- అలంకార ప్రాయంగా కంప్యూటర్లు- ఆగిన ఇన్‌స్ట్రక్టర్ల నియామకం- పటించుకొని అధికారులునవ తెలంగాణ-తొర్రూరు రూరల్‌ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ విద్య మిథ్యగా మారింది. బోధించే వారే లేక కంప్యూటర్లు మూలన పడ్డాయి. పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందిం చాలనే లక్ష్యంతో 2008వ సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కంప్యూటర్ విద్యను ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా మండలంలోని వెల్లికట్టె, తొర్రూరు, చర్లపాలెం, కంఠాయపాలెం, హరిపిరాల హైస్కూల్స్తో పాటు యూపీఎస్ చీకటాయపాలెం, సోమారం గ్రామాల్లోని పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను అమలు చేయడానికి ఎంపిక చేశారు. ఈ పాఠశాలలకు కంప్యూ టర్ సెట్లతో పాటు ఫర్నీచర్‌ను కూడా అందిం చారు. రెండేళ్ల పాటు నిట్ ఆధ్వర్యంలో కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ల ద్వారా 6వ తరగతి నుండి పదో తరగతి విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చారు. అటు తరువాత నిట్‌కు ఇన్‌స్ట్రక్టర్ల మధ్య కాంట్రాక్ట్ రద్దు అయినందున్న 2012 సంవత్సరం నుండి ఇన్స్ట్రెక్టర్లు లేకపోవడంతో శిక్షణ ఆగిపోయింది. దీంతో పాఠశాలల్లో కంప్యూటర్లు అలంకార ప్రాయంగా మారాయి. ఇక ఆ తరువాత కంప్యూటర్ విద్యను పట్టించుకునే వారే కరువయ్యారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం లక్షల రూపాయాలు వెచ్చించి కంప్యూటర్లను కొనుగోలు చేసి ఇన్స్ట్రెక్టర్లను నియమించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వానికి పాఠశాలల్లో నెలకొని ఉన్న సమస్యలు తెలియడం లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ విద్యను కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.కంప్యూటర్ విద్య ఎంతో అవసరం : ఎంఈవో బుచ్చయ్యనేటి పోటీ వ్యవస్థలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కంప్యూటర్ విద్య ఎంతో అవసరమని మండల విద్యాశాఖ అధికారి మహంకాళి బుచ్చయ్య అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో అద్భుతమైన ప్రగతి దాగి ఉందని వారికి కంప్యూటర్ విద్యను ప్రాథమిక దశ నుంచే నేర్పించాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రవేశ పెట్టేందుకు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
No comments:
Post a Comment