MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Friday, February 14, 2014

పిఎఫ్‌ ఖాతాల బదిలీ 'ఆన్‌లైన్‌'

పిఎఫ్‌ ఖాతాల బదిలీ 'ఆన్‌లైన్‌'

న్యూఢిల్లీ   Fri, 19 Apr 2013, IST  


ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాదారులు తమ అకౌంట్స్‌ను బదిలీ చేసుకునేందుకు , పిఎఫ్‌ మొత్తాలను వెనక్కు తీసుకునేందుకు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ పనులను పూర్తి చేసుకోవచ్చు. పిఎఫ్‌ ఖాతాదారుల క్లెయిమ్స్‌ను త్వరగా పరిష్కరించేందుకు కూడా పిఎఫ్‌ కార్యాలయానికి సులభమవుతుంది. దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మందికి పైగా పిఎఫ్‌ ఖాతాదారులు ఇందువల్ల ప్రయోజనం పొందుతారు. కేంద్ర క్లియరెన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటుచెయ్యాలని నిర్ణయించామని, ఇది జులై1న పనిచెయ్యడం ప్రారంభిస్తుందని ఇపిఎఫ్‌ఒక కేంద్ర ప్రావిడెంట్‌ఫండ్‌ కమిషనర్‌ అనిల్‌ స్వరూప్‌ తెలియజేశారు. ఉద్యోగాలు మారినపుడు ఖాతాదారులు తమ పిఎఫ్‌ అకౌంట్లను బదిలీ చేసుకోవడం పెద్ద సమస్యగా పరిణమించిందని, కేంద్ర క్లియరెన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఈ ప్రక్రియ సులభతరం కానుందని ఆయన చెప్పారు. దరఖాస్తు చేసిన ఖాతాదారులు తమ దరఖాస్తు స్థితిగతులను కూడా ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఖాతాదారులందరికీ పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌ కేటాయించాలన్న ఇపిఎఫ్‌ఒ కోరిక నెరవేరడానికి మరికొంత సమయం పట్టనుంది. ఈ ప్రక్రియ రానున్న ఎనిమిది, పది మాసాల్లో అమలులోకి వస్తుందని ఆయన తెలియజేశారు. కొత్త ఉద్యోగాల్లో చేరిన వారు ప్రస్తుతం తమ క్లెయిమ్‌లను పరిష్కరించుకునేందుకు యజమానుల వద్ద స్వయంగా తమ ఖాతాలను తనిఖీ చేసుకోవాల్సి వస్తోంది. ఇకముందు ఈ బాధ్యతను ఇపిఎఫ్‌ఒ చేపడుతుంది.

No comments: