ఎప్పుడు చూసినా గోళ్ళు కొరుకుతూ ఉంటారు. ఇదొక భయంకరమైన అలవాటు. దీనివల్ల గోళ్ళే కాదు, దంతాలు కూడా పాడవుతాయి. ఎంత ప్రయత్నించినా ఈ అలవాటు మానుకోలేక పోతున్నారా? అయితే కింది చిట్కాలను పాటించి చూడండి.
- మీ గోళ్ళను టైం టు టైం కత్తిరించుకోండి. దీనివల్ల గోళ్ళు చిన్నగా ఉండి కొరకడానికి వీలుండదు.
ేగోళ్ళు కొరకకూడదనే నిబద్ధతతో ఉండండి. ఈ విషయాన్ని గుర్తుచేసేవిధంగా ఒక పేపర్‌ను అతికించుకోండి. అంతేకాకుండా మీ మొబైల్లో కూడా ఏదైనా గుర్తును పెట్టుకోండి. ఇవి మీకు చాలా సహాయపడుతాయి.
- అప్పుడప్పుడు మానిక్యూర్ చేయించుకోండి. దీనివల్ల మీ అందమైన గోళ్ళను కొరకడానికి ఇష్టపడరు.
- కాల్షియం లోపం కూడా గోళ్ళు కొరకడానికి ఒక ప్రధాన కారణం. కనుక ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను తీసుకోవాలి. పాలు, పాలసంబంధిత పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
- ఈ అలవాటును మానుకోవడానికి వేపాకుపేస్టును లేదా మిరియాల పొడిని మీ గోళ్ళకు అప్లై చేసుకోవాలి.
- ఎందుకు మీరు గోళ్ళను కొరుకుతున్నారో గమనించండి. ఒత్తిడి వల్లనో, దేనివల్లనో తెలుసుకొని దానికి సంబంధించిన చికిత్స చేయించుకోండి.
- గోళ్ళను కొరకాలనిపించినప్పుడు మీ చేతుకు ఒక బ్యాండ్ లాంటిది కట్టుకుని దాన్ని లాగుతూ ఉండండి.
No comments:
Post a Comment