కంప్యూటర్ విద్య మిథ్యేనా...?
-సాంకేతిక విద్యకు నోచుకోని విద్యార్థులు
-అటకెక్కిన కంప్యూటర్ విద్య
-బోధన కాంట్రాక్ట్ గడువు ముగియడంతో నిలిపివేత
-వెలవెలబోతున్న కంప్యూటర్లు
అల్లాదుర్గం:ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అటకెక్కింది. ఫలితంగా పేద విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందని ద్రాక్షగా మారింది. కంప్యూటర్ ఫ్యాకల్టీలను ప్రభుత్వం తొలగించడంతో సిస్టమ్స్ షట్‌డౌన్ అయ్యాయి.. సర్కార్ బడుల్లో పేద విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం 2008లో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టింది. పాఠశాలలకు కంప్యూటర్లను అందజేసి శిక్షకులను నియమించి విద్యనందించారు. దీంతో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య కొనసాగింది. విద్యార్థులకు కంప్యూటర్ తెలివి పెరిగింది. ఐదేళ్లపాటు విద్యార్థులకు కంప్యూటర్ విద్యను నేర్పించారు.
ప్రభుత్వం ప్రైవేటు సంస్థ ఐన నిట్‌తో కుదుర్చుకున్న ఒప్పందం 2014 సెప్టెంబరుతో ముగియడంతో కంప్యూటర్ విద్య అటకెక్కింది. ఫ్యాకల్టీలను తొలగించడంతో కంప్యూటర్లు మూలన పడి,విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. మండలంలో అల్లాదుర్గం బాలికల ఉన్నత పాఠశాల, గడిపెద్దాపూర్ ఉన్నత పాఠశాల, ముస్లాపూర్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టారు. ఇందులో ఒక్కో పాఠశాలకు ఇద్దరు శిక్షకులను నియమించారు. ఐదు సంవత్సరాల పాటు కొనసాగిన కంప్యూటర్ విద్య శిక్షకులను తొలగించడంతో పాఠశాలల్లో కంప్యూటర్లు మూలన పడ్డాయి. కప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయులతో నైనా కంప్యూటర్ విద్యను కొనసాగించాలని అధికారులు భావించిన అది ఆచరణలో సాధ్యం కాలేదు. ఫ్యాకల్టీలను తొలగించడంతో వారు ఉపాధి కోల్పోగా, విద్యార్థులు పూర్తి స్థాయిలో కంప్యూటర్ విద్యకు నోచుకోలేకపోతున్నారు.
వృథా అవుతున్న నిధులు:
కంప్యూటర్ విద్యాబోధన కోసం లక్షల రూపాయలు వెచ్చించి ఒక్కో పాఠశాలకు 12 చొప్పున కంప్యూటర్లు అందించారు. ప్రింటర్, యూపీఎస్, జనరేటర్లను సైతం సమకూర్చారు. వీటి సాయంతో తెలుగు, గణితం, ఇంగ్లీష్, పరిసరాల విజ్ఞనం పాఠాలు సులభమైన రీతిలో ఆడియో, వీడియో ద్వారా బోధించేవారు. విద్యార్థులకు నెల, నెల పరీక్షలు సైతం నిర్వహించేవారు. కంప్యూటర్ విద్య ఆగిపోవడంతో లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కంప్యూటర్లు, జనరేటరు వృథాగా మూలన పడ్డాయి. దీంతో పేద విద్యార్థులు కంప్యూటర్ విద్యకు దూరమయ్యారు. కంప్యూటర్ శిక్షకులను నియమిసే ్త తప్ప విద్యార్థులు కంప్యూటర్ విద్యను నేర్చుకునే అవకాశం ఉంది. అధికారులు స్పందించి తిరిగి కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.
http://m.dailyhunt.in/news/india/telugu/namasthetelangaana-epaper-namasthe/kampyutar+vidya+mithyena-newsid-63252715
No comments:
Post a Comment