MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Sunday, February 23, 2014

ఆధార్ న‌యా ఉదార‌వ‌ద ల‌క్ష్యా‌ల‌కు ముసుగు

Posted on: Fri 21 Feb 22:30:25.666853 2014
ద్రవ్య లోటును కుదించేందుకు గానూ సామాజిక రంగ పథకాల్లో మరింతగా ఆధార్‌ను ఉపయోగించడాన్ని వేగవంతం చేయడానికి ప్రధాని చాలా ఆత్రుత చూపారు. ప్రధానికి, యుపిఎ ప్రభుత్వానికి నగదు బదిలీ అనేది ఒక సాధనం వంటిది. భారత ప్రభుత్వ సామాజిక పాత్రను నాణ్యతాపరంగా పునర్నిర్మించడానికి ఉపయోగపడే సాధనంగా దీన్ని చూస్తున్నారు. వస్తువులు, సేవలను ప్రత్యక్షంగా అందించేవారి దగ్గర నుంచి పరోక్షంగా అందించేవారికి కూడా దీన్ని తప్పనిసరి చేస్తున్నారు. నగదు బదిలీని తెరపైకి తేవడంతో, సబ్సిడీ ధరలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార పదార్థాలు, ఎరువులు, వంటగ్యాస్‌ సిలిండర్లు, కిరోసిన్‌ల సరఫరాను నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

ఆధార్‌ తప్పనిసరా? ఒకవేళ తప్పనిసరే అయితే, దీనికి గల చట్టబద్ధమైన ప్రాతిపదిక ఏమిటి? ఆధార్‌ లేకపోతే సబ్సిడీతో కూడిన వంట గ్యాస్‌ను ఎవరైనా కొనగలరా? దీనిపై ప్రభుత్వ విధానమేంటి? వాస్తవానికి, ఈ ప్రశ్నలకు యుపిఎ ప్రభుత్వ స్పందన చూస్తే ఉద్దేశపూర్వకమైన ఒక సందిగ్ధత కనిపిస్తోంది. ఇక్కడ అనిశ్చితి లేదా సందిగ్ధత అనేది ఉద్దేశపూర్వకమే. ఎందుకంటే ప్రభుత్వం పైకి చెబుతున్న వాటికి, లోపల దాని ఉద్దేశాలకు చాలా తేడా ఉంది. అందువల్లే ఉద్దేశపూర్వకంగానే ఆ సందిగ్ధతను పాటిస్తోంది. ఆధార్‌కు సంబంధించి యుపిఎ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అనుసరిస్తున్న ఉద్దేశపూర్వకమైన సందిగ్ధతలో గందరగోళం, తప్పుడు భాష్యం చెప్పడం, అస్థిరత, నిజాయితీ కొరవడడం వంటి అంశాలున్నాయి.
ఇక్కడ గందరగోళం, అయోమయానికి సంబంధించి ప్రభుత్వ మొదటి ప్రయత్నం చూస్తే ఆధార్‌ను హోం మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సిటిజన్స్‌ (ఎన్‌ఆర్‌ఐసి)తో ముడిపెట్టింది. 2000 సంవత్సరం మధ్యలో ఒక సాంకేతిక సంస్థగా భారత విశిష్ట గుర్తింపు సంస్థ (యుఐడిఎఐ) ఏర్పడింది. ఇది కూడా హోం మంత్రిత్వ శాఖకు అనుసంధానించబడింది. బహుళార్థ ప్రయోజనాలు గల జాతీయ గుర్తింపు కార్డు (ఎంఎన్‌ఐసి) ప్రాజెక్టు కింద సేకరించిన పౌరుల బయోమెట్రిక్‌ సమాచారాన్ని నకిలీ కాకుండా చూడాల్సిన బాధ్యత యుఐడిఎఐది. పైగా దీన్ని ఎన్‌ఆర్‌ఐసితో ముడిపెట్టారు. పౌరసత్వ చట్టం, 2003 ఆమోదం పొందిన తర్వాత ఎన్‌ఆర్‌ఐసిలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడమనేది తప్పనిసరి అయింది. (2003 చట్టం కింద ఎన్‌ఆర్‌ఐసిలో బయోమెట్రిక్స్‌కు స్థానం లేదు. దీనిపై సిపిఎం చాలా స్పష్టమైన వైఖరి తీసుకుంది. కానీ ఆ చర్చను మనం ఇక్కడ వాయిదా వేద్దాం). అయితే, 2009లో యుఐడిఎఐని నెలకొల్పినప్పుడు దాన్ని ప్రతిపాదిత అభివృద్ధి లక్ష్యంతో ప్రణాళికా సంఘానికి అనుసంధానించారు. ఇప్పుడు ఎన్‌ఆర్‌ఐసిలో జాతీయ గుర్తింపు సంఖ్య, ఆధార్‌ ఈ రెండూ వేర్వేరు కాదు, ఒకటే. అప్పుడు రెండు లక్ష్యాలతో ఒక వ్యూహాన్ని రూపొందించారు. అవి (ఎ) ఆధార్‌కు సంబంధించిన ఎడతెగని భద్రతా పార్శ్వానికి ముసుగు వేయడం, (బి) యుఐడిఎఐ డేటాబేస్‌లోకి వేగంగా నమోదు చేసేందుకు హామీ ఇవ్వడం. ఆ రకంగా, అధికారికంగా, ఆధార్‌ స్వచ్ఛందమని ప్రభుత్వం పేర్కొంది. ఆధార్‌ అనేది స్వచ్ఛంద సర్వీసు అని, ప్రస్తుత పత్రాలతో నిమిత్తం లేకుండా ప్రతి పౌరుడూ దీన్ని ఉపయోగించుకోవచ్చునని యుఐడిఎఐ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. కానీ ఆచరణలో మాత్రం, ఆ విధానం విభిన్నమైన మలుపు తీసుకుంది. మొదటగా, ఆధార్‌కు ఎలాంటి భద్రతా పార్శ్వాన్ని కల్పించేందుకు నిరాకరించారు. యుఐడిఎఐ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు జవాబుదారీగా ఉండి జనాభా లెక్కల కమిషనర్‌ను తమ రిజిస్ట్రార్‌గా నియమించుకుంది. ఆ విధంగా, ఎన్‌ఆర్‌ఐసిలో ఎవరైతే తమ పేరు చేరుస్తారో వారు ఆటోమేటిక్‌గా ఆధార్‌ కూడా అందుకుంటారు. ఇక రెండవది, ఆధార్‌ను అందజేస్తే సేవల నిబంధనలను తాత్కాలికంగా రూపొందించేలా ప్రభుత్వ సేవలను అందించేవారిని బుజ్జగించేందుకు యుఐడిఎఐ ప్రయత్నించింది. అటువంటి ప్రభుత్వ సర్వీసులకు యుఐడిఎఐ ఒక పేరు పెట్టింది. అదే 'కిల్లర్‌ అప్లికేషన్స్‌'.
కాగా కొన్నాళ్ళకు, ప్రభుత్వ వాస్తవిక ఉద్దేశాలపై ప్రతిపాదకుల్లో అగ్ర స్థానంలో ఉన్నవారు చాలా స్పష్టంగా తమ భావాలను వెలిబుచ్చారు. 2011 జనవరిలో దావోస్‌లో మాంటెక్‌ సింగ్‌ అహ్లూవాలియా మాట్లాడుతూ, 'ప్రభుత్వ కార్యక్రమాల నుంచి ఎవరైతే లబ్ది పొందుతున్నారో వారు తప్పనిసరిగా యుఐడి నెంబరు కోసం రిజిస్టర్‌ చేసుకోవాలని' తాము కోరనున్నట్లు చెప్పారు. అదే నెలలో నందన్‌ నీలేకని 'తప్పనిసరి' అనే పదాన్ని 'స్వచ్ఛందంగా' అని మార్పు చేసేందుకు సాహసోపేతమైన ప్రయత్నమే చేశారు. 'అవును, ఆధార్‌ స్వచ్ఛందమే. కానీ సేవలు అందించేవారు మాత్రం దాన్ని తప్పనిసరి చేయవచ్చు. సుదీర్ఘ కాలంలో, దీన్ని తప్పనిసరి అని నేను పిలవకపోవచ్చు. కానీ అంతటా ఇదే ఉంటుందని మాత్రం చెప్పగలను' అని ఉద్ఘాటించారు. 'ఆధార్‌ కార్డు లేకపోతే, హక్కులను పొందే హక్కు మీకు ఉండదని' 2012 నవంబరులో నందన్‌ నీలేకని చెప్పారు. హడావిడి, గందరగోళం ఇవన్నీ కలిసి తప్పుడు భాష్యానికి దారి తీశాయి. బలవంతంగానైనా పేరు నమోదు చేసుకోవడానికి ఇంత త్వరపడడం వెనుక ఇంకో పద్ధతి ఉంది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. 'ఆధార్‌ పరపతి సమర్ధవంతంగా ఉపయోగించగల ఒక అనువర్తననైనా ప్రభుత్వం చూపించాల్సిన అవసరముంది. పైగా, ద్రవ్య లోటును కుదించేందుకు గానూ సామాజిక రంగ పథకాల్లో మరింతగా ఆధార్‌ను ఉపయోగించడాన్ని వేగవంతం చేయడానికి ప్రధాని చాలా ఆత్రుత చూపారు. ప్రధానికి, యుపిఎ ప్రభుత్వానికి నగదు బదిలీ అనేది ఒక సాధనం వంటిది. భారత ప్రభుత్వ సామాజిక పాత్రను నాణ్యతాపరంగా పునర్నిర్మించడానికి ఉపయోగపడే సాధనంగా దీన్ని చూస్తున్నారు. వస్తువులు, సేవలను ప్రత్యక్షంగా అందించేవారి దగ్గర నుంచి పరోక్షంగా అందించేవారికి కూడా దీన్ని తప్పనిసరి చేస్తున్నారు. నగదు బదిలీని తెరపైకి తేవడంతో, సబ్సిడీ ధరలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార పదార్థాలు, ఎరువులు, వంటగ్యాస్‌ సిలిండర్లు, కిరోసిన్‌ల సరఫరాను నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి బదులుగా, ఈ సబ్సిడీలన్నీ నగదు రూపంలో లబ్దిదారుని బ్యాంక్‌ ఖాతాకు బదిలీ అవుతాయని, ఆ రకంగా, సబ్సిడీతో కూడిన వస్తువుల సరఫరాలో ఉండే అవినీతి, లీకేజీలను అంతమొందించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందని చెప్పింది. ఈ వ్యూహానికి సైద్ధాంతిక ప్రాతిపదిక అనేది 2009-10 సంవత్సరానికి జరిగిన ఆర్థిక సర్వే చాప్టర్‌ 2 ఇలా పేర్కొంది. 'సబ్సిడీ పథకం అనేది ధరల నియంత్రణతో ముడిబడి ఉందనుకోవడమే ఇక్కడ సర్వసాధారణంగా జరిగే తప్పిదం. ఇది సాధారణంగా పక్కకు వైదొలగే అంశం. అందువల్ల, ధరలను మార్కెట్‌కు వదిలిపెట్టడం అత్యుత్తమం. పేదలైన వినియోగదారులు ఈ మార్కెట్‌ మార్పుల దాడికి గురి కాకుండా ఉండేలా మనం హామీ కల్పించాలంటే జోక్యం చేసుకోవడం ఒక్కటే ఉత్తమ మార్గం. దీనివల్ల పేదలకు నేరుగా సహాయపడడమే కాకుండా ధరలు కూడా నియంత్రించడానికి ప్రయత్నించవచ్చు.'
ఆ రకంగా, గ్యాస్‌ సిలిండర్ల నిబంధనలో నేరుగా నగదు బదిలీ కార్యక్రమాన్ని ఆధార్‌కు ప్రధాన కిల్లర్‌ అప్లికేషన్‌గా ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కాకుండా, చిన్న చిన్న అంశాలు చాలా ఉన్నాయి. ఆధార్‌ లేకపోతే దళిత, ఆదివాసీ విద్యార్థులకు మెట్రిక్యులేషన్‌ అనంతర స్కాలర్‌షిప్పులు నిలిపి వేస్తారు. వేతన జీవులకు ప్రావిడెంట్‌ ఫండ్‌ లావాదేవీలు అనుమతించబడవు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించబడవు. ఢిల్లీలో అయితే చివరకు వివాహ నమోదు కూడా అనుమతించబడదు. ఇక భవిష్యత్‌కు సంబంధించి చూస్తే ఆహార భద్రత చట్టం ఆమోదించినప్పుడు నగదు బదిలీకి గల అవకాశాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఆధార్‌ తప్పనిసరి అంటూ పెట్టిన షరతులతో ఆందోళన చెందిన ప్రజానీకం పిచ్చిగా పరుగులు తీశారు. ఆధార్‌ విషయంలో భారతీయులు పరుగులకే ఓటు వేస్తున్నారంటూ నీలేకని ఆనందంతో ప్రకటించారు కూడా. మరింతమందిని ఆధార్‌ కోసం నమోదు చేసుకోమని ఒత్తిడి తీసుకురావడం ద్వారా నగదు బదిలీని 'గేమ్‌ ఛేంజర్‌'గా ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఈ పథకం ఉపయుక్తతపై యుపిఎ మంత్రుల్లో ఒకరు బహిరంగంగానే విబేధిస్తున్నారు. 2012 డిసెంబరు 22న చిదంబరం మాట్లాడుతూ, నగదు బదిలీ పథకం పూర్తి మేజిక్‌ అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కేవలం రెండు వారాలకు, దాంతో జైరాం రమేష్‌ విబేధించారు. ఇది ఒక ప్రయోగమే కానీ మంత్రదండం కాదని అన్నారు.
అయితే, అప్పటికే ప్రజాగ్రహం బాగా పెరిగిపోయింది. ఇలా పరోక్షంగా తప్పనిసరి చేయడాన్ని, బలవంతంగా నెత్తిన రుద్దడాన్ని అనేకమంది ద్వేషించడం ప్రారంభించారు. అన్నింటికంటే ముఖ్యమైనదేమంటే, ప్రజల నమోదు, ఆధార్‌ తయారు, బ్యాంక్‌ ఖాతాలకు ఆధార్‌ నెంబరు బదిలీ ఈ కార్యక్రమాలన్నీ చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. సబ్సిడీ సిలిండర్లు ఇక లభించవంటూ గ్యాస్‌ ఏజెన్సీలు క్రమం తప్పకుండా వినియోగదారులను వేధిస్తూనే ఉన్నాయి. పార్లమెంటు సభ్యులు దీన్ని సభలో లేవనెత్తారు. 2013 మే 8న ప్రణాళికా శాఖ మంత్రి రాజీవ్‌ శుక్లా మాట్లాడుతూ, 'ఆధార్‌ సబ్సిడీ సౌకర్యాలు పొందడానికి తప్పనిసరి కాదు. అంటే ప్రభుత్వం అందజేసే సౌకర్యాలు, ఎల్‌పిజి సిలిండర్లు, ప్రైవేటు ఎయిడెడ్‌ స్కూళ్ళలో ప్రవేశం, సేవింగ్స్‌ ఖాతాను తెరవడం వంటి వాటికి కాదని చెప్పారు. అయినా, ఇంకా గ్యాస్‌ ఏజెన్సీల వేధింపులకు అంతమనేది లేకుండా పోతోంది. ఆగస్టు 23న, ఒక రాజ్యసభ సభ్యుడు మాట్లాడుతూ ప్రభుత్వ చర్యల్లోని అస్థిరతను ప్రశ్నించారు. దానికి శుక్లా సమాధానమిచ్చారు. 'ఇది తప్పనిసరి చేయలేదు. చేయబోవడం లేదు. ఒకవేళ ఏ ప్రభుత్వ రంగమైనా తప్పుగా వ్యవహరిస్తే దాన్ని మేం సరిదిద్దుతాం' అని చెప్పారు. అయితే ఈ ఉపశమనం కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. దిగ్భ్రాంతి కలిగించే రీతిలో, ఏ మాత్రమూ నిజాయితీ లేకుండా పెట్రోలియం, ఖనిజవాయువు మంత్రిత్వ శాఖ ఆగస్టు 27న ఒక ప్రకటన జారీ చేసింది. 'ఎల్‌పిజి సబ్సిడీ ఉపయోగించుకోవాలంటే ఆధార్‌ తప్పనిసరి' అన్నది దాని సారాంశం. ఈ ప్రకటన స్వచ్ఛందం అనే ఆలోచననే పూర్తిగా తిరస్కరించింది. సబ్సిడీ ధరలకు సిలిండర్లను కొనుగోలు చేయడానికి మాత్రమే ఈ స్వచ్ఛందత అనేది వర్తిస్తుందని పేర్కొంది. అంతేకాని ఆధార్‌ లేకపోయినా సిలిండర్ల కొనుగోలుకు సంబంధించి మాత్రం కాదని పేర్కొంది.
ఈ దశలో, సంబంధిత ప్రజలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దాంతో సుప్రీం కోర్టు 2013 సెప్టెంబరు 23న తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు ఇలా ఉన్నాయి. 'ఆధార్‌ తప్పనిసరని కొందరు అధికారులు సర్క్యులర్‌ జారీ చేసినా ఆధార్‌ కార్డు రానందుకు ఏ వ్యక్తి కూడా బాధపడకూడదు' అని స్పష్టం చేసింది. అయినప్పటికీ, వినియోగదారులకు ఇంకా గ్యాస్‌ ఏజన్సీల నుంచి ఎస్‌ఎంఎస్‌లు అందుతూనే ఉన్నాయి. ఆధార్‌ కార్డులు, నెంబర్లు కావాలన్నది ఆ ఎస్‌ఎంఎస్‌ల సారాంశం. ఈ ఏడాది జనవరి 22న మద్రాసు హైకోర్టు జోక్యం చేసుకుంటూ గ్యాస్‌ ఏజెన్సీలను ఇటువంటి సందేశాలు పంపకుండా కట్టుదిట్టం చేసింది. జనవరి 30న గ్యాస్‌ సబ్సిడీకి ఆధార్‌ను ముడిపెట్టడాన్ని నిలుపుచేశారు. ఆ అంశాన్ని కమిటీకి నివేదించారు. కానీ ఇతర అన్ని పథకాలకూ ఆధార్‌ తప్పనిసరి చేయడం కొనసాగుతోంది. పైగా ఆధార్‌ స్వచ్ఛందతకు సంబంధించి అనేక ప్రశ్నలు ఇంకా అలాగే ఉన్నాయి. ఉద్దేశపూర్వకమైన సందిగ్ధత అనేది కొనసాగుతోంది. అసలు ఎందుకీ ఉద్దేశపూర్వక సందిగ్ధత? నా అభిప్రాయంలో అయితే, నయా ఉదారవాదం పట్ల ప్రభుత్వ నిబద్ధతే దీనికి కారణంగా కనిపిస్తోంది. కానీ అంతిమంగా ఫలితం అనేది ఈ ప్రాజెక్టు పట్ల ప్రజల విశ్వసనీయతను వేగంగా తుడిచిపెట్టడానికి దారి తీస్తోంది. అలాగే ప్రభుత్వ విశ్వసనీయత కూడా దారుణంగా దెబ్బతింటోంది.
----- ఆర్‌ రామకుమార్‌

No comments: