MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Friday, August 2, 2013

కంప్యూటర్ ఉపాధ్యాయుడా మేలుకో ! తెలుసుకో !!!

కంప్యూటర్ ఉపాధ్యాయుడా మేలుకో ! తెలుసుకో !!!

కంప్యూటర్ టీచర్స్ (లేక) కంప్యూటర్ ఫ్యాకల్టీలు (లేక) కంప్యూటర్ ట్రైనీలు కార్మికులా ...? - అయితే లేబర్ లా ప్రకారం కంప్యూటర్ ఉపాధ్యాయులు ఏ కోవాకు చెందిన వారు...? అసలు కంప్యూటర్ టీచర్స్ (లేక) కంప్యూటర్ ఫ్యాకల్టీలు (లేక) కంప్యూటర్ ట్రైనీలు గురించి లేబార్ లా లో ఉందా...? అయితే వివరాలు కోసం
మరి కొన్ని వివరాలు కొసం
1 G.O.Ms.No.3
2 G.O.Rt.No. 1337
3 G.O.Rt.No.994

మన ఏజన్సీవారు ఒప్పదంలో లేబార్ లా ప్రకారం జీతాలు ఇచ్చుటకు అంగీకరించారు. అయితే ఎందుకు అమలు కావడంలేదు...?8.0 Provision of Faculty: 8.1  (Page no. 9 of 28) 
మనకు PF ఎందుకు రావడం లేదు ? మనం పనిచేస్తున్నట్లు Head Officeకు సమాచారం అందించాలి కదా ?  నెలా Monthly report పంపాలి కదా ? Monthly report వెళ్ళక పోవడం వలన Head Office దృషిలో మనం పనిచేయ్యనట్టే ! కొ-ఆర్డినేటర్ ఈ Report పంపాలి, ఎందుకు పంపడం లేదు ? ఎందుకంటే బినామీ పేర్లతొ అనేక మంది జీతాలను నెలా నెలా మిగుతున్నాడు. ఇది మనం అడగాలి లేదా మనం ఎన్నుకున్న జిల్లా అధ్యక్షుడు అడగాలి కదా! మనం మన అధ్యక్షుడిని అడుగుదాం!

No comments: