- సిఎస్ స్పష్టీకరణ - పాసుల్లేవని సచివాలయం వద్ద ఆపితే ఆందోళన - ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేత వెంకటేష్ హెచ్చరిక
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను జూన్ 30వ తేదీ వరకు యథాతధంగా కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పికె మహంతి స్పష్టం చేశారని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యదర్శి జె వెంకటేష్ చెప్పారు. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న 5.5 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను యథాతధంగా కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పికె మహంతిని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యదర్శి జె వెంకటేష్, ఉపాధ్యక్షురాలు ఎం పద్మశ్రీ, ఎపి స్టేట్ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ ఎం జనార్ధన్‌రెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం జె వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను జూన్ 30 వరకు కొనసాగిస్తామని సిఎస్ స్పష్టం చేశారని చెప్పారు. మార్చి 31 వరకే కొనసాగుతారని భయాందోళనల మధ్య కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. సిఎస్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారని అన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు సచివాలయంలోకి రావడానికి ఇచ్చిన పాస్‌ల అనుమతి ఈనెల 31 వరకే ఉందని తెలిపారు. సిఎస్ ఆదేశాలు ఇచ్చినందున వారిని తర్వాత కూడా అనుమతించాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సచివాలయం వద్ద వారికి అనుమతి నిరాకరిస్తే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఐఆర్, జీతాలు, రెగ్యులరైజేషన్ వంటి అంశాలను రెండు రాష్ట్రాల్లో ఏర్పడే కొత్త ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ వారు పనిచేసే కేడర్‌కు వర్తించే మినిమం టైంస్కేల్‌తోపాటు కరువు భత్యాన్ని చెల్లించాలని కోరారు. పదో పిఆర్‌సిని ప్రారంభతేదీ నుంచి అమలు చేయాలని తెలిపారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సూచించారు. బస్‌పాస్ సౌకర్యం కల్పించాలని కోరారు. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని చెప్పారు. ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని తెలిపారు.
No comments:
Post a Comment