MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Saturday, December 21, 2013

Namasthe Telangana Telugu News Paper

 Namaste Telangana date 19-12-2013


1 comment:

Anonymous said...

ఒక విన్నపం
అనగా ఓక అడవి ఆ అడవిలో ఓక పావురం అది ఎప్పటిలాగే ఒక చెట్టు పై వాలింది. అనుకోకుండా దాని దృష్టి నీటి ప్రవాహం లొ కొట్టుకు పోతున్న చిరు చీమపై పడింది. ఆ చీమను కాపాడలనే వుద్యేశంతో చెట్టుకున్న ఆకును తీసి చీమ ముందు వేసింది చీమ ఒడ్డుకు చేరింది.
అంతటితో కథ ముగిసిపోలేదు అడవి లో పావురం పై గురి పెట్టిన వేటగాడి కాలుపై కరచి వేటగాడి బారినుండి పావురాన్ని కాపాడింది చీమ. ఈ విదంగా పరస్పర సహాయం చెసుకొంటూ ఆదర్శంగా నిలిచాయి ఆ మూగ జీవాలు.

ఇది అందరికీ తెలిసిన కథే కాని గుర్తు చెయవలసిన సమయం ఆసన్నమైంది.
ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో 2008-09 విద్యాసంవత్సరం నుండి పని చేస్తున్న 5000 మంది కంప్యూటర్ ఉపాద్యాయులు ఉపాది కోల్పోయారు.మరల ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందన్న ఆశతో వేరొక ఉపాదిని చూసుకోలేక ఖాలీ గా కూర్చోలేక వేతనాలు, పి.ఎఫ్ బకాయిల వ్యవహారం తేలక రోడ్డున పడి సమాజం దృష్టిలో చేతకానివారిగా మిగిలి పోతునారు.

ఇదే సమయం లో 2010-11 విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో పనిచేస్తున్న1300 మంది కంప్యూటర్ ఉపాద్యాయులు ఆనందంగా తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇది ఎంతవరుకు సమంజసం?
మిత్రులారా!
నేటి మా ఈ పరిస్థితి రేపటి రోజున మీకు రాదా? ఒక్క క్షణం ఆలోచించండి.........
ప్లీజ్ మాకు సహయం చెయ్యండి.
మీ విధులకు హాజరు కాకుండా మాకు సంగీభావం తేలిపి ఐక్యతను చాటుతారని ప్రార్దిస్తూయున్నాను.

ఆదర్శంగావుందాం – ఐక్యంగా సాదిద్దాం.