత వారిని అనుమతించడంతో ప్రదర్శనగా సుందరయ్య పార్క్‌ మీదుగా ఆర్టీసి క్రాస్‌ రోడ్‌ నుంచి ఇందిరాపార్క్‌కు చేరుకున్నారు. బస్సులు, ఇతర వాహనాల్లో వచ్చేవారిని హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోనే అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లు, ఫంక్షన్‌హాళ్లలో నిర్బంధించారు. నగరం, శివారు ప్రాంతాల్లోని పోలీస్‌ స్టేషన్లన్నీ అంగన్‌వాడీ కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి. నగర శివారు ప్రాంతాల్లోనే సుమారు 20 వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు సమాచారం. 
దద్దరిల్లిన ధర్నాచౌక్‌ 
హైదరాబాద్‌ నగరంలో అంగన్‌వాడీ కార్యకర్తలు కదంతొక్కారు. పోలీసుల నిర్బంధాన్ని ఛేదించి హైదరాబాద్‌కు భారీగా తరలివచ్చారు. అంగన్‌వాడీలను భయభ్రాంతులకు గురి చేసి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలను అధిగమించి ఇందిరాపార్క్‌కు వేలాది మంది చేరుకున్నారు. ఇసుకేస్తే రాలనంత మంది వచ్చారు. ఆర్టీసి క్రాస్‌రోడ్‌ నుంచి ఇందిరాపార్క్‌ వరకు, దోమలగూడ, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, అశోక్‌నగర్‌, గాంధీనగర్‌, కవాడిగూడ ప్రాంతాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు బారులు తీరారు. 'గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనాలు కావాలి, లక్షలేమో మీకా ముష్టి జీతం మాకా, ఎసిల్లోనా మీరా ఎండలోనా మేమా, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, సమస్యలు పరిష్కరించకపోతే కాంగ్రెస్‌కు పాతర, అరెస్టులు, నిర్బంధాలు ఉద్యమాన్ని ఆపలేవు, పోలీసుల జులుం నశించాలి'అంటూ పెద్దఎత్తున నినాదాలు చేయడంతో ధర్నాచౌక్‌ దద్దరిల్లింది. సిఐటియు జెండాలతో ఇందిరాపార్క్‌ పూర్తిగా ఎరుపుమయమైంది. అంగన్‌వాడీ కార్యకర్తలు ఎంతో ఉత్తేజంగా పాల్గొన్నారు. అంగన్‌వాడీల ధర్నాతో అశోక్‌నగర్‌, ఇందిరాపార్క్‌ రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. 
ఇందిరాపార్క్‌ వద్ద ఉద్రిక్తం 
న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు సచివాలయం ముట్టడి చేయాలని నిర్ణయించారు. ఇందిరాపార్క్‌ నుంచి వేలాది మంది ప్రదర్శనగా ముందుకొచ్చారు. ఇందిరాపార్క్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. అంగన్‌వాడీల ధర్నాకు అనుమతి లేదని పోలీసు లు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, అంగన్‌ వాడీలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ముందుకెళ్లడానికి యత్నించడంతో పోలీసులు వందలాది మంది అంగన్‌వాడీలను అరెస్టు చేశారు. ఈ సమయంలో ఇందిరాపార్క్‌ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. కొంతమంది కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు. వేలాది మందిని అడ్డుకొని అరెస్టు చేయడం సాధ్యం కాదని తెలుసుకున్న పోలీసులు చేతు లెత్తేశారు. దీంతో అంగన్‌వాడీలు ఇందిరాపార్క్‌ వద్ద మెయిన్‌ రోడ్‌పై బైఠాయించారు. అప్పటికే చేరుకున్న ఎమ్మెల్సీ కె నాగేశ్వర్‌ అంగన్‌వాడీలకు అండగా నిలిచారు. రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి సంఘీభావం తెలిపారు. అంతకు ముందు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌ వీరయ్య, ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు ఎం సాయిబాబు, ఆర్‌ సుధాభాస్కర్‌ ధర్నాచౌక్‌కు వచ్చి అంగన్‌వాడీల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

నేడు,రేపు నిరసన ప్రదర్శనలు : సిఐటియు 
అంగన్‌వాడీ కార్యకర్తల అక్రమ అరెస్టులను నిరసిస్తూ, సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ నిరసన ప్రదర్శనలు చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎం సాయిబాబు పిలుపునిచ్చారు. కార్మిక శక్తి ఐక్యత ముందు అరెస్టులు, నిర్బంధాలు, దమనకాండలు నిలబడవని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఇందిరాపార్క్‌కు చేరుకున్న వేలాది మంది అంగన్‌వాడీ కార్యకర్తలే నిదర్శనమని చెప్పారు. అంగన్‌వాడీల పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతి స్పందించారని తెలిపారు. మహంతి సమక్షంలో చర్చలు జరిగాయన్నారు. సమ్మె చేస్తున్న సంఘం ప్రతినిధులతో చర్చలు జరపాలని మహంతి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరిని ఆదేశించారని చెప్పారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో మరోసారి చర్చలు జరుగుతాయని వివరించారు. తమిళనాడు, కర్ణాటకలో అంగన్‌వాడీలకు వేతనాలు, గ్రాట్యుటీ ఎలా చెల్లిస్తున్నారో పరిశీలించాలని సిఎస్‌కు సూచించామన్నారు. బుధవారం చర్చల్లో నిర్దిష్టమైన ప్రతిపాదనలతో అధికారులు రావాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీల సమ్మె కొనసాగుతుందని చెప్పారు. అధికారులు తమ సమస్యలు పరిష్కరిస్తే సమ్మె విరమణపై ఆలోచిస్తామని, మొండివైఖరిని ప్రదర్శిస్తే కొనసాగిస్తామని హెచ్చరించారు. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టిన వారి వీపులు పగులగొడతామని చెప్పారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నిర్బంధాలతో ఏ శక్తీ తమ ఉద్యమాన్ని ఆపలేదని తెలిపారు.

No comments: