- షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు - 10,11న జరగాల్సినవి 12, 15 తేదీల్లో నిర్వహణ - ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటన --
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరోAP SSC 10th Class Hall Tickets Download 2014 --
పదో తరగతి పబ్లిక్ పరీక్షలపై ఎన్నికల ప్రభావం పడింది. దీంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. వచ్చేనెల 10, 11 తేదీల్లో జరగాల్సిన టెన్త్ పరీక్షలను వచ్చేనెల 12, 15 తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. టెన్త్ పరీక్షల పాత షెడ్యూల్ ప్రకారం ఈనెల 27 నుంచి వచ్చేనెల 15వ తేదీ వరకు జరుగుతాయి. తాజా షెడ్యూల్ ప్రకారం ఈనెల 27 నుంచి వచ్చేనెల 17వ తేదీ వరకు పొడిగించారు. ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలు వచ్చేనెల 6, 11 తేదీల్లో పోలింగ్ జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎన్నికల పోలింగ్ ప్రభావం టెన్త్ పరీక్షలపై పడింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు బి మన్మథరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. వచ్చేనెల 6న తొలిదశ పోలింగ్ ఉండడంతో 7వ తేదీన జరగాల్సిన జనరల్ సైన్స్ పేపర్-1 సమయంలో స్వల్ప మార్పులు చేశామని తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగాల్సిన పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు జరపాలని నిర్ణయించామని పేర్కొన్నారు. వచ్చేనెల 10న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్నం 12 గంటల వరకు సోషల్ స్టడీస్ పేపర్-1 జరగాల్సి ఉంది. సోషల్ స్టడీస్ పేపర్-1ను వచ్చేనెల 12వ తేదీకి వాయిదా వేశామని తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. వచ్చేనెల 11వ తేదీన జరగాల్సిన సోషల్ స్టడీస్ పేపర్-2 వచ్చేనెల 15 తేదీకి వాయిదా పడిందని తెలిపారు. వచ్చేనెల 12న జరగాల్సిన ఓఎస్‌ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 వచ్చేనెల 16వ తేదీకి మార్చబడిందని పేర్కొన్నారు. వచ్చేనెల 15న జరిగే ఎస్‌ఎస్‌సి ఒకేషనల్ కోర్సు (థియరీ) పరీక్ష వచ్చేనెల 17వ తేదీన జరగనుందని తెలిపారు.
ఎస్‌ఎస్‌సి మారిన పరీక్షల టైంటేబుల్
పాత తేది మారిన తేది సబ్జెక్టు సమయం
10.04.14 గురువారం 12.04.14 శనివారం సోషల్ స్టడీస్ పేపర్-1 11 నుంచి 1.30 వరకు
11.04.14 శుక్రవారం 15.04.14 మంగళవారం సోషల్ స్టడీస్ పేపర్-2 9.30 నుంచి 12 వరకు
12.04.14 శనివారం 16.04.14 బుధవారం ఓఎస్‌ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2
(సంస్కృతం, అరబిక్, పర్షియన్) 9.30 నుంచి 12 వరకు
15.04.14 మంగళవారం 17.04.14 గురువారం ఒకేషనల్ కోర్సు (థియరీ) 9.30 నుంచి 11.30 వరకు
No comments:
Post a Comment