కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : నాగేశ్వర్
15:03 - February 15, 2014
15:03 - February 15, 2014
హైదరాబాద్ : ప్రభుత్యోద్యోగులతో సమానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కూడా మధ్యంతర భృతిని చెల్లించాలని ఎమ్మెల్సీ ప్రొ. నాగేశ్వర్ అన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శనివారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ప్రొ. కె.నాగేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 20 నుండి సమ్మె తలపెట్టనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ప్రభుత్యోద్యోగులందరికీ ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చిందని గుర్తుచేశారు. 20 ఏళ్లుగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్యోద్యోగులతో సమానంగా వీరికీ ఐఆర్ వర్తింపజేయాలని కోరారు.
No comments:
Post a Comment