MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Tuesday, January 21, 2014

అరెస్టులపై భగ్గుమన్న విఆర్‌ఎలు Posted on: Tue 21 Jan 03:49:00.63476 2014

- దీక్షాశిబిరాల వద్ద పోలీసుల ఓవరాక్షన్‌ 
- విషమించిన నాయకుల ఆరోగ్యం బ ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం , ప్రజాశక్తి-యంత్రాంగం
వేతనాల పెంపు తదితర సమస్యలపై దీక్షలు చేస్తున్న విఆర్‌ఎలపైనా,
సిఐటియు నాయకులపైనా లాఠీఛార్జి, అరెస్టు చేయడంతో ఆగ్రహించిన విఆర్‌ఎలు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉద్యమించారు. కలెక్టరేట్ల వద్ద ఆందోళనలతోపాటు దీక్షలు, ధర్నాలు, దిష్టిబొమ్మల దగ్ధం, భిక్షాటన తదితర రూపాల్లో నిరసన చేపట్టారు. ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన దీక్షా శిబిరాన్ని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి సందర్శించారు. చిత్తూరు కలెక్టరేట్‌ ముట్టడిలో నాయకులను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన సమయంలో ఐకెపి నాయకురాలు వాణిశ్రీ స్పృహ తప్పి పడిపోయారు. కడప కలెక్టరేట్‌ వద్ద విఆర్‌ఎల నిరవధిక దీక్షను పోలీసులు భగం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సిఐటియు నాయకుల అరెస్టుకు నిరసనగా రాస్తారోకో చేశారు. దీక్షాపరులను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు.
ఏడు నెలలుగా జీతం చెల్లించకుంటే ఎలా బతకాలంటూ సిఐటియు ఆధ్వర్యాన చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించిన నాయకులు, ఉద్యోగులపై విరుచుకుపడ్డారు. తీవ్ర పెనుగులాటల మధ్య సిఐటియు జిల్లా అధ్యక్షులు చైతన్య, సిఐటియు జిల్లా కోశాధికారి బాలసుబ్రమణ్యంతోపాటు నాయకులు ఓబుల్‌రాజు, గణపతి, నారాయణబాబు, విఆర్‌ఎల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శ అల్లాభక్ష్‌ను అరెస్టు చేసి వాహనాల్లో ఎక్కించారు. ఐకెపి జిల్లా నాయకురాలు వాణిశ్రీ స్పృహతప్పి పడిపోయింది. దాదాపు అర గంటపాటు పోలీసులకూ, ఆందోళనకారులకూ మధ్య తోపులాట చోటుచేసుకుంది. 200 మందిని అరెస్టు చేసి టుటౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇందిర క్రాంతిపథం ఉద్యోగులు కూడా ముట్టడిలో పాల్గొన్నారు.
వరంగల్‌, నల్గొండల్లో దీక్షలకు సిపిఎం, ప్రజా సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట దీక్షా శిబిరాన్ని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్‌.పుణ్యవతి సందర్శించి ప్రసంగించారు. జీవోలను ఇవ్వలేనప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకని మంత్రి రఘువీరాను ప్రశ్నించారు. ప్రాణాలను కూడా లెక్కచేయకుండా దీక్ష కొనసాగిస్తున్న నాయకులను అభినందించారు. దమ్మపేటలో భిక్షాటన చేసి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
శ్రీకాకుళం కలెక్టరేట్‌ వద్ద భిక్షాటన చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో దీక్షలు కొనసాగాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌ వద్ద, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్‌ వద్ద ధర్నాలు చేశారు. కృష్ణా జిల్లాలోని కలిదిండిలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద భిక్షాటన చేశారు. గుంటూరు కలెక్టరేట్‌ వద్ద దీక్షలు కొనసాగాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ ప్రదర్శన నిర్వహించారు. పభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
అనంతపురం జిల్లావ్యాప్తంగా విఆర్‌ఏలు భిక్షాటన చేశారు. వారికి ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు మద్దతు తెలిపారు. కర్నూలులో రిలే దీక్షలు కొనసాగాయి. కడప కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన నిరవధిక దీక్షలను పోలీసులు భగం చేశారు. పోలీసులను సిఐటియు నాయకులు అడ్డుకోవడంతో తోపులాట, వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మండల కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రజాదర్బార్‌కు అధికారులు రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు సిఐటియు నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో సిఐటియు డివిజన్‌ నాయకులు నర్సింహ చొక్కా చిరిగిపోయింది. నాయకుల అరెస్టును నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. బలవంతంగా దీక్ష భగం చేసి ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి రక్త, వైద్య పరీక్షలు నిర్వహించగా బిపి, సుగర్‌ లెవల్స్‌ పడిపోయాయని వైద్యులు తెలిపారు.

No comments: