ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలి
ప్రజాశక్తి- సిరిసిల్ల Fri, 7 Jun 2013, IST
- ఆర్డిఓ శ్రీనివాస్
ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని ఆర్డివో శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రోజున బడిబాట కార్యక్రమంలో భాగంగా తంగళ్లపెల్లి గ్రామంలో ఆయన ఇంటింటికీ తిరిగి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో ఇరుకుగదుల్లో విద్యాభోధనలు జరుగుతాయని, సరియైన మౌళిక సదుపాయాలు ఉండవన్నారు. అదే ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైన తరగతి గదులతోపాటూ ఎలాంటి ఫీజులు ఉండవని, ప్రతీ విద్యార్థికి సంవత్సరానికి రెండు జతల యునిఫాంతోపాటూ ఉచిత భోజన వసతి ఉంటుందన్నారు. ఉచిత శస్త్రచికిత్సలు ఉపకరణాల పంపిణీ లభిస్తుందన్నారు. ప్రతినెల ప్రాథమిక ఆరోగ్య సిబ్బందితో పరీక్షించి విద్యార్థులకు మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి నెలలో వారానికి రెండుసార్లు కోడిగుడ్లతోపాటూ, పౌష్టికాహారాన్ని అందిస్తుందన్నారు. కావున ప్రతి తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ జయచంద్రారెడ్డి, ఎంఈఓ దూస దశరథం, మాజీ సర్పంచ్ ఆడెపు రవీందర్, తంగళ్లపెల్లి హైస్కూల్ మరియు ప్రాథమికోన్నత పాఠశాల హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment