MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Tuesday, January 31, 2017

ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసు అందిందా...? సిద్ధం కండి

నల్లధనంపై పోరు పేరుతో పెద్ద నోట్లను రద్దు చేయడం, సామాన్యులు బ్యాంకుల వద్ద క్యూల్లో నిల్చుని మరీ డబ్బులు డిపాజిట్ చేయడం ముగిసిపోయింది. రూ.2.5 లక్షలకు మించి తమ ఖాతాల్లో జమ చేసిన వారికి నోటీసులు పంపే పనిలో ఆదా శాఖ ఉంది. కరెంటు ఖాతాల్లో అయితే రూ.12.5 లక్షలకు మించి చేసే డిపాజిట్ దారులకూ నోటీసులు అందనున్నాయి.  మరి ఐటీ శాఖ నుంచి నోటీసు అందితే ఏంటి పరిస్థితి... ఏం చేయాలి...?
Image result for Read more » image gif

Related Imageస్క్రూటినీ నోటీసుఓ వ్యక్తి లేదా సంస్థ దాఖలు చేసిన వార్షిక ఆదాయ వివరాల రిటర్నులను పరిశీలించేందుకు వీలుగా జారీ చేసే నోటీసు ఇది. రిటర్నుల్లో పేర్కొన్న వ్యయాలు, మినహాయింపులు, నష్టాలను ఆధారాలతో పోల్చి చూస్తారు. రిటర్నుల పరిశీలనలో భాగంగా విచారణ కూడా చేపట్టే అవకాశం ఉంటుంది. రిటర్నుల్లో చూపిన ఆదాయం సరిగ్గానే పేర్కొన్నారా...?, చట్టబద్ధంగా సరైనవేనా..?  అన్నది నిర్ధారించుకుంటారు.

తప్పుడు వివరాలు అని గుర్తిస్తే...?లోపాలు, వ్యత్యాసాలు, దోషాలు తమ దృష్టికి వస్తే అప్పుడు అసెస్ మెంట్ అధికారి తానే స్వయంగా పన్ను చెల్లింపుదారుడి వాస్తవిక ఆదాయాన్ని నిగ్గు తేలుస్తారు. సెక్షన్ 143(3) కింద ఈ పనిచేస్తారు. ఆ తర్వాత పన్నుతోపాటు వడ్డీలు, జరిమానాలను విధించే అవకాశం ఉంటుంది. అలాగే, చట్టపరమైన విచారణ చర్యలను కూడా ప్రారంభించవచ్చు.  


రిటర్నులు దాఖలు చేయకుంటే..?representative imageపన్ను చెల్లించతగిన ఆదాయం ఆర్జించే ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత గడువులోపల రిటర్నులు దాఖలు చేయాలి. రిటర్నుల్లో పేర్కొనే ఆదాయ వివరాలు పన్ను శాఖ వద్దనున్న డేటాతో సరిపోలాలి. రూ.2.50 లక్షల కనీస ఆదాయ మినహాయింపు మార్కు దాటి ఆర్జన ఉంటే, టీడీఎస్ వంటివి కోత కోసినా గానీ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా పలు రకాల కారణాల రీత్యా రిటర్నులు దాఖలు చేయనట్టయితే స్క్రూటినీ నుంచి మినహాయింపు పొందలేరు. ఆ శాఖ నుంచి నోటీసు అందుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.


తక్కువ ఆదాయ వివరాలు పేర్కొంటే...ఆదాయంలో గణనీయమైన తగ్గుదల చూపితే లేదా గతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగినా దీన్నో సందేహాస్పద కేసుగా పన్ను అధికారి భావించి స్క్రూటినీ చేపట్టవచ్చు. వ్యాపారాల్లో ఉన్న వారి విషయంలో ఎక్కువగా ఈ విధమైన తేడాలు కనిపిస్తుంటాయి. ఇటువంటి సందర్భాల్లో ఆదాయపన్ను శాఖ అధికారి వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆధారాలతో కూడిన పత్రాలు, అకౌంట్, బ్యాలన్స్ షీట్లు, కుటుంబ సభ్యుల ఆదాయ వివరాలు వంటి సమాచారం కోరవచ్చు.


26ఏఎస్ అనేది ఓ వ్యక్తి తరఫున ఆదాయపన్ను శాఖకు మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)ను, జమలను సూచించే పత్రం. రిటర్నులు దాఖలు చేసే ముందు తమ తరఫున ఆదాయపన్ను శాఖకు జమ అయిన టీడీఎస్ లు, పన్నుల గురించి ఆ శాఖ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కోసారి టీడీఎస్ అన్నది బ్యాంకులు, ఉద్యోగం చేస్తున్న కంపెనీలు జమ చేసే అవకాశం ఉంటుంది.


మినహాయింపు ఆదాయం గురించి పేర్కొనకపోవడంకొన్ని రకాల ఆదాయంపై పన్ను మినహాయింపులు ఉంటాయన్న విషయం తెలిసిందే. షేర్లపై అందుకునే దీర్ఘకాలిక మూలధన లాభాలు, డివిడెండ్ రూపంలో అందుకునే ఆదాయం ఇలాంటిదే. పన్ను లేదు కదా అని ఈ ఆదాయం గురించి పేర్కొనకపోవడం తప్పిిదమే అవుతుంది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాపై వడ్డీ అదాయం రూ.10వేల లోపు, పీపీఎఫ్ వడ్డీ, తల్లిదండ్రుల నుంచి అందుకునే బహమతులు ఇవన్నీ కూడా రిటర్నుల్లో తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మినహాయింపుల వివరాలను సరి చూసేందుకు వీలుగా స్క్రూటినీ చేపట్టే అవకాశం ఉంటుంది.


ఎఫ్ డీలపై, సేవింగ్స్ ఖాతాలపై వడ్డీబ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఏటా రూ.10వేలకు మించి ఉంటే టీడీఎస్ కింద 10 శాతాన్ని కోసేసి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తుంటాయి. ఇలాంటి సందర్బాల్లో ఇక పన్ను చెల్లించక్కర్లేదనుకుంటారు కొందరు. కానీ, ఇది తప్పు. ఎందుకంటే ఒక వ్యక్తి వార్షికంగా రూ.20వేల వడ్డీ ఆదాయం అందుకున్నాడనుకోండి. టీడీఎస్ గా రూ.2వేలను బ్యాంకులు మినహాయిస్తాయి. ఒకవేళ 20 శాతం ట్యాక్స్ చెల్లించాల్సిన శ్లాబులో ఉన్నారనుకోండి. రూ.20వేలకు రూ.4వేలను పన్ను కట్టాలి. అంటే టీడీఎస్ పోను మరో రూ.2వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేయని సందర్భాల్లో అటువంటి కేసులను స్క్రూటినీ కింద అధికారులు చేపడతారు.


రిఫండ్ లు కోరితేఅధిక మొత్తంలో రిఫండ్ కోరుతూ దరఖాస్తు చేసిన సమయాల్లోనూ మీ రిటర్నులను స్కూటినీ చేయవచ్చు. ఎందుకంటే ఆలస్యంగా చేసే రిఫండ్ లపై ఆగాయపన్ను శాఖ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారాన్ని తప్పించుకునేందుకు రిటర్నుల పరిశీలను చేపడతారు. కొన్ని సందర్భాల్లో సమాచారాన్ని పరిశీలించి క్లెయిమ్ కు కారణాలు తెలుసుకుంటారు. వడ్డీ ఆదాయం ఏటా రూ.10వేలు దాటితే మూలం వద్ద పన్ను మినహాయించడం (టీడీఎస్) బ్యాంకులు చేసే పని. అయితే, వార్షిక ఆదాయం పన్ను వర్తించేంత లేనట్టయితే ఫామ్ 15హెచ్, 15జీ రూపంలో పత్రాన్ని సమర్పించడం ద్వారా టీడీఎస్ ను తప్పించుకోవచ్చు. ఈ పత్రాలను బ్యాంకులు ఐటీ శాఖకు పంపిస్తాయి. పాన్ నంబర్ ద్వారా మీ ఆదాయ వివరాలన్నీ ఆదాయపన్ను శాఖ అధికారులు తెలుసుకోగలరు. ఒకవేళ ఏదైనా మిస్ మ్యాచ్ అనిపిస్తే స్క్రూటినీ నోటీసుతో తమ పని ప్రారంభిస్తారు.


ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగం మారినట్టయితే సంబంధిత వ్యక్తి అదే ఆర్థిక సంవత్సరంలో అప్పటి వరకు పాత కంపెనీలో అందుకున్న వేతనం మొత్తం గురించి కొత్త కంపెనీకి తెలియజేయరు. ఒకవేళ తెలియజేసినా పాత కంపెనీలో టీడీఎస్, సెక్షన్ 80సీ మినహాయంపుల గురించి చెప్పరు. దీంతో కొత్తగా ఉద్యోగంలో చేరిన కంపెనీ మీ తరఫున టీడీఎస్ ను మినహాయిస్తాయి. దీనివల్ల రెండు చోట్లా అవి పునరావృతమవుతాయి. పైగా పన్ను పరమైన సమస్యలు కూడా ఎదురవుతాయి. దాంతో నోటీసు అందుకోవాల్సి వస్తుంది.


అధిక విలువతో కూడిన లావాదేవీలుఅధిక విలువతో కూడిన లావాదేవీల సమాచారాన్ని ఆదాయపన్ను శాఖ అన్ని మార్గాల నుంచి తెప్పించుకుంటుంది. పెట్టుబడుల రూపేణా లేక కొనుగోలు రూపేణా అధిక విలువతోకూడిన లావాదేవీలు నిర్వహిస్తే ఐటీ కంట్లో పడినట్టే. దాంతో నోటీసు అందుకోవచ్చు. ఉదాహరణకు రూ.2 లక్షలకు మించిన క్రెడిట్ కార్డు వినియోగం, ఫిక్స్ డ్ డిపాజిట్లలో రూ.5 లక్షలకు మించి చేసే పెట్టుబడులు, రూ.10 లక్షలకు మించి బ్యాంకు ఖాతాల్లో జమలు, మ్యూచువల్ ఫండ్స్ లో రూ.2 లక్షలకు మించి చేసే పెట్టుబడులు, రూ.1 లక్షకు మించి విలువగల షేర్ల కొనుగోలు లేదా విక్రయం, రూ.30 లక్షలకు మించిన విలువగల ఆస్తుల విక్రయం లేదా కొనుగోలు సమాచారాన్ని సంబంధిత సంస్థలు విధిగా ఆదాయపన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. దీంతో స్క్రూటినీ బారిన పడవచ్చు.


సంపద పన్నుrepresentative imageచాలా మందికి సంపద పన్ను చెల్లించాల్సిన విషయం తెలియదు. ఆస్తులు ఏవైనా గానీ... పట్టణ ప్రాంతాల్లో స్థలాలు, ఖాళీ ఇల్లు, కారు, బంగారం, ఖరీదైన వాచీలు, పెయింటింగ్స్ ఇటువంటి వాటిని కలిగి ఉన్న వారు వాటి విలువ ఎంతో లెక్కించాలి. రూ.30లక్షలు దాటితే దానిపై ఒక శాతం సంపద పన్నును రిటర్నులు దాఖలు చేయడం ద్వారా చెల్లించాల్సి ఉంటుందని తెలుసుకోవాలి. లేకుంటే నోటీసు వస్తుంది.


సెక్షన్ 143(1)సాధారణంగా ఎక్కువ మందికి వచ్చే నోటీసు ఇది. రిటర్నులు ఫైల్ చేసిన తర్వాత వస్తుంది. దీన్నొక ఇంటిమేషన్ లెటర్ గానే పేర్కొంటారు. రిటర్నుల్లో పేర్కొన్న వివరాలను... తమదగ్గరున్న డేటాబేస్ లోని టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, ఇతర అధిక విలువగల లావాదేవీల సమాచారంతో పోల్చుకుంటారు. కంప్యూటర్లే ఈ పని చేసేస్తాయి. చెల్లించాల్సినంత చెల్లించారా, లేక ఎక్కువ, తక్కువ పన్ను చెల్లించారా అన్నది తేలుస్తారు. సరిగ్గానే చెల్లించినట్టయితే రిటర్నులు ఆమోదం పొందినట్టు ఇంటిమేషన్ లెటర్ వస్తుంది. ఎక్కువ పన్ను చెల్లించినట్టు తేలితే రిఫండ్ గురించి సమాచారం ఇస్తారు. తక్కువ పన్ను చెల్లించినట్టు గుర్తిస్తే డిమాండ్ నోటీసు జారీ చేస్తారు. ఇటువంటప్పుడు 30 రోజుల్లోపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.


సెక్షన్ 142(1)సకాలంలో రిటర్నులు సమర్పించకపోయినా, లేదా డాక్యుమెంట్లు అందకజేయకపోయినా ప్రాథమిక విచారణకు సంబంధించి ఈ సెక్షన్ కింద ఈ నోటీసు అందుకుంటారు. దీనికి నోటీసు అందుకున్న వారు సంతృప్తికరమైన సమాధానం ఇస్తే తదుపరి చర్యలు ఉండవు.


సెక్షన్ 143(2)సెక్షన్ 142(1)కు ఫాలో అప్ నోటీసును సెక్షన్ 143(2) కింద జారీ చేస్తారు. 142(1) కింద ఇచ్చిన నోటీసుకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోయినా, లేక డాక్యుమెంట్లు సమర్పించకపోయినా అధికారులు మరోసారి నోటీసు జారీ చేస్తారు. అనంతరం వారి రిటర్నుల స్క్రూటినీని ప్రారంభిస్తారు.

సెక్షన్ 148కొంత ఆదాయాన్ని రిటర్నుల్లో చూపలేదని అసెస్ మెంట్ అధికారి భావిస్తే తిరిగి రిటర్నులు ఫైల్ చేయాలని ఈ నోటీసు ద్వారా కోరవచ్చు. ఇలా పన్ను ఎగవేసిన ఆదాయం రూ.లక్ష, ఆ లోపు ఉంటే సెక్షన్ 148 కింద నోటీసును సంబంధిత ఏడాది ముగిసిన తర్వాత నాలుగేళ్లలో జారీ చేయవచ్చు. రూ.లక్షకు మించితే ఆరేళ్లలోపు అయినా నోటీసు జారీ చేేసే అధికారం ఉంది.

సెక్షన్ 156ఇదొక తప్పనిసరి డిమాండ్ నోటీసు. జరిమానా, పన్ను, ఇతరత్రా పన్ను బకాయిలు ఉంటే చెల్లించాలని కోరే డిమాండ్ నోటీసు.

సెక్షన్ 245ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిఫండ్ కోరుతూ దరఖాస్తు చేశారనుకోండి. అదే సమయంలో సంబంధిత వ్యక్తి పన్ను బకాయి పడి ఉంటే... రిఫండ్ మొత్తం నుంచి దాన్ని సర్దుబాటు చేసుకుంటూ ఈ నోటీసు జారీ చేస్తారు.

సెక్షన్ 139(9)ఈ సెక్షన్ కింద నోటీసు అందుకుంటే మాత్రం రిటర్నుల్లో పేర్కొన్న సమాచారం తప్పు అని భావించాల్సి ఉంటుంది. ఏవైనా వివరాలు పేర్కొనకపోయినా, పేర్కొన్న వివరాలు సరిపోలకపోయినా నోటీసు ఇస్తారు. అప్పుడు మీరు ఫైల్ చేసిన రిటర్నుల్లో సమాచారం అంతా సరిగ్గానే ఉందని భావిస్తే అదే విషయాన్ని తెలియజేయాలి. లేదంటే సవరించిన రిటర్నులను ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు 15 రోజులు గడువు ఇస్తారు.


నోటీసులు రావడానికి కారణాలు- రిటర్నులు సకాలంలో ఫైల్ చేయకపోతే నోటీసు రావచ్చు. మీరు పనిచేస్తున్న సంస్థ మీ తరఫున టీడీఎస్ ను మినహాయింపు ఆదాయపన్ను శాఖకు జమచేస్తుంది. అప్పుడు రిటర్నులు ఫైల్ చేయకపోతే అధికారులు గుర్తించి రిటర్నులు ఫైల్ చేయాలని నోటీసు ద్వారా కోరతారు. అంతకుముందు ఆరు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి నోటీసును పంపవచ్చు.

- ఆలస్యంగా రిటర్నులు ఫైల్ చేస్తే ప్రతీ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5వేల జరిమానా ఉంటుంది. పన్ను బకాయి ఉంటే ఒక శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
- టీడీఎస్, ఫామ్ 16లో గణాంకాలకు, వాస్తవంగా పన్ను జమలను సూచించే ఫామ్ 26లో లెక్కలకు సరిపోలకపోతే నోటీసు జారీ చేస్తారు. కంపెనీ మీ తరఫున టీడీఎస్ జమచేయకపోయినా, పొరపాటుగా మీ తరఫున బదులు మరొకరి పాన్ నంబర్ పేరుతో జమ చేసినా ఇటువంటి పరిస్థితి ఎదురుకావచ్చు. ఇటువంటి సందర్భాల్లో టీడీఎస్ సర్టిఫికెట్ తో పన్ను అధికారులకు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.
- ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం, షేర్లపై మూలధన లాభాలు, అద్దె ద్వారా ఆదాయం అందుకుంటూ దీన్ని రిటర్నుల్లో చూపించని సందర్భాల్లో నోటీసు వస్తుంది. ఎందుకంటే ఆదాయపన్ను శాఖ ఇటువంటి వాటిని పట్టుకునేందుకు చాలా రకాల చర్యలు చేపట్టింది. ఇలా పన్ను ఆదాయం ఎగ్గొట్టే ప్రయత్నాలకు 100 నుంచి 300 శాతం జరిమానా విధిస్తారు. ఉదాహరణకు రూ.10వేల పన్ను ఎగ్గొడితే రూ.30వేల వరకు జరిమానా పడవచ్చు.
- షేర్లు కొనుగోలు, అమ్మకాలకు డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు తప్పనిసరి. ఈ ఖాతాల ప్రారంభానికి పాన్ నంబర్ తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, ప్రతీ లావాదేవీపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కొంత పడుతుంది. ఇది ప్రభుత్వానికి వెళుతుంది. పాన్ నంబర్ ఆధారంగా ప్రతీ వ్యక్తి కొనుగోళ్ల, అమ్మకాల వివరాలు ఆదాయపన్ను శాఖ డేటా బేస్ కు వెళ్లిపోతాయి. దాని సాయంతో సులభంగా పట్టుకుని నోటీసు పంపుతారు.
- కుటుంబ సభ్యుల పేరిట పెట్టుబడులు పెట్టినా ఆ సమాచారాన్ని ఐటీ రిటర్నుల్లో తెలియజేయాలి. లేదంటే ఆదాయపన్ను శాఖ పరిశీలనలో వీటిని వెల్లడించలేదని తెలిస్తే నోటీసు జారీ చేయవచ్చు.

వచ్చిన నోటీసు ఏ బాపతు...?ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసు అందితే కంగారు పడిపోవక్కర్లేదు. ముందుగా నోటీసును ఆసాంతం చదివి అందులోని విషయాన్ని తెలుసుకోవాలి. నోటీసులో ఉన్న పాన్ నంబర్, ఇతర వివరాలు తమవేనా అన్నది చెక్ చేసుకోవాలి. నోటీసు దేనికి సంబంధించినది అనేది పరిశీలించాలి. అధికారులు కొన్ని సందర్భాల్లో విచారణ నోటీసులు పంపుతుంటారు. ఈ నోటీసులో నగదుకు సంబంధించి నిర్ధిష్ట సమాచారం తెలియజేయాలని కోరవచ్చు. ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేసి ఉంటే ట్యాక్స్ స్క్రూటినీ నోటీసు జారీ చేయవచ్చు. అనంతరం సంబంధిత వ్యక్తి రిటర్నులను అధికారులు సమగ్రంగా పరిశీలిస్తారు.


నల్లధనం కేసులు అయితే ఎంక్వయిరీ నోటీసులు జారీ చేస్తారు. పెద్ద డిపాజిట్లకు సంబంధించి ఆదాయ వనరులను తెలియజేయాలని కోరతారు. లిమిటెడ్ లేదా డిటెయిల్డ్ స్క్రూటినీ ఈ రెండింటిలో ఏ నోటీసు అన్నది సమస్య తీవ్రతను బట్టి ఉంటుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి వార్షిక ఆదాయపన్ను రిటర్నుల్లో సమాచారం, ఏటా బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు తెలియజేసే పెద్ద లావాదేవీల వార్షిక సమాచార వివరాలతో సరిపోలకుంటే అప్పుడు డిటెయిల్డ్ స్క్రూటినీ నోటీసు జారీ చేసి ఆ పని చేపడతారు.  


ఏం చేయాలి...?representative imageనోటీసు వచ్చినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు. తప్పు చేసినట్టు తేటతెల్లమయినట్టూ కాదు. నోటీసు అందితే ఓ పద్ధతి ప్రకారం వ్యవహరించాలి. నోటీసు ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలి. స్క్రూటినీ నోటీసు అయితే ప్రత్యేకంగా ఏదైనీ సమాచారాన్ని అడగవచ్చు. దీనికి తగిన సమాధానాన్ని సిద్ధం చేసుకోవాలి. మీ వాదనకు ఆధారంగా తగిన ఆధారాలను జత చేయాలి. అవసరమైతే ఈ విషయంలో చార్టర్డ్ అకౌంటెంట్ సాయం పొందడం సమంజసం. మెయిల్ ద్వారా తెలియజేయవచ్చు. లేదా నేరుగా భౌతిక పత్రాల రూపంలోనయినా వివరాలు అందజేయవచ్చు. ఆదాయపన్ను శాఖ నిబంధనల మేరకు అనుమతించిన గడువులోపట స్పందన తెలియజేయాలి.


కొన్ని నోటీసుల్లో వ్యక్తిగతంగా అధికారుల ముందు హాజరై వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఇచ్చిన వివరాలు, ఆధారాలు సరిగ్గా ఉంటే ఏ ఇబ్బందీ ఉండదు. తప్పుడు వివరాలు ఇవ్వడం ద్వారా తప్పుదారి పట్టించే పని చేస్తే మాత్రం చట్టప్రకారం విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. తాము కంగారుతో సరిగ్గా తెలియజేయలేమని భావిస్తే పన్ను నిపుణుడిని ప్రతినిధిగా పంపవచ్చు. అసలు ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసు తలనొప్పులే వద్దనుకుంటే రిటర్నుల గడువుకు ముందే పన్ను నిపుణులను కలవడం ద్వారా గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సమస్త వివరాలు అందించి వారితో రిటర్నులు ఫైల్  చేయించడం ఉత్తమం.

వీటిని సిద్ధంగా ఉంచుకోవాలిఏటా ఆదాయపన్ను రిటర్నుల కాపీలను ఓ సెట్ జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఎప్పుడైనా ఆదాయ మూలాలు అడిగితే చెప్పేందుకు ఉంటాయి. విదేశీ ఆస్తుల ద్వారా ఆదాయం పొందితే ఇందుకు సంబంధించి రికార్డులను 16 ఏళ్ల పాటు పదిల పరచాలి. దేశీయంగా వచ్చిన ఆదాయం అయితే ఆరేళ్లు, ఇతరత్రా అయితే నాలుగేళ్ల పాటు ఆధారాలను భద్రపరిచి ఉంచుకుంటే మంచిది. ఖాతాల పుస్తకాలు సిద్ధంగా ఉంచుకోవాలి. పీపీఎఫ్ పాస్ బుక్, మ్యూచువల్ ఫండ్, గృహరుణం స్టేట్ మెంట్లు అనేవి సెక్షన్ 80సీ మినహాయింపులకు అవసరం. ఆస్తుల కొనుగోళ్లకు సంబంధించి సేల్ డీడ్ ఉంచుకోవాలి. ఏడాదికి సంబంధించి బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్ ను భద్రంగా ఉంచుకోవాలి. వ్యాపారులు అయితే కొనుగోళ్ల బిల్లులు, విక్రయ బిల్లులు, సరుకుల ప్రారంభ, ముగింపు స్టాక్ వివరాలు కూడా అవసరమే.

No comments: