MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Wednesday, February 11, 2015

క్లస్టర్‌ విధానంపై జనాగ్రహం


- విజయనగరం కలెక్టరేట్‌ వద్ద యుటిఎఫ్‌ ధర్నా
- రద్దు చేయకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిక
- గొంతు కలిపిన ఉద్యోగ, ప్రజాసంఘాలు, విద్యార్థులు
- కదిలొచ్చిన ప్రజాప్రతినిధులు, ఎస్‌ఎంసి ఛైర్మన్లు
- అడ్డుకున్న పోలీసులు


ప్రజాశక్తి - విజయనగరం టౌన్‌

           ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే క్లస్టర్‌ పాఠశాలల ఏర్పాటు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్ట రట్‌ వద్ద సోమవారం భారీ ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు గొంతుకలిపి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విరు చుకుపడ్డారు. తక్షణం క్లస్టర్‌ విధాన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు యుటిఎఫ్‌ పిలుపుతో గంట్యాడ మండలం నుంచి వాహనాల్లో వచ్చేం దుకు సిద్ధమైన ఉపాధ్యాయులను, విద్యా ర్థులను, వారి తల్లిదండ్రులను పోలీసులు అడ్డు కున్నారు. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో క్లస్టర్‌ విధా నాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావి స్తోంది. అందులో భాగంగా తొలివిడతగా విజయ నగరం, అనంతపురం, కడప జిల్లాల్లో అమలు చేసేందుకు సర్వే చేపట్టింది. విజయనగరం జిల్లాలో 2,929 ప్రభుత్వ పాఠశాలలకు గాను 210 పాఠశాలలుంటే సరిపోతుందని జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అంటే సుమారు 2,719 పాఠశాలలు మూతపడనున్నాయి. దీంతో పేద విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు చదువుకు దూరమయ్యే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో 15 రోజులుగా పలు రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. ప్రజాప్రతినిధులకు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు వినతులు అందజేశారు. మండల కేంద్రాల్లో చేపట్టిన ధర్నాల్లో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు. ఈ ధర్నాలకు వైసిపి ఎమ్మెల్యేలూ మద్దతు తెలిపారు. కేంద్రమంత్రి పి.అశోక్‌గజపతిరాజుకు, రాష్ట్ర మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, కె.మృణాళినికి యుటిఎఫ్‌ నాయకులు వినతులిచ్చి క్లస్టర్‌ విధానాన్ని ఉపసంహరించాలని కోరారు. ఈ విధానాన్ని రద్దు చేయాలని పలు పంచాయతీల్లో సర్పంచులూ తీర్మానాలు చేశారు. యుటిఎఫ్‌ ఆందోళనలకు విశేష స్పందన లభించింది. 
ఈనేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన ఆందోళనలో ఉపాధ్యాయులతో పాటు పలు ఉపాధ్యాయ సంఘాలు, ఎన్జీవో అసోసియేషన్‌, ఉద్యోగ సంఘాలు, పలు గ్రామాల సర్పంచులు, స్కూలు మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, ప్రజలు పాల్గొని మద్దతు పలికారు. క్లస్టర్‌ విధానాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలను మూసివేయవద్దని చేసిన నినాదాలతో కలెక్టరేట్‌ ప్రాంతం దద్దరిల్లింది. తొలుత ధర్నా చేసిన వీరంతా తరువాత కలెక్టరేట్‌ మెయిన్‌గేటు వద్ద బైఠాయించారు. ధర్నానుద్దేశించి యుటిఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షులు కె.విజయగౌరి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విద్యావ్యవస్థను పరిశీలించకుండా, కనీసం కమిషన్‌ వేసైనా అభిప్రాయాలు తీసుకోకుండా అత్యంత దుర్మార్గంగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని ఆలోచన చేయడం దుర్మార్గమన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేదంటే ప్రజా ఉద్యమంగా మారుస్తామని, మార్చి 15 వరకు అంచెలంచెలుగా ఉద్యమం చేపట్టనున్నామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి డి.రాము మాట్లాడుతూ, ప్రతి కిలోమీటరుకూ ప్రాథమిక పాఠశాల, ప్రతి మూడు కిలోమీటర్లకూ ప్రాథమికోన్నత, హైస్కూలు ఏర్పాటు చేయాలని విద్యా హక్కు చట్టం చెబుతుంటే, దానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూళ్లన్నింటినీ క్లస్టర్‌ పాఠశాలలో కలిపేయాలని నిర్ణయించడం చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. కార్యక్రమంలో జెవివి రాష్ట్ర అధ్యక్షులు ఎంవిఆర్‌ కృష్ణాజి, యుటిఎఫ్‌, ఎపి ఎన్జీవో సంఘం, విఆర్వోల సంఘం, పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు, సర్పంచులు, స్కూలు మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

No comments: