MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Friday, November 4, 2016

TACT NEWS: త్వరలో నూతన విద్యా విధానం

-ప్రైవేటు పాఠశాలల ఫీజులకు కళ్లెం  -ఏప్రిల్ నెలాఖరు నాటికి వీసీల నియామకం -జూలై నాటికి ప్రతి క్లాస్‌లో ఫర్నీచర్  -మౌలిక సదుపాయాలకు రూ.1500 కోట్లు మంజూరు -ఏడాదిలోగా అక్షరాస్యతలో కేంద్ర సగటును అధిగమిస్తాం  -డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో త్వరలో నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. ఇందుకు శాసనసభ, మండలి సభ్యులు ఇచ్చిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. నూతన విద్యా విధానాన్ని విద్యాహక్కు చట్టం ప్రకారం తీసుకురావడంలేదని, చట్టంలోని అనేక అంశాలపై అభ్యంతరాలు ఉన్నాయని, వాటిపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని కడియం స్పష్టం చేశారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాన్ని తీసుకొస్తామన్నారు. శాసనమండలిలో మంగళవారం విద్యపై జరిగిన చర్చకు కడియం శ్రీహరి సమాధానమిచ్చారు. ఏప్రిల్ నెలఖారు కల్లా దాదాపుగా అన్ని యూనివర్సిటీలకు చాన్స్‌లర్లను, వీసీలు నియమిస్తామని చెప్పారు. ఈ నియామకాల కోసం సెర్చ్ కమిటీలను ఇప్పటికే నియమించామన్నారు. ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలకు రూ.1500 కోట్లు మంజూరు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 60లక్షల మంది పదో తరగతి చదువుతున్న విద్యార్థులుంటే వారిలో 32లక్షల మంది ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నారన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలల్లో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ప్రైవేటు స్కూల్ ఫీజులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతమున్న చట్టాలను, జీవోలను అమలు చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామన్నారు. జూలై నాటికి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరికి ఫర్నీచర్ ఉండే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రతి పాఠశాలలో తాగునీరు, టాయిలెట్లు, బోధన సిబ్బంది ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హరితహారం కింద మొక్కల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపడుతామన్నారు.ఈ విద్యాసంవత్సరం 26 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు న్యాక్ అక్రెడిటేషన్ వచ్చిందని, వచ్చే విద్యాసంవత్సరంలో ప్రతి డిగ్రీ కాలేజీకి న్యాక్ గుర్తింపు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి పాలిటెక్నిక్ కాలేజీకి స్వంత భవనం ఉండే విధంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. మే 10 కల్లా టెట్ ఫలితాలు విడుదల చేస్తామని... అనంతరం డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఉద్యోగాల కంటే అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉండటంతోనే డీఎస్సీ నిర్వహించాల్సి వస్తుందన్నారు. టెట్‌ను ఎన్సీటీఈ నిబంధనల మేరకే నిర్వహిస్తున్నామని చెప్పారు. యూనివర్సిటీల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. గత 20 సంవత్సరాలుగా బోధనా సిబ్బందిని నియమించకపోవడంతో న్యాక్ అక్రెడిటేషన్ కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు.విద్యాశాఖకు ఈ బడ్జెట్‌లో రూ.10,738కోట్లు కేటాయించామని చెప్పారు. ప్రజాప్రతినిధులు కూడా విద్యాసంస్థలపై దృష్టి పెట్టాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులను మౌలిక సదుపాయాలకు కేటాయించాలని సూచించారు. ఉపాధ్యాయుల కామన్ సర్వీసు రూల్స్‌పై త్వరలోనే కేంద్రాన్ని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యత శాతం జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని, రాబోయే సంవత్సరకాలంలో దానిని అధిగమించేలా ప్రణాళికను రూపొందించామని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా అమనగల్‌లో ప్రభుత్వ జూనియర్‌కాలేజీకి రెండు ఎకరాల భూమి ఇవ్వడానికి ముందుకొచ్చిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డిని అభినందించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల నిర్వహణకు, భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించిన భూపాల్ రెడ్డిని కడియం శ్రీహరి అభినందించారు.

No comments: