ఐటి అభివృద్ధితో 6.20 కోట్ల ఉద్యోగాలు : మంత్రి కిల్లి
ప్రజాశక్తి - అన్నవరం Fri, 19 Apr 2013, IST
కేంద్ర ప్రభుత్వం ఐటి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు విధానాలు రూపొందించడంతో 2020 నాటికి 6.20 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర ఐటి కమ్యూనికేషన్ల సహాయమంత్రి పిల్లి కృపారాణి చెప్పారు. గురువారం తూర్పు గోదావరి జిల్లా అన్నవరం కొండపైకి వచ్చిన మంత్రి కుటుంబ సభ్యులకు దేవస్థానం ఈఓ పి.వెంకటేశ్వర్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినాయక అతిథి గృహంలో మంత్రి విలేకర్లతో మాట్లాడారు. త్వరలో హైదరాబాదులో ఐటి కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. దీనివల్ల ఐటి ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.20 వేల కోట్లతో దేశవ్యాప్తంగా ఉన్న రూ.2.50 లక్షల గ్రామపంచాయితీ పరిధిలో నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనివల్ల కమ్యూనికేషన్ వ్యవస్థలో లోపాలు లేకుండా స్పష్టత ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెల్ సిగల్ లేని మారుమూల ప్రాంతాల్లో రూ.300 కోట్లతో కొత్తగా సెల్ టవర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అక్టోబరు నుండి రోమింగ్ లేకుండా దేశంలో ఎక్కడి నుంచైనా మాట్లాడటానికి వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. దేశంలో రూ.1.55 లక్షల పోస్టాఫీసులను రూ.4 వేల 500 కోట్లతో ఆధునీకరణకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. వెయ్యి ఏటిఎంలు ఏర్పాటు చేస్తామన్నారు.
No comments:
Post a Comment