MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Monday, February 17, 2014

మధ్యాహ్న భోజన కార్మికుల అరెస్ట్‌ Posted on: Mon 17 Feb 13:26:12.150483 2014

ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం చేపట్టిన 'చలో హైదరాబాద్‌' కార్యక్రమం అరెస్టులతో ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన మహిళా కార్మికులతో ఇందిరాపార్కు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ధర్నా అనంతరం మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ రమ ఆధ్వర్యంలో కార్మికులు సచివాలయానికి ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
సమస్యలు పరిష్కరించాలి
అంతకముందు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎం సాయిబాబు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు అందించాలని, మెను ఛార్జీలు పెంచి తొమ్మిది, పది తరగతుల విద్యార్థుల పెండింగ్‌ బిల్లులను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కేవలం రూ.4.35తో విద్యార్థికి పౌష్టికాహారం ఎలా పెడతారని ప్రశ్నించారు. ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ మధాహ్న భోజన కార్మికులపై వేధింపులను ఆపాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరించాలంటూ నెల రోజులుగా దీక్షలు చేస్తున్న కార్మికులపై ఉక్కుపాదం మోపుతుంటడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇచ్చారని అదే స్కూళ్లలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలను ఎందుకు పెంచడంలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కార్మికులు సమస్యలను పక్కనబెట్టి కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూర్చే ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారని విమర్శించారు. తమిళనాడులో మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనం రూ.5,500 ఇస్తున్నారని, కర్నాటకలో కనీస వేతనంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించారని, కానీ మన రాష్ట్రంలో మాత్రం నెలకు రూ.1000 వేతనాన్ని చెల్లిస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే రూ.లక్ష, మంత్రికి రెండున్నర లక్షల వేతనం ఉంటుందని కానీ వీరికి రూ.వెయ్యి వేతనం ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు. 
మహిళా కార్మికుల పొట్టగొడుతున్న సర్కారు 
అనంతరం మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి వరలక్ష్మీ, ఎస్‌ రమ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని లక్షా 50 వేల కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు విద్యార్థులకు కోడిగుడ్డు వడ్డించడంలేదన్న సాకుతో ప్రభుత్వం కార్మికులను అక్రమంగా తొలగిస్తూ ఇస్కాన్‌, అక్షయపాత్ర, నాంది ఫౌండేషన్‌ వంటి సంస్థలకు ఈ పథకాన్ని కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందన్నారు. విద్యార్థులకు అందించే రెండో గుడ్డుకు అదనంగా బడ్జెట్‌ కేటాయించాలన్నారు. 
సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ తన ప్రసంగంలో ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎవి నాగేశ్వర్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్‌.పుణ్యవతి, కోశాధికారి అబ్బాస్‌, అంగన్‌వాడీ నాయకురాలు జయలక్ష్మీ, గ్రామ సేవకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు తదితరులు పాల్గొన్నారు.

No comments: