Posted on: Mon 07 Apr 18:39:07.079895 2014
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు మే నెల 24 వరకు జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం సాయంత్రం జీవో నెం.78 ను జారీ చేసింది. జూన్ రెండో తేదీన రెండు రాష్ట్రాలుగా విడిపోతున్నందువల్ల సీమాంధ్ర , తెలంగాణ రాష్ట్రాల ఉద్యోగులకు జీతాల చెల్లింపులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా సూచించింది. అలాగే మే 25 తేదీన ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా కొత్త ఖాతాలను తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది
No comments:
Post a Comment