MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Thursday, February 20, 2014

మిన్నంటిన నిరసనల హోరు

Posted on: Thu 20 Feb 04:18:57.006807 2014


- అంగన్వాడీల ర్యాలీలు, రాస్తారోకోలు, ముట్టడులు
-ఎన్నాళ్లీ వెట్టిచాకిరీ? : జాన్‌వెస్లీ
- సమ్మెకు పుణ్యవతి సంఘీభావం
ప్రజాశక్తి - యంత్రాంగం
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. రాస్తారోకోలు, ర్యాలీలు, ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం, భిక్షాటన, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, చెవిలో పూలు, మౌన ప్రదర్శన తదితర రూపాల్లో అంగన్‌వాడీలు నిరసన వ్యక్తం చేశారు. మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో ధర్నా చేస్తున్న సిఐటియు జిల్లా నాయకులు సాయిలును పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోనూ పోలీసులు అరెస్టులకు పాల్పడ్డారు. ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట ఉన్న అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పుణ్యవతి సందర్శించి, సంఘీభావం తెలిపారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమంలో కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ పాల్గొన్నారు.
సిఎం క్యాంపు కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలపై పోలీసులు మంగళవారం పైశాచికత్వం ప్రదర్శించినందుకు నిరసనగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం చేపట్టిన ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమంలో కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తక్కువ వేతనాలిస్తూ అంగన్‌వాడీలతో ఎన్నాళ్లు వెట్టిచాకిరీ చేయించుకుంటుందని ప్రశ్నించారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్వాన్‌, ఛార్మినార్‌, రాజేంద్రనగర్‌, హయత్‌నగర్‌, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. రంగారెడ్డి వికారాబాద్‌లో సబ్‌కలెక్టరేట్‌ను, నార్సింగిలో ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఖమ్మంలో అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పుణ్యవతి సందర్శించి సంఘీభావం తెలిపారు. కొత్తగూడెం ప్రధాన రహదారిపై వంటావార్పు, వైరాలో భిక్షాటన చేశారు. ఇల్లందులో ఐసిడిఎస్‌ కార్యాలయాన్ని, మణుగూరులో తహశీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. నల్గొండ జిల్లా సూర్యాపేట, మిర్యాలగూడలో ఆర్డీవో కార్యాలయాలను ముట్టడించారు. కోదాడలో చెవిలో పూలు పెట్టుకుని నిరసన ప్రదర్శన, భువనగిరిలో మౌన ప్రదర్శన నిర్వహించారు. నల్గొండ, నకిరేకల్‌లో భిక్షాటన చేశారు. వరంగల్‌ జిల్లా హన్మకొండ, నర్సంపేట, భూపాలపల్లిలో ర్యాలీలు, జనగామలో మౌన ప్రదర్శన నిర్వహించారు. ఆదిలాబాద్‌లో బిక్షాటన, సిర్పూర్‌(యు)లో మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. నిజామాబాద్‌, బోధన్‌లో ఆర్‌డిఓ కార్యాలయాలను ముట్టడించారు. కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. మెట్‌పల్లిలో ఆరు మండలాల అంగన్‌వాడీ కార్యకర్తలు కరీంనగర్‌-నిజామాబాద్‌ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మెదక్‌ జిల్లాలో తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు. 
కర్నూలులో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీలు వినతిపత్రం అందించారు. ఆదోని, నంద్యాల, కర్నూలు డివిజన్లలో రాస్తారోకో, ధర్నా చేశారు. అనంతపురంలో కళ్లకు గంతలు కట్టుకొని, కడపలో చెవిలో పూలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు జరిపారు. తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద భిక్షాటన చేశారు. 
శ్రీకాకుళం జిల్లాలో రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించి, ఎంపిడిఓ కార్యాలయాలను ముట్టడించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం, డెంకాడలో రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. బొబ్బిలిలో ఈ ప్రభుత్వాన్ని ఊడ్చేస్తామంటూ చీపుర్లు పట్టుకొని ప్రదర్శన నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఆర్‌డిఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అమలాపురంలో, ముమ్మిడివరంలో నోటికి నల్లరిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. పలుచోట్ల నిరసన ప్రదర్శనలు జరిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, నరసాపురం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం ఆర్‌డిఓ కార్యాలయాలను ముట్టడించారు. విజయవాడలో ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం, న్యూజివీడులో ప్రదర్శన, గుడివాడ, తిరువూరు, నందిగామలో ఐసిడిఎస్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రాస్తారోకో చేస్తున్న అంగన్‌వాడీల్లో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. కందుకూరులో వెయ్యిమందితో ప్రదర్శన చేపట్టారు. పెద్దారవీడులో దున్నపోతుకు వినతిపత్రం అందజేశారు. తర్లుపాడులో నిరాహారదీక్ష చేపట్టారు. కనిగిరిలో తహశీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. నెల్లూరు జిల్లాలో అన్ని ఆర్డీవో కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు.

No comments: