కాంట్రాక్టు ఉద్యోగులకు ఊరట..
Prajasakti హైదరాబాద్ Mon, 30 Sep 2013, ISTపిడిఎఫ్, పోరాటం,రాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టు,
కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు కొంత
ఊరట లభించింది. కాంట్రాక్టును వచ్చే సంవత్సరం మార్చి వరకు పొడిగిస్తూ
రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ
చేశారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న సుమారు ఐదు లక్షల మంది
కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కొంత ఊరట పొందనున్నారు. ఉద్యోగుల
కొనసాగింపు కోసం పిడిఎఫ్ ఎమ్మెల్సీలతో కలిసి ఎపి కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్
ఎంప్లాయిస్ ఫెడ రేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు అధికారులతో
సంప్రదింపులు జరిపారు. ఈ సందర్భంగా ఎవి నాగేశ్వరరావు మాట్లాడారు. అనేక
దఫాలుగా పోరాట ఫలితంగా ఐదు లక్షల కార్మికులకు కొంత ఊరట లభిచిందని, మార్చి
వరకు మాత్రమే రెన్యువల్ చేయడం జరిగిందన్నారు. దీనిని తరువాత కూడా
కొనసాగించాలని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలివ్వాలని, డిఎ సౌకర్యం
ఇవ్వాలని తాము కోరడం జరిగిందన్నారు. ఐదు సంవత్సరాల వరకు వేతనాలు పెంచడం
లేదని, ప్రతి సంవత్సరం వేతనాలు పెంచాలని కోరినట్లు తెలిపారు. అలాగే బస్సు
పాస్ సౌకర్యం కల్పించాలని కోరుతూ వినతిప్రతాలు ఇవ్వడం జరిగిందని ఎవి
నాగేశ్వరరావు తెలిపారు.
No comments:
Post a Comment