Sakshi | Updated: January 20, 2014 03:32 (IST)
సర్కారు పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అటకెక్కింది. అధ్యాపకులు లేక కంప్యూటర్లు మూలకు చేరాయి. ముఖ్యంగా సక్సెస్ పాఠశాలల్లోని విద్యార్థులు కంప్యూటర్‌విద్యకు దూరమవుతున్నారు. సాఫ్ట్‌వేర్ రంగానికి ఉన్న డిమాం డ్ దృష్ట్యా కొన్ని కార్పొరేట్‌పాఠశాలలు ఎల్‌కేజీ నుంచే పిల్లలకు కంప్యూటర్ పాఠాలు బోధిస్తున్నాయి. దాంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలోనే చేరుస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ విద్యార్థులకూ అత్యాధునిక విద్యాబోధన అందించే లక్ష్యంలో ప్రభుత్వం సక్సెస్‌పేరుతో ఆరోతరగతి నుంచి ఇంగ్లీష్ మాధ్యమాన్ని.. మూడోతరగతి నుంచే కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టింది. ఇప్పుడది గాడి తప్పింది. - న్యూస్‌లైన్, నక్కపల్లి
నక్కపల్లి, న్యూస్‌లైన్ :
ఇదీ పరిస్థితి
2008 సెప్టెంబరు15నుంచి రాష్ట్రవ్యాప్తంగా 5వేల పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రారంభించింది.
ఐదేళ్లకుగాను ఎడ్యుకాం సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ప్రతిపాఠశాలకు 11 కంప్యూటర్లను కేటాయించింది. ఇదే క్రమంలో విశాఖ జిల్లాలో సుమారు 550 జడ్పీ పాఠశాలల్లోను కంప్యూటర్ విద్య ప్రారంభించారు.
కాల్ (కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ ప్రోగ్రాం )లోభాగంగా మండలానికి 3 చొప్పున117 యూపీ స్కూళ్లలోనూ కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టింది.
ప్రతి స్కూలుకూ ఇద్దరు బోధకులను నియిమంచారు.
ఏడాదిపాటు ఇది బాగానే కొనసాగినా సదరు అధ్యాపకులకు ఆ సంస్థ జీతాలు సరిగా ఇవ్వకపోవడంతో వారు ఉద్యోగాలు మానేశారు.తర్వాత నుంచి పాఠశాలల్లో విద్యార్థులకు అధ్యాపకులు కరువయ్యారు.
ఎడ్యుకాం సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం కూడా గతేడాది15తో పూర్తయింది. తర్వాతనుంచి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు.
కాంట్రాక్ట పూర్తయ్యేనాటికి సదరు కంప్యూటర్లను పక్కాగా పని చేసే స్థితిలో ఉంచి ఆయా స్కూళ్లకు అప్పగించాలన్నది ఒప్పందం కానీ చాలా పాఠశాలల్లో ఇవి మూలకు చేరాయి.
నాలుగేళ్లనుంచి పిల్లలు కంప్యూటర్ పాఠాలకు నోచుకోలేదు. విద్యాసంవత్సరం మరోమూడునెలల్లో ముగియనున్నా ప్రభుత్వం మాత్రం ప్రత్యామ్నాయ చర్యలుతీసుకోలేదు.
No comments:
Post a Comment