MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Wednesday, January 29, 2014

ఉధృతం కానున్న విద్యుత్ పోరు..

Posted on: Wed 29 Jan 14:43:25.046281 2014
హైదరాబాద్ : వేతన సవరణ, వేతనాల పెంపు కోరుతూ విద్యుత్ ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఆందోళనా
కార్యక్రమాలను ప్రకటించారు. ఈ మేరకు ఫిబ్రవరి 4, 5 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో విధుల నిర్వహణ, 6న పెన్‌డౌన్‌, 7న జిల్లాల్లో ధర్నా, 8న విద్యుత్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేయనున్నట్టు పేర్కొన్నారు. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే 17న చలో హైదరాబాద్, 18 నుంచి నో వర్క్ నిరసన కార్యక్రమాల్ని నిర్వహించాలని జేఏసీ ప్రకటించింది. ఇప్పటికే .. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 14 సంఘాలకు చెందిన సిబ్బంది ధర్నాలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా వారు విద్యుత్ సౌధాను ముట్టడించి ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లు నేరవేరకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యుత్ ఉద్యోగుల నిరసనలతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేతన సవరణ కమిటీ నియమించి తమకు న్యాయంగా రావాల్సిన జీతాలను వెంటనే పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం పరిష్కారం చూపాలి...
విద్యుత్ ఉద్యోగులకు ప్రతి నాలుగేళ్లకోసారి వేతన సవరణ జరుగుతుంది. అందులో భాగంగా ఏప్రిల్‌ నెలకల్లా జీతాలు పెంచాల్సి ఉంది. సవరణ జరగాలంటే మూడు నెలల ముందుగా ఒక కమిటీ వేయాల్సి ఉంటుంది. కమిటీ నియామకం ఇప్పటి దాకా జరగలేదు. అందుకే వెంటనే వేతన సవరణ కమిటీని నియమించాలని ఏపీ పవర్ ఎంప్లాయిస్‌ జేఏసీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం వెంటనే తమ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో అంచెలంచెలుగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు

No comments: