MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Sunday, February 23, 2014

న‌ల్ల నోట్ల‌ను తెల్ల చేసేందుకే...

Posted on: Thu 20 Feb 23:41:41.794767 2014
ఇప్పుడు చేస్తున్నది ఒక విలువ కలిగిన నోట్లను పూర్తిగా చలామణిలోంచి తొలగించడమో లేదా రద్దు చేయడమో కాదని ఆర్‌బిఐ పేర్కొంటోంది. కేవలం పాత నోట్లకు బదులు కొత్తనోట్లను మార్పిడి చేయడమే అని చెబుతోంది. పైగా అనేక దేశాల్లో ఇటువంటి పద్ధతి అమల్లో ఉంటూనే ఉందని తెలుపుతోంది. పైగా చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లకు నకిలీ తయారుచేయకుండా నివారించగల, మరింత మెరుగైన భద్రత లక్షణాలు కలిగిన నోట్లు చలామణిలో ఉండేలా చూడడమే ఈ క్రమం లక్ష్యమని చెబుతోంది.

నిర్దిష్ట తేదీకి ముందు జారీ చేసిన కరెన్సీ నోట్లను ఉపసంహరించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బిఐ) స్పష్టం చేయాలి. లేని పక్షంలో నల్ల ధనం దాచుకున్నవారి దగ్గర ఉన్న లెక్కలోకి రాని ఆదాయం, సంపదకు రహస్య క్షమాభిక్షగా మాత్రమే ఈ పథకం ఉపయోగపడుతుంది. 2005కు ముందు జారీ చేసిన కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ జనవరి 22న ప్రకటించినప్పుడు తొలుత ఈ చర్య హానికరం కానిదిలా అనిపించింది. ఈ ఉపసంహరణ క్రమం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 2005కు ముందు జారీ చేసిన నోట్లను కలిగివున్నవారు వాటిని బ్యాంకుల్లో మార్పిడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ నోట్లను బ్యాంకుల్లో ఇచ్చేస్తే ఆ మొత్తానికి సరిసమానమైన 2005 లేదా ఆ తర్వాత జారీ చేసిన నోట్లను అందజేస్తారు. ఈ నోట్లను చాలా తేలికగానే గుర్తించవచ్చు. 2005కు ముందున్న నోట్ల మాదిరిగా గాకుండా వీటి వెనుక వైపున ఆ నోటు ముద్రించబడిన సంవత్సరం ఉంటుంది. 2005కు ముందునాటి నోట్లను కలిగివున్న వారందరూ తమ వద్ద ఎంత కరెన్సీ ఉంటే అంత మేర ఏ బ్యాంకు శాఖలోనైనా (ప్రభుత్వ లేదా ప్రైవేటు) మార్చుకుని వాటికి సరిసమానమైన కొత్త నోట్లను పొందవచ్చు. (రూ.5 నుంచి రూ.1,000 వరకూ ఏ నోటునైనా మార్చుకోవచ్చు). అయితే, ఈ రకంగా మార్చుకోవడానికి జూన్‌ చివరి వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. జులై ఒకటవ తేదీ నుంచి రూ.500 లేదా రూ.1,000 విలువ చేసే 10 కన్నా ఎక్కువ నోట్లను వారు తమకు ఖాతా ఉన్న బ్యాంకులో మార్చుకోవచ్చు లేదా గుర్తింపు కార్డు, నివాస చిరునామా ఆధారాలను అందజేసి మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే, సంబంధిత నోట్లు చెల్లుబాటు కావని ఆర్‌బిఐ ప్రకటించే వరకూ ఆ నోట్లు చెల్లుబాటు అవుతాయి. అయితే, ఈ మార్పిడి క్రమం జులై ఒకటి నుంచి భారం కానుంది. ఆ మార్పిడి చేసుకునే వ్యక్తి పేరు బయటకు వెల్లడించకుండా గోప్యత పాటించడానికి ఇక అక్కడితో స్వస్తి పలుకుతారు. ఈ రెండంచెల క్రమాన్ని పాత నోట్లను వదిల్చే కార్యక్రమాన్ని వేగిరపరచడానికి ఒక సాధనంగా తెచ్చారు. అయితే ఈ చర్య వెనుక కూడా ఇతర చిక్కులు లేదా పర్యవసానాలు ఉన్నాయి. అలాగే ఈ చర్య వెనుక గల అసలు ఉద్దేశాలు కూడా వేరే ఉండి ఉంటాయి.
పాత నోట్ల ఉపసంహరణ క్రమం స్వభావ, లక్షణాలు చూస్తే పైకి అంత హానికరం కాని చర్యలా కనిపిస్తోంది. కానీ, ఈ ప్రకటన వెలువడిన కొద్ది రోజుల్లోనే, కొన్ని వర్గాల్లో తీవ్ర అసౌకర్యాన్ని కలిగించినట్లు కనిపిస్తోంది, మరికొన్ని వర్గాల్లో భయాందోళనలకు కూడా కారణభూతమైంది. ఇందుకు గల కారణాలు చాలా ఉన్నాయి, విభిన్నంగా కూడా వున్నాయి. ఎవరైనా నగదు లావాదేవీలు జరిపినట్లైతే అందులో 2005కు ముందు నోటు ఉంటే దాన్ని తీసుకోవడానికి ఇబ్బందికరంగా భావించడం పైకి చూడగానే కనిపించే కారణం. అటువంటి నోట్లు కలిగివున్నవారు లేదా తెలియకుండా తీసేసుకున్నవారు తర్వాత ఆ నోట్లను తమ దగ్గర నుంచి వదిలించుకోవడానికి బ్యాంకుల వద్దకు పరుగెత్తాల్సి ఉంటుంది. కాగా బ్యాంకులు మాత్రం ఈ మొత్తం మార్పిడి క్రమాన్ని దీనికోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌ ద్వారానే జరపాల్సి ఉంటుంది. ఈ క్రమం పూర్తి కావడానికి చాలా సమయం తీసుకోవడమే గాకుండా చాలా శ్రమ కూడా పడాల్సి ఉంటుంది. పైగా ఇటువంటి టెల్లర్లు లేదా ప్రత్యేక కౌంటర్ల ఎదురుగా పెద్ద పొడవాటి క్యూలు ఉన్నపుడు శ్రమ, సమయం గడవడం అనేది చాలా దుర్భరంగా అనిపిస్తాయి. ఈ మార్పిడి క్రమం లాంఛనంగా ప్రారంభం కావడానికి, జులై ఒకటికి మధ్య పెద్దగా సమయం లేనందున, ఈ మొత్తం వ్యవహారం లేదా లావాదేవీలు సజావుగా సాగడమనేది ఆర్థిక వ్యవస్థలో ఎన్ని నోట్లు చలామణిలో ఉన్నాయనే అంశంపై ఆధారపడి ఉంటుంది. 2005కు ముందు ముద్రించిన నోట్లు ఇంకా ఈనాటికీ చలామణిలో ఉన్నాయని ఆర్‌బిఐ పేర్కొంది. అయితే ఇదేదీ ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రభావం కలిగించలేదనే విషయాన్ని కూడా ఆర్‌బిఐ స్పష్టం చేసింది.
ఒకసారి గనుక నా పర్సు చెక్‌ చేస్తే బహుశా ఇలాంటి నోట్లు ఎక్కువగా ఉండకపోవచ్చు. ఉదాహరణకు, ఒక 50 రూపాయల నోటుపై ఏ సంవత్సరం ముద్రించబడి ఉందనేది పెద్ద విషయం కాకపోవచ్చు. అది నిజం కూడా. కానీ, అంతకన్నా ఆలోచించాల్సిన విషయమేమంటే అటువంటి నోట్లు చాలా ఉండి ఉండవచ్చునని దీని గురించి తెలిసినవారిని ఉటంకిస్తూ మీడియా పేర్కొంటోంది. ఉదాహరణకు, ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్‌ చీఫ్‌ను ఉటంకిస్తూ బిజినెస్‌ లైన్‌ పత్రిక ఇలా వ్యాఖ్యానించింది. 'ఇటువంటి కరెన్సీ దాదాపు రూ.11 వేల కోట్లు ఉండవచ్చు. దీనిలో 20 నుంచి 30 శాతం నల్ల ధనమే. అది కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆ సమయంలో నిబంధనలు అంత కఠినంగా లేవు' అని పేర్కొంది. ఒకవేళ ఈ లావాదేవీల్లో అంత పెద్ద మొత్తాలే గనుక ఇమిడి ఉంటే, పాత నోట్ల స్థానే కొత్త నోట్లను తీసుకురావడం పెద్ద సమస్యే కాగలదు. ఎటిఎంలు, టెల్లర్‌ మిషన్‌ లావాదేవీలతో పాటు పైన పేర్కొన్న ప్రక్రియకు అవసరమైనన్ని కొత్త నోట్లు బ్యాంకుల వద్ద, వాటి బ్రాంచీల వద్ద ఉన్నాయని కేంద్ర బ్యాంకు హామీ ఇవ్వగలదా? పైగా దీనితో పాటు అందుకునే ప్రతి నోటూ దెబ్బతినకుండా ఉందా, లేదా అని చూసుకోవాల్సి రావడం కూడా చాలా అసౌకర్యానికి కారణమవుతుంది. ఇటువంటి అసౌకర్యమనేది తాత్కాలికమే అయినా పరిష్కారమయ్యే అవకాశం కూడా ఉంది. అయితే దానికిగానూ కేంద్ర బ్యాంకు తీసుకునే పాత నోట్లు మొత్తం పంపిణీలో ఉన్నవాటికి సరిపడా ఉండాలి. అప్పుడు సమస్య రాదు. ఇప్పుడు చేస్తున్నది ఒక విలువ కలిగిన నోట్లను పూర్తిగా చలామణిలోంచి తొలగించడమో లేదా రద్దు చేయడమో కాదని ఆర్‌బిఐ పేర్కొంటోంది. కేవలం పాత నోట్లకు బదులు కొత్తనోట్లను మార్పిడి చేయడమే అని చెబుతోంది. పైగా అనేక దేశాల్లో ఇటువంటి పద్ధతి అమల్లో ఉంటూనే ఉందని తెలుపుతోంది. పైగా చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లకు నకిలీ తయారుచేయకుండా నివారించగల, మరింత మెరుగైన భద్రత లక్షణాలు కలిగిన నోట్లు చలామణిలో ఉండేలా చూడడమే ఈ క్రమం లక్ష్యమని చెబుతోంది. మార్పిడి చేయగలిగే నోట్ల సంఖ్యపై పరిమితి కూడా లేదు. జులై 1 లోగా గనక ఈ మార్పిడి క్రమం పూర్తి చేసుకుంటే ఇక గుర్తింపు కార్డుల ప్రహసనం కూడా అవసరం లేదు.
అయితే మొత్తం ఈ క్రమం పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్నవారూ లేకపోలేదు. ఇటీవల లావాదేవీలు జరపడం వల్ల కాలం చెల్లిన నోట్ల భారాన్ని మోస్తున్నవారు దాని విలువను పూర్తిగా ప్రకటించలేరు. ఉదాహరణకు రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనివారికి ఇలాంటి సమస్య ఉంటుంది. వీరికి వచ్చే ఆదాయం, లేదా సంపద ఎక్కువ మొత్తం 'లెక్కకురాని' లేదా 'నల్ల ధనం'గా ఉంటుంది. ఇటువంటి లావాదేవీల్లో ఉన్న కరెన్సీ కట్టలు కానీ లేదా ఆ రియల్‌ ఎస్టేట్‌ ఆర్థిక వ్యవస్థలో ఉన్న మొత్తాలు కానీ క్రమం తప్పకుండా వెల్లడించేవి కావు. ఇతర, ఇదే రకమైన లావాదేవీల్లో ఈ మొత్తాలు తిరుగుతూ ఉంటాయి. ఫలితంగా పాత నోట్లు చలామణిలో ఉంటాయి. ఈ వర్గాలకు 2005 ముందు నాటి నోట్లు అంటే బహుశా పెద్ద మొత్తంలోనే కట్టలుగా ఉండవచ్చు. వీటిని చిన్న మొత్తాల్లో మార్పిడి చేయడమంటే చాలా కష్టసాధ్యమే కాగలదు. పైగా, ఒకే లావాదేవీ రూ.50 వేలు దాటితే అప్పుడు కూడా గుర్తింపు కార్డు లేదా నివాస అడ్రసు కావాలని బ్యాంక్‌ డిమాండ్‌ చేయనందున ప్రస్తుత మార్గదర్శక సూత్రాల ప్రకారం, లావాదేవీలు నిర్వహించే వారి పాన్‌ నెంబరు మాత్రం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ మార్పిడి లావాదేవీలు రూ.10 లక్షలు దాటితే అప్పుడు ఆ లావాదేవీలు మనీ లాండరింగ్‌ నివారణా చట్టం కిందకు వస్తాయి. నల్ల ధనం వ్యవస్థలో పెద్ద మొత్తాలు ఇమిడివున్నందున బహుముఖ లావాదేవీల ద్వారా వాటిని తప్పించడానికి ప్రయత్నించేవారిపై ఒక కన్నువేసి ఉంచినట్లైతే అటువంటి బడా నేరస్తులను గుర్తించడానికి వీలుంటుంది. బహుశా ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌ కెసి చక్రవర్తి ఇటీవల బెంగళూరులో ఐఐఎం సమావేశంలో మాట్లాడి ఉంటారు. నకిలీ కరెన్సీకి చెక్‌ పెట్టడానికి, నల్ల ధనాన్ని వెలికితీయడానికే 2005 ముందు నాటి కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే బహిరంగంగా ప్రకటించిన లక్ష్యాల కన్నా కూడా ఇంకా విస్తృతంగానే ఆలోచనలు, ఉద్దేశాలు ఆర్‌బిఐకి ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ చొరవలో అంతర్లీనంగా ఉన్న ఆర్‌బిఐ అప్రకటిత (బహుశా ఉద్దేశపూర్వకంగా కాని) లక్ష్యం బహుశా నల్లధనాన్ని వెలికితీయడం కావచ్చు. మరీ ముఖ్యంగా ప్రకటించిన సమయాన్ని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మరో మూడు, నాలుగు మాసాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశంలో బడా పార్టీలన్నీ ఓటర్లను ఆకర్షించడానికి దాచిపెట్టిన సొమ్మంతా బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన గరిష్ట పరిమితి లేదా అంతకు తక్కువ మొత్తంలోనే ఖర్చు చేసే పార్టీలు గానీ, అభ్యర్ధులు గానీ లేదా నిర్దిష్ట నియోజకవర్గాలు గానీ ఉన్నాయంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. పోలీసులు, ఎన్నికల కమిషన్‌ పర్యవేక్షణా సంస్థలు స్వాధీనం చేసుకునే నగదు మొత్తాల కథనాలు సర్వసాధారణం. అయితే, ఈ మొత్తాలను కొత్త కరెన్సీ నోట్లతో మార్చడం అనివార్యమైతే వాటిని ఖర్చు పెట్టడానికి ఎక్కువ కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ఆర్‌బిఐ చేపట్టిన ఈ నోట్ల ఉపసంహరణ క్రమం అనేది ఆ డబ్బును ఉపయోగించడానికి ఒక అవరోధంగా రుజువవుతుంది. అందువల్ల ఈ చర్యకు రాజకీయ వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అయితే, కాలం చెల్లిన నోట్లను ఉపసంహరించాలన్న ఆర్‌బిఐ చర్యతో సామాన్యుడికి భారంగా మారిన ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని దీన్ని వ్యతిరేకిస్తున్నవారు చూస్తున్నారు.
ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌ ఇంతకుముందు పేర్కొన్నట్లుగా నకిలీ నోట్ల చలామణి, నల్ల ధనం అక్రమ నిల్వలు, వాటిని వినియోగంలోకి తీసుకురావడం వంటి రుగ్మతలను పరిష్కరించేందుకే ఈ చర్యలనేది ఆర్‌బిఐ వాస్తవ ఉద్దేశాలే అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి. అప్పుడు ఆర్‌బిఐ నల్ల ధనానికి, ప్రముఖ రాజకీయ శక్తులకు వ్యతిరేకిగా మారవచ్చు. దీనికి తోడు సామాన్యుడికి బ్యాంక్‌ అంటే చికాకు కలిగేలా చేస్తుంది. ఆర్‌బిఐ ప్రస్తుత పాత్ర, స్వభావాలను బట్టి చూస్తే, ఈ పాత్ర తీసుకునే లేదా చేపట్టే అవకాశాలు చాలా తక్కువ. అందువల్ల, కాలం చెల్లిన కరెన్సీ నోట్ల ఉపసంహరణకు సంబంధించి ఈ విన్యాసాలన్నీ కూడా నల్ల ధనంపై చూపే ప్రభావం ఏమైనా ఉందా అంటే, అది కచ్చితంగా ఇప్పటివరకు దాచిపెట్టిన లెక్కకురాని, అప్రకటిత ఆదాయ, సంపదలను వెల్లడించే నల్ల ధనం నిల్వదారులకు రహస్యంగా క్షమాభిక్ష పెట్టడమే కాగలదు. రూ.50 వేలు, రూ.10 లక్షలు దాటిన మొత్తాల లావాదేవీలకు సంబంధించి వరుసగా క్లయింట్‌ పాన్‌ నంబరు లేదా ఆర్థిక నిఘా వర్గాలకు తెలియచేయడమనే క్రమాన్ని దీన్నుండి వేరు చేసి చూసినట్లైతే పెద్ద మొత్తంలో నల్ల ధనమంతా కూడా తెల్లగా మార్చేందుకు ఇది చాలా సులభమైన పద్ధతే అవుతుంది. ఈ మార్పిడి క్రమాన్ని వేగవంతం చేసేందుకు, అలాగే సంప్రదాయసిద్ధమైన లావాదేవీలుగా కాకుండా ఈ అవసరాలన్నింటినీ తీర్చే ప్రత్యేక లావాదేవీగా చూడాలంటూ ఆర్‌బిఐ బ్యాంకింగ్‌ వ్యవస్థ మొత్తానికి ఆదేశాలు జారీ చేస్తే అప్పుడు ఈ మార్పిడి క్రమం మరికొన్ని శక్తివంతమైన వర్గాల లేదా శక్తుల అభిమానం చూరగొనే అవకాశం ఉంది. అప్పుడు వారు భయాన్ని వీడి నల్లధనం బయటపెట్టడానికి ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు భద్రత లేని నోట్లను ఆర్థిక చలామణి వ్యవస్థ నుంచి తొలగించాలన్న ఆర్‌బిఐ లక్ష్యం నెరవేరుతుంది. అలాగే పెద్ద మొత్తంలో అప్రకటిత ధనాన్ని నిల్వచేసే నేరస్తులకు కూడా ఇది కొంతమేరకు ప్రయోజనం కలిగిస్తుంది. కానీ దేశ ఖజానాకు, రుజువర్తనకు, పారదర్శకతకు మాత్రమే నష్టం జరుగుతుంది. అయితే అంతిమంగా ఈ క్రమం నుంచి అటువంటి ఫలితం రాకపోవచ్చునని ఆశిద్దాం.
--- పి చంద్రశేఖర్‌

No comments: