కనీస వేతనాల సాధనకు చలో ఢిల్లీ : సిఐటియు Chitturu News clip
ఆదివారం స్థానిక సిటిటియు కార్యాలయంలో విలేక రుల సమావేశం
నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో మన రాష్ట్రంలో ఐసిడిఎస్ మధ్యాహ్నం భోజన పథకం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, సర్వశిక్ష అభియాన్, (రాజీవ్ విద్యామిషన్) యం.జి.యన్.ఆర్.ఈ.జి.యస్(ఉపాదిహామి) జాతీయ గ్రామీణ ఉపాధి జీవనోపాదుల మిషన్ (ఇందిరా కాంతి పథం) ఐసిటి(కంప్యూటర్‌విద్యా) మినీ గురుకులాలు పట్టణ పేదరిక నిర్మూలన పథకం జాతీయ గ్రామీణ మంచి నీటి పథకం అమలవుతున్నాయని తెలిపారు. ఈ పథకాలలో ఆరు లక్షల మంది ఉన్నారన్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగులను నియమిం చకుండా గౌరవవేతనం, పారితోషికం, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైమ్ ప్రాతిపదికన నియమించి అతి తక్కువ వేతనాలనతో వెట్టి చేయించుకుంటున్నారని విమర్శించారు చట్ట ప్రకారం చెల్లించాల్సిన పియఫ్, ఇయస్‌ఐ సౌకర్యలు అందడం లేదన్నారు. అవినీతి స్కామ్‌లో మునిగిన ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్నారు. ఉద్యోగుల కనీస వేతనాల పరిష్కార కోసం నవంబర్ 26, 27 తేదీలలో చలో డిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
No comments:
Post a Comment