
హైదరాబాద్: సమస్యల పరిష్కారం కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్ వాడీలు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఇందిరాపార్కు వద్ద సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించిన అంగన్ వాడీలు సమస్యల పరిష్కారం కోరుతూ రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పలువురు సిఐటియు నాయకులను అరెస్టుచేశారు. అంగన్ వాడీ కార్యకర్తలను ఈడ్చివేశారు. ఇందిరాపార్క్ నుంచి సెక్రటేరియేట్ వెళ్లే అన్ని దారులను మూసివేశారు. దీంతో ఇందిరాపార్కు వద్ద తీవ్ర ఉద్రిక్తపరిస్ధితులు నెలకొన్నాయి.
No comments:
Post a Comment