MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Sunday, February 9, 2014

సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం

Posted on: Sat 08 Feb 05:23:13.05583 2014
- కొనసాగుతున్న అంగన్‌వాడీల దీక్షలు - ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలి: సాయిబాబు :: ప్రజాశక్త్తి - యంత్రాంగం
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు శుక్రవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగాయి. కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, అదనపు పనికి అదనపు వేతనం, బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీక్షా శిబిరాలను ప్రజాసంఘాల నాయకులు, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వరూపరాణి సందర్శించి మద్దతు తెలిపారు.

ఆదిలాబాద్‌ ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎం.సాయిబాబు సందర్శించి మాట్లాడారు. అంగన్‌వాడీలపై అదనపు పనిభారం మోపుతూ ప్రభుత్వం శ్రమ దోపిడీకి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ధరలతో పోల్చుకుంటే వారికి చెల్లిస్తున్న రూ.3,500 ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. ఇదే వేతనంతో ఐసిడిఎస్‌ అధికారులు కుటుంబాలను పోషించుకుంటారా అని ప్రశ్నించారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని, ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టి సమస్యలు పరిష్కరించేవరకూ ఉద్యమించాలని కార్యకర్తలను కోరారు.
కరీంనగర్‌ జిల్లాలోనూ దీక్షలు కొనసాగాయి. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట రూరల్‌, అర్బన్‌ అంగన్‌వాడీ కార్యకర్తలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తల దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సందర్శించారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో క్లాక్‌టవర్‌ సెంటర్‌లో చేపట్టిన దీక్షా శిబిరాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి మందడి సులోచన సందర్శించి మాట్లాడారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో అంగన్‌వాడీల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. షాద్‌నగర్‌లో సిఐటియు జిల్లా కార్యదర్శి కిల్లె గోపాల్‌ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ముందు నిరవధిక దీక్షలు కొనసాగాయి. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట, గోల్కొండ ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట, రాజేంద్రనగర్‌లో రిలే దీక్షలు కొనసాగాయి.
కృష్ణాజిల్లాలోని గుడివాడ, నూజివీడు ఐసిడిఎస్‌ కార్యాలయాల వద్ద అంగన్‌వాడీ ఉద్యోగులు ధర్నా చేశారు. విజయవాడ బందరు రోడ్డులోని ఖజానా జ్యూయలరీస్‌ వద్ద, గుణదల మేరీమాత క్షేత్రం సమీపంలోని ఐసిడిఎస్‌ కేంద్రాల వద్ద దీక్షలు కొనసాగుతున్నాయి. ఐద్వా నగర కార్యదర్శి కె.శ్రీదేవి, శ్రామిక మహిళా సంఘం కన్వీనర్‌ కుసుమ, మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ నగర కార్యదర్శి రవిచంద్ర దీక్షలకు మద్దతు తెలిపారు. గుంటూరు జిల్లాలో 23సెక్టార్‌ పరిధిలోని మండలాల్లో నిరసన దీక్షలు కొనసాగాయి. గుంటూరులో దీక్షలను ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం.ఆర్‌ దేవి ప్రారంభించారు. తెనాలి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు వద్ద అంగన్వాడీ దీక్షలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నాగబ్రహ్మాచారి, వైఎస్సార్‌ సిపి నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, తుని, పెద్దాపురంతోపాటు పలు మండలాల్లో దీక్షలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో రిలే దీక్షలు రెండో రోజుకు చేరాయి. పోలవరం ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సమ్మె కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు ఐసిడియస్‌ పీడీ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు ధర్నా చేశారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని అన్ని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద కార్యకర్తలు, హెల్పర్లు నిరసన తెలిపారు. విశాఖ కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు.
కడప కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. చిత్తూరులో సిడిపివో కార్యాలయం ఎదుట సిఐటియు జిల్లా అధ్యక్షులు చైతన్య ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు ధర్నా చేశారు. అనంతరం సీడిపివోకు వినతిపత్రం ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోని 17 సిడిపిఓ ప్రాజెక్టుల ఎదుట జరిగిన దీక్షల్లో ఆయాలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలోని 15 ప్రాజెక్టుల పరిధిలో, మహబూబ్‌నగర్‌ జిల్లాలో దీక్షలు కొనసాగాయి.- కొనసాగుతున్న అంగన్‌వాడీల దీక్షలు
- ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలి: సాయిబాబు
ప్రజాశక్త్తి - యంత్రాంగం
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు శుక్రవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగాయి. కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, అదనపు పనికి అదనపు వేతనం, బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీక్షా శిబిరాలను ప్రజాసంఘాల నాయకులు, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వరూపరాణి సందర్శించి మద్దతు తెలిపారు.
ఆదిలాబాద్‌ ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎం.సాయిబాబు సందర్శించి మాట్లాడారు. అంగన్‌వాడీలపై అదనపు పనిభారం మోపుతూ ప్రభుత్వం శ్రమ దోపిడీకి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ధరలతో పోల్చుకుంటే వారికి చెల్లిస్తున్న రూ.3,500 ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. ఇదే వేతనంతో ఐసిడిఎస్‌ అధికారులు కుటుంబాలను పోషించుకుంటారా అని ప్రశ్నించారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని, ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టి సమస్యలు పరిష్కరించేవరకూ ఉద్యమించాలని కార్యకర్తలను కోరారు.
కరీంనగర్‌ జిల్లాలోనూ దీక్షలు కొనసాగాయి. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట రూరల్‌, అర్బన్‌ అంగన్‌వాడీ కార్యకర్తలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తల దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సందర్శించారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో క్లాక్‌టవర్‌ సెంటర్‌లో చేపట్టిన దీక్షా శిబిరాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి మందడి సులోచన సందర్శించి మాట్లాడారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో అంగన్‌వాడీల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. షాద్‌నగర్‌లో సిఐటియు జిల్లా కార్యదర్శి కిల్లె గోపాల్‌ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ముందు నిరవధిక దీక్షలు కొనసాగాయి. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట, గోల్కొండ ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట, రాజేంద్రనగర్‌లో రిలే దీక్షలు కొనసాగాయి.
కృష్ణాజిల్లాలోని గుడివాడ, నూజివీడు ఐసిడిఎస్‌ కార్యాలయాల వద్ద అంగన్‌వాడీ ఉద్యోగులు ధర్నా చేశారు. విజయవాడ బందరు రోడ్డులోని ఖజానా జ్యూయలరీస్‌ వద్ద, గుణదల మేరీమాత క్షేత్రం సమీపంలోని ఐసిడిఎస్‌ కేంద్రాల వద్ద దీక్షలు కొనసాగుతున్నాయి. ఐద్వా నగర కార్యదర్శి కె.శ్రీదేవి, శ్రామిక మహిళా సంఘం కన్వీనర్‌ కుసుమ, మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ నగర కార్యదర్శి రవిచంద్ర దీక్షలకు మద్దతు తెలిపారు. గుంటూరు జిల్లాలో 23సెక్టార్‌ పరిధిలోని మండలాల్లో నిరసన దీక్షలు కొనసాగాయి. గుంటూరులో దీక్షలను ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం.ఆర్‌ దేవి ప్రారంభించారు. తెనాలి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు వద్ద అంగన్వాడీ దీక్షలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నాగబ్రహ్మాచారి, వైఎస్సార్‌ సిపి నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, తుని, పెద్దాపురంతోపాటు పలు మండలాల్లో దీక్షలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో రిలే దీక్షలు రెండో రోజుకు చేరాయి. పోలవరం ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సమ్మె కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు ఐసిడియస్‌ పీడీ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు ధర్నా చేశారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని అన్ని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద కార్యకర్తలు, హెల్పర్లు నిరసన తెలిపారు. విశాఖ కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు.
కడప కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. చిత్తూరులో సిడిపివో కార్యాలయం ఎదుట సిఐటియు జిల్లా అధ్యక్షులు చైతన్య ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు ధర్నా చేశారు. అనంతరం సీడిపివోకు వినతిపత్రం ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోని 17 సిడిపిఓ ప్రాజెక్టుల ఎదుట జరిగిన దీక్షల్లో ఆయాలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలోని 15 ప్రాజెక్టుల పరిధిలో, మహబూబ్‌నగర్‌ జిల్లాలో దీక్షలు కొనసాగాయి.

No comments: