MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Thursday, November 9, 2017

మార్గశిర గురువారం శుభాకాంక్షలు

గురువారం నాడుమార్గశిర లక్ష్మీవార వ్రతం
Image result for margasira laxmi vara katha imagesఒకనాడు నారదుడు, పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేదతీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. సమయంలో గ్రామంలో 4వర్ణాల వారూ ఇళ్ళను
గోమయం(ఆవుపేడ)తో అలికి, ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటుస్నానం చేసి, కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి. 4వర్ణాలవారు కలిసి ఒక చోట చేరి, లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా, వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో "మహర్షి!ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న పూజ ఏమిటి? నాకు పూజ గురించి తెలుసుకోవాలని కుతుహలంగా ఉంది. పూజ గురించి వివరంగా తెలియపరచండి" అన్నారు. గురువారం చేసే పూజను లక్ష్మీపూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం పూజ చేయడానికి శ్రేష్టమైనది. లక్ష్మీ దేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. నారదుడు"మహనీయ, పూజను ఇంతక ముందు ఎవరినా చేశారా? చేస్తే ఎవరు చేశారో, వారికి ఫలం కలిగిందో తెలియజేయండి "అనగా, పరాశరుడు కధ చెప్పడం మొదలుపెట్టాడు.
ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణూపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో "స్వామి రోజు మార్గశిర లక్ష్మీవారం. ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తాను "అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృతభూషితయై భూలోకానికి పయనమైంది లక్ష్మీ దేవి. ఒక ముసలి బ్రహ్మణ స్ర్తీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఇంటిముందుకు వచ్చి "అవ్వా! రోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ. ఇల్లు గోమయంతో అలికి ముగ్గుపెట్టలేదేంటి?" అన్నది. అప్పుడు ముసలి స్త్రీ "అమ్మా! వ్రతం ఏమిటి? ఏలా చేయాలి? నువ్వు చెబితే నేను కూడా చేస్తాను" అని అడుగగా మహలక్ష్మీ మందహాసంతో విధంగా పలికింది.
"మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి, ఇల్లు గోమయంతో అలికి, ముగ్గులు  పెట్టి, లక్ష్మీ దేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధరకాలైన ముగ్గులతో, బొమ్మలతో అందంగా తయారుచేయాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని, దానిని కడిగి దానిమీద కొత్త ధాన్యం పోయాలి. దాని మీద కొలతపాత్రను ఉంచి, పసుపునీటితో కడిగిన పోకచెక్క(వక్క)ను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని మాసంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకుని, కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలతపాత్ర మీద పోయాలి. ఎరుపురంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి, ఎర్రని పూలతో పూజించి శ్రీమహాలక్ష్మిని తలచుకుని దీపారాధన చేయాలి. మొదటపాలు నైవేధ్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా, నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవెధ్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం". లక్ష్మీదేవి అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టింది."రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిధి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో వ్రతాన్నే చేస్తే తప్పక సిరి వస్తుంది. వ్రత నైవెధ్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మికటాక్షం లభించదు. మనసును నిర్మలంగా ఉంచుకుని, పదిమందిని పిలిచి వ్రతం చేయాలి, పసుపుకుంకుమలు పంచిపెడితే ఇంట లక్ష్మి తాండవిస్తుంది.
వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలి అవ్వ. గురువారం ఉదయమే లేచి, పొయ్యి బూడిద తీయకపోయిన, ఇల్లు వాకిలి తుడవకున్నా ఇంట లక్ష్మీ నిలువదు. స్త్రీ గురువారం శుచిగా, మడివస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఇంట లక్ష్మీ స్థిరంగా ఉంటుంది. స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో, కొడుతుందో, ఇల్లువాకిలి చిమ్మదొ, అంట్లుకడగదో ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండువైపులా దీపాలు ఉంచదో ఇంట లక్ష్మీ నిలువదు. అంతేకాదు ఇంట ధనానికి ,సంతానానికి హాని కలుగుతుంది. అదే విధంగా గురువారం ఉడకని పదార్ధాలు, నిషిద్ధ పదార్ధాలు తినే ఇంట, ఆశుభ్రప్రదేశాలలో తిరగడం, అత్తమామాలను ధూషించడం, సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మీ పాదం కూడా పెట్టదు. భోజనము ముందు, తరువాత కాళ్ళు, చేతులు, ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ, ప్రతి మాటకు స్త్రీ అకారణంగా, అసంధర్భంగా, గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మీ ఉండదు. స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో, గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మీ ఉంటుంది. స్ర్తీ గురువారం దానధర్మాలు, పూజలు చేయదో, భర్తతో గోడవ పడుతుందో స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం, అమావాస్యా, సంక్రాంతి(ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది)తిధులలో నిషిద్ధ పదార్ధాలను తినే స్త్రీ యమపురికి(నరకానికి) పోతుంది. జ్ఞానంతో స్త్రీ పైన చెప్పబడ్డ 3 తిథులలో నిషిద్ధపదార్ధములను తినకుండా, నక్తం(ఒంటిపూట, ఒకపొద్దు) ఉంటుందో, లక్ష్మిని పూజిస్తుందో స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్రపౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. ప్రతి రోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహా పాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర, దక్షిణం దిక్కులకు కూర్చుని(ముఖం పెట్టి) భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు. చీకటి పడిన తరువాత తలకునూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట, భర్త మాట వినని స్త్రీ ఇంట, దైవంయందు, బ్రాహ్మాణులయందు భక్తి విశ్వాసాలు లేనటువంటి, పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇళ్ళు స్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీ దేవి రాదు. నిత్యదరిద్రం ఇంట తాండవిస్తుంది"అని లక్ష్మీ దేవి ముసలి బ్రాహ్మణస్త్రీకి లక్ష్మీ దేవి వివరించి గ్రామంలో ప్రతి ఇంటిని చూసిరావడానికి బయలుదేరింది.
సమయానికి గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి అసహ్యించుకుంది. ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఒక పేదస్త్రీ ప్రతి రోజు ఇల్లును గోమయంతో అలికి, ముగ్గులు పెట్టేది. బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీ దేవి పాదముద్రలను వేసి, లక్ష్మీ దేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి, ధూపం వేసి, నైవెధ్యాలు పెట్టి, పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మినే ఆరాధించేది పేద స్త్రీ. ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మీ ఆమె ఇంట పాదాలు మోపింది. " భక్తురాలా! నీ భక్తి మెచ్చాను. వరం కోరుకో, ప్రసాదిస్తాను అని పలికింది. సాక్షాత్ లక్ష్మీ దేవిని చూడడంతో స్త్రీ నోట మాట రాకా కోరిక కోరలేదు. అప్పుడు లక్ష్మీదేవి "నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను. నీవు మరణించేవరకు సకలసంపదలను అనుభవుస్తావు. మరణం తరువాత వైకుంఠాని చేరుతావు"అని వరాలిచ్చింది. నా వ్రతం విడువకుండా చేయి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహాలక్ష్మి చెప్పిన విధంగానే స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు, భోగబాగ్యాలు, ఐదుగురు కూమారులతో స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది" అంటూ మహర్షి పారాశరుడు నారద మునీంద్రుల వారితో పలికారు. శ్రీ మహాలక్ష్మీ చే స్వయంగా చెప్పబడిన వ్రతం చాలా విశిష్టమైనది. కధను నిత్యం చదవడం వలన శుభాలు కలుగుతాయి.
నైవేద్యాలు :
1 గురువారం - పులగం 
2
గురువారం - అట్లు, తిమ్మనం
3
గురువారం - అప్పాలు, పరమాన్నము
4
గురువారం - చిత్రాన్నం, గారెలు
5
గురువారం - పూర్ణం బూరెలు

No comments: