పాఠశాలల పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలి
షేక్ అస్లాం షరీఫ్, శాంతి నగర్, మహబూబ్‌నగర్ జిల్లా Fri, 15 Mar 2013, IST
రాష్ట్రంలోని చాలా పాఠశాలల్లో స్వీపర్లు లేరు. స్వీపర్లు లేని కారణంగా తరగతి గదులు చెత్తా చెదారంతో నిండిపోతున్నాయి. ఉపాధ్యా యులుగానీ, విద్యార్థులుగానీ ఏదో నామ మాత్రంగా శుభ్రం చేసుకుంటారు గానీ దానికంటూ ప్రత్యేకంగా నియమిస్తేనే కదా పాఠశాలగానీ, విద్యార్థులుగానీ ... బాగుండేది. అపరిశుభ్రంగా ఉండడం వల్ల విద్యార్థులు జబ్బున పడతారు. చదవడానికి కూడా అనువైన వాతావరణం ఉండదు. ఇదొక సమస్య అయితే ... విలువైన రికార్డులకు రక్షణ ఉండటం లేదు. అలాగే విలువైన కంప్యూటర్లకు రక్షణ కరువైంది. అంతేకాక స్వీపర్లు లేని కారణంగా పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారవుతోంది. అందుకనే ప్రభుత్వం పాఠశాలల్లో స్వీపర్లను నియమించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
No comments:
Post a Comment