Posted on: prajasakti :: Tue 10 Feb 00:25:09.51242 2015
- విభజన తేదీ నుంచి అమలు
- రూ. 5,550 కోట్లు ఖర్చు
- ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మంచి పీఆర్సీ ఇచ్చాం: చంద్రబాబు
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ను చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జూన్ 2 అపాయింటెడ్ డే నుంచి ఇది అమల్లోకి వస్తుందని అన్నారు. ఆర్థికంగా
ఇబ్బందులు ఉన్నప్పటికీ మంచి పీఆర్సీ ఇచ్చామని చెప్పారు. 43 శాతం ఫిట్‌మెంట్ వల్ల ్తరాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా రూ.5,550 కోట్లు ఖర్చవుతుంది. పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు చాలా కాలం నుంచీ పట్టుబడుతూ వస్తున్నాయి. దీనిపై చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. రెండు దఫాలుగా జేఏసీ నేతలతో ఉపసంఘం చర్చలు జరిపింది. తాజాగా సోమవారం సచివాలయంలో సుదీర్ఘంగా సమావేశమైంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకూ ఈ చర్చలు కొనసాగాయి. 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడానికి తొలుత మంత్రివర్గ ఉపసంఘం ఏ మాత్రం అంగీకరించలేదు. ఉద్యోగుల డిమాండ్ మేరకు ఫిట్‌మెంట్ ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి సహకరిం చదని స్పష్టం చేశారు. ఉద్యోగులు తమ పట్టు వీడలేదు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఉద్యో గులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా మెట్టుదిగక తప్పని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఫిట్‌మెంట్ కంటే ఒక్క శాతం కూడా తగ్గేందుకు ఉద్యోగ సంఘాలు అంగీకరించలేదు. ఫిట్‌మెంట్ పై నిర్ణయం తీసుకున్న అనంతరం మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ముఖ్యమంత్రిని కలిశారు. ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చల సారాంశాన్ని ఆయనకు వివరించారు. 43 శాతం పీఆర్సీ ఇస్తే ఖజానాపై పడే భారాన్ని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఉప సం ఘం సూచించిన సిఫారసులకు ముఖ్యమంత్రి కూడా అంగీకరిం చారు. అనంతరం రాత్రి 8:45 నిమిషాలకు విలేక రుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.సచివాలయంలో మంత్రివర్గ ఉప సం ఘం సభ్యులు యన మల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, నారా యణలతో కలిసి చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి డిమాండ్‌కు అనుగుణంగా ఫిట్‌మెంట్‌పై నిర్ణయం తీసుకున్నామని అన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన కష్టాలపై ఉద్యోగులకు సమగ్ర అవగాహన ఉందని, దీన్ని అధిగమించడానికి ఉద్యోగులు అహర్నిశలు కష్టపడాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల అకాంక్షలను నెరవేర్చామని అన్నారు. రాష్ట్రానికి ప్రస్తుతం వస్తోన్న ఆదాయాన్ని మరింత పెంచుకుని, ఆ మొత్తంలో నుంచే అప్పులను చెల్లించుకోవడంతో పాటు అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాల్సి ఉందని అన్నారు.
59 శాతం జనాభా ఉన్న ఏపీకి జనవరి నాటికి 48.5 శాతం మాత్రమే ఆదాయం వచ్చిందని చెప్పారు. 41 శాతం జనాభా ఉన్న తెలంగాణలో 42 శాతం ఆదాయం నమోదైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న ఇలాంటి లోపాలను సరిచేయాలని ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల మండలి సమావేశంలో ప్రస్తావించినట్లు చంద్రబాబు చెప్పారు. పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో ఉన్న ఈ లోపాలను సవరించడానికి గతంలో తాన పోరాడానని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్థిక అసమానతలు లేకుండా చూడాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాలు రెండు ఆర్థికంగా సమాన స్థాయికి చేరుకునేంత వరకూ సహకారం అందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు.
ఏ రాష్ట్రంలోనూ లేదు: అశోక్‌బాబు
ఇంత మంచి పీఆర్సీ ఏ రాష్ట్రంలోనూ లేదని ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ పి అశోక్‌బాబు, జెఎసీ సెక్రెటరీ జనరల్ ఐ వెంకటేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి పీఆర్సీని ప్రకటించిన వెంటనే జెఎసీ నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులకు స్వీట్లు తినిపించారు. అనంతరం అశోక్‌బాబు మాట్లాడుతూ ఈ ఫిట్‌మెంట్‌ను చూసిన తరువాత దేశంలోని ప్రతి ఉద్యోగీ రాష్ట్రంలో పనిచేయాలని కోరుకంటాడని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం తమవంతు కృషి చేస్తామని చెప్పారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు, కత్తి నరసింహా రెడ్డి, మురళీకృష్ణ, కృష్ణయ్య తదితరులు ఉన్నారు.
అదనపు ఖర్చు ఇలా...
43శాతం ఫిట్‌మెంట్ ఇస్తే ప్రభుత్వానికి నెలకు 360 కోట్లు అదనంగా ఖర్చవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఉద్యోగులకు జీతాలకు సంవత్సరానికి 4320 కోట్లు అద నంగా ఖర్చవుతుందని, ఇవిగాక పెన్షన్ దారులకు 1230 కోట్లు అదనంగా చెల్లించాల్సి వుంటుందని ఆర్థిక శాఖ అంచనా. రాష్ట్రంలో 5.8లక్షల మంది ఉద్యోగులు 3.5లక్షల మంది ఫించన్‌దారులు ఉన్నారు. వీరందరికి పిఆర్‌సితో లబ్దిజరగనుంది. తొలుత ప్రభుత్వం ససేమిరా అన్నప్పటికీ చివరకు అంగీకరించ డంతో ఉద్యోగులలో హర్షం వ్యక్తమయింది. ముఖ్యమంత్రికి స్వీట్లు తినిపించడంతో పాటు సచివాలయం సంబరాలు చేసుకున్నారు.
No comments:
Post a Comment