MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Friday, August 2, 2013

ఆర్వీఎం నిధుల్లో భారీ కోత

ఆర్వీఎం నిధుల్లో భారీ కోత
Sakshi | Updated: June 18, 2013 01:37 (IST)
India: శ్రీకాకుళం, న్యూస్‌లైన్: రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) కింద ఈ ఏడాది జిల్లాలో చేపట్టే పనులకు సంబంధించి నిధుల్లో భారీగా కోత పడింది. కారణాలేమిటో తెలియకపోయినా జిల్లా అధికారులు పంపిన ప్రతిపాదనల్లో 60 శాతానికిపైగా కోత పడింది. ప్రతి ఏటా పంపే ప్రతిపాదనల్లో సాధారణంగా 10 నుంచి 15 శాతం కోత విధించి మంజూరు చేసేవారు. కానీ ఈ ఏడాది రూ. 300 కోట్లకు ప్రతిపాదనలు పంపగా రూ. 110 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. దీంతో కార్యక్రమాలు చేపట్టే విషయంలో అధికారులు ఆచితూచి అడుగేస్తున్నారు. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చాక ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. అందుకు తగినట్లు నిధులు మంజూరు చేయాల్సిందిపోయి భారీ కోత విధిస్తుండటంతో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. 
ఇదివరకు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు మూత్రశాలలు, అదనపు గదుల నిర్మాణం, కేజీబీవీల నిర్వహణ, బాలికా సంరక్షణ, జవహర్ ఆరోగ్య రక్ష, ఎంపీడీఈఎల్, అవాస కేంద్రాల నిర్వహణ, బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహించేవారు. ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టేవారు. వీటికి అదనంగా విద్యా వలంటీర్ల నియామకాలు చేపట్టేవారు. ఈ ఏడాది విద్యా వలంటీర్లను నియమించవద్దని ఆదేశాలు అందాయి. అయితే ఉపాధ్యాయులకు శిక్షణ విషయంలో ఎలాంటి సూచనలు చేయకపోవడంతో అధికారులు కూడా మౌనం వహించారు. పాఠశాలల సంసిద్ధత కార్యక్రమం కూడా అరకొరగానే జరుగుతోంది.
నిధుల్లో కోత విధించడం వల్ల చాలా కార్యక్రమాలు నిలిచిపోయే అవకాశం ఉంది. మరోవైపు పాఠశాల యాజమాన్య కమిటీల ఖాతాల్లో పెద్దఎత్తున ఉన్న మిగులు నిధులను వెనక్కి రప్పించాలని ఆర్‌వీఎం ఉన్నతాధికారులు సూచించడంతో అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. నిధుల కోత విషయమై ఆర్‌వీఎం పీవో నగేష్ వద్ద ప్రస్తావించగా నిధులు తగ్గిన మాట వాస్తవమేనన్నారు. రూ. 300 కోట్లతో ప్రతిపాదనలు పంపగా రూ. 110 కోట్లే మంజూరైనట్లు సమాచారం అందిందని, అయితే ఉత్తర్వులు ఇంకా తమకు అందలేదని చెప్పారు.

No comments: