MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Tuesday, June 25, 2013

25-06-13

ఉద్యోగ భద్రత కోసం కాంట్రాక్టు లెక్చరర్ల దీక్షలు ఆరంభం

ప్రజాశక్తి - విలేకరులు   Tue, 25 Jun 2013, IST  

  • ధర్నాలు, ర్యాలీలు
  • రాజమండ్రిలో ముట్టడి
జూనియర్‌, డిగ్రీ లెక్చరర్ల పోస్టులు భర్తీ ప్రక్రియను నిలిపివేయాలని, కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కాంట్రాక్టు లెక్చరర్లు సోమవారం నుంచి దీక్షలు ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఇంటర్మీడియట్‌ ఆర్‌జెడి కార్యాలయాన్ని కాంట్రాక్టు లెక్చరర్లు ముట్టడించి మూడు గంటలపాటు దిగ్బంధించడంతో కార్యకలాపాలు స్తంభించాయి.
ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట దీక్షలను సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ లెక్చరర్ల రెగ్యులైజేషన్‌ హామీని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నెల్లూరు జిల్లాలో కాంట్రాక్టు లెక్చరర్లు సమ్మె ప్రారంభించారు. తొలుత స్థానిక డివిఇఓ, ఆర్‌ఐఓ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌కు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో 200 మంది లెక్చరర్లు పాల్గొన్నారు. వరంగల్‌ జిల్లా హన్మకొండలోని బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియెట్‌ ఎడ్యుకేషన్‌ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలను ఎమ్మెల్యే వినరుభాస్కర్‌, టిజిఎ రాష్ట్ర అధ్యక్షులు మర్రి యాదవరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. దీక్షకు ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం సంఘీభావం తెలిపింది. నల్గొండ పట్టణంలో సమ్మె చేపట్టారు. ఖమ్మంజిల్లా వృత్తి విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట సమ్మెకు ప్రిన్సిపాల్స్‌ అసోసియేషన్‌ సంఘీభావం తెలిపింది. హైదరాబాద్‌లో ఇందిరాపార్కు వద్ద నిరవధిక దీక్ష సందర్భంగా ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, తెలంగాణ పిఆర్‌టియు అధ్యక్షులు హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడారు. గుంటూరు కలెక్టరేట్‌ వద్ద సమ్మె శిబిరంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకులు పాల్గొన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట, నూజివీడులోని ఆర్డీవో కార్యాలయం ఎదుట దీక్షలు కొనసాగాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఇంటర్మీడియట్‌ ఆర్‌జెడి కార్యాలయాన్ని కాంట్రాక్టు లెక్చరర్లు ముట్టడించి మూడు గంటలపాటు దిగ్బంధించడంతో కార్యకలాపాలు స్తంభించాయి. శ్రీకాకుళం జిల్లా వృత్తివిద్యాశాఖ కార్యాలయం వద్ద ఒప్పంద అధ్యాపకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా డివిఇఓ, ఆర్‌ఐఓలకు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం ఆర్ట్స్‌ కళాశాల నుంచి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్‌ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. తదనంతరం డేఅండ్‌నైట్‌ కూడలి వద్ద సమ్మె చేపట్టారు. విజయనగరం కలెక్టరేట్‌ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలను సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణమూర్తి ప్రారంభించారు. అనంతరం జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్‌ యుసిజి నాగేశ్వరరావుకు వినతిని అందజేశారు. వారి పోరాటానికి ఎస్‌ఎఫ్‌ఐ మద్దతు తెలిపింది. విశాఖ జిల్లా దేవరాపల్లిలో అధ్యాపకులు విధులు బహిష్కరించారు. నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో స్థానిక ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణతో పాటు కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ అసొసియేషన్‌ జిల్లా అధ్యక్షులు జి.లక్ష్మినారాయణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌బాబు పాల్గొన్నారు. ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట రిలే దీక్షలు ప్రారంభించారు. కరీంనగర్‌లో ఆర్‌ఐఓ కార్యాయంలోని డివిఇఓ ఆఫీస్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఖాళీగా ఉన్న స్థానాలను తమతోనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. 

No comments: