MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Sunday, February 9, 2014

8 నుంచి సమ్మెలోకి : పాలడుగు Posted on: Sat 08 Feb 05:47:24.339486 2014


ప్రజాశక్తి-హైదరాబాద్‌ ప్రతినిధి
   మున్సిపల్‌ కార్మికుల పట్ల నిర్లక్ష్యం విడనాడకపోతే ఫిబ్రవరి 8 నుంచి నిరవధిక సమ్మె తప్పదని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియస్‌ (సిఐటియు) రాష్ట్ర ప్ర‌ధాన‌ కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం రాష్ట్ర మున్సిపల్‌ కార్మిక ఉద్యోగ సంఘాల జెఎసి ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌ జిహెచ్‌ఎంసి సెంట్రల్‌ జోన్‌ కార్యాలయం ఖైరతాబాద్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్లతో ఒప్పంద గడువు ముగిసి 2 నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదన్నారు. దీన్నిబట్టి మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమౌతోందన్నారు. కనీస వేతనం రూ.12500 నిర్ణయించాలని, వేతన పెంపుదల పి.ఆర్‌.సి అమలయ్యేనాటి నుంచి కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ నగర అధ్యక్షులు జె.వెంకటేశ్‌ మాట్లాడుతూ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కార్మికుల సమస్యలపై 2013 అక్టోబర్‌ 21 నుండి 24 వరకు రాష్ట్ర వ్యాపిత సమ్మె సందర్భంగా నవంబర్‌ 05, 2013న జిఓ నెం.1615 కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించిదని తెలిపారు. కమిటీ ఏర్పడిన 30 రోజుల్లో డ్రాప్ట్‌ నివేదికపై యూనియన్ల ప్రతినిధులతో చర్చలు జరుపుతామని చెప్పినా నేటికీ ప్రభుత్వం స్పందించకపోవడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా గతంలో చేసుకున్న ఒప్పందాలను ఫిబ్రవరి 7 నాటికి అమలు చేయాలని, లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు కృష్ణారావు, ఏసురత్నం, బిఎంఎస్‌ నాయకులు శంకర్‌, హెచ్‌ఎంఎస్‌ నాయకులు రెబ్బరామారావు  తదితరులు మాట్లాడారు.

No comments: