MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Wednesday, November 20, 2013

ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రయోజనాలు-పరిమితులు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్‌లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హెల్త్‌కార్డ్‌ల పథకం పట్టాలెక్కుతోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్‌ 1న ప్రభుత్వం 3 జిఓలు విడుదల చేసింది. జిఓ 174 ద్వారా ''ఉద్యోగుల ఆరోగ్య పథకం'' ప్రకటించబడింది. జిఓ 175లో పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు చెప్పబడినవి. జిఓ 176లో వివిధ జబ్బులకు సంబంధించి 1885 రకాల చికిత్సలు, వాటి ప్యాకేజీ రేట్లు పేర్కొనబడినవి. ఈ పథకంతో ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం కల్గుతుంది. కాగా కొన్ని పరిమితులూ ఎదురవుతాయి.
                          లబ్దిదారులు 65 లక్షల మంది
  రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగుల్లో ప్రొవిష్నలైజ్డ్‌ సర్వీస్‌ల్లో పనిచేస్తున్న వారు (జిల్లా పరిషత్‌ హైస్కూళ్లు, మండల పరిషత్‌ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు), సర్వీస్‌ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, పునర్‌ నియామకం పొందిన సర్వీస్‌ పెన్షనర్లు అర్హులు అవుతారు. వీరంతా సుమారుగా 14 లక్షల మంది వుంటారని అంచనా. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్‌లపై ఆధారపడిన కుటుంబ సభ్యులు మొత్తం దాదాపు 65 లక్షలమంది లబ్దిదారులు అవుతారు. ఉద్యోగి (ఈ పథకంలో ఉద్యోగి అనే ప్రతిసారీ ఉపాధ్యాయులు, పెన్షనర్‌ అని కూడా గమనించాలి) భార్య / భర్త, ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులు, 25 సంవత్సరాలలోపు వయసుగల నిరుద్యోలుగా వుండే కుమారులు, నిరుద్యోగులైన అవివాహిత, వితంతు, విడాకులు పొందిన ఒంటరి కుమార్తెలు, ఉద్యోగానికి అవకాశం లేని వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు కుటుంబ సభ్యులు (డిపెండెంట్స్‌)గా పరిగణించబడతారు.
మున్సిపల్‌, ఎయిడెడ్‌, రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, విశ్వ విద్యాలయాలు, గ్రంథాలయాలు, ప్రభుత్వరంగ సంస్థల్లోని దాదాపు 3 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రస్తుతానికి ఈ పథకం వర్తించదు. వీరందరికీ రెండో దశలో అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. అయితే ఆ దశ ఎప్పుడు అనేదానికి కాలపరమితి లేదు. ఉద్యమాల వత్తిడి, ప్రభుత్వ వైఖరిని బట్టి తేలాల్సి వుంటుంది. 010 హెడ్‌ ద్వారా జీతాలు పొందుతున్న మున్సిపల్‌ ఉద్యోగులకూ హెల్త్‌కార్డులనూ విస్మరించటం ఆశ్చర్యంగానే ఉన్నది. హెల్త్‌కార్డుల కోసం మున్సిపల్‌ ఉద్యోగుల సర్వీస్‌లు ప్రొవిష్నలైజ్‌ చేయాలనే డిమాండ్‌ని ఎత్తుకోవాలేమో! అదైనా ప్రభుత్వం చెయ్యాల్సిన పనే అవుతుంది. మహిళా ఉద్యోగుల అత్తమామలను డిపెండెంట్స్‌గా అనుమతిస్తామని అంగీకరించి కూడా ఉత్తర్వుల్లో విస్మరించటం జరిగింది. సిజిహెచ్‌ఎస్‌, ఇఎస్‌ఐఎస్‌, రైల్వేలు, ఆర్‌టిసి, పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖల్లోని ఆరోగ్య పథకాల్లో లబ్దిదారులైన వారికి ఈ పథకం వర్తించదు. న్యాయశాఖలోని అధికారులు, అఖిలభారత సర్వీస్‌ అధికారులు, క్యాజ్‌వల్‌ ఉద్యోగులు కూడా అర్హులు కారు.
                                   వైద్య సదుపాయం
'ఉద్యోగుల ఆరోగ్య పథకం' వినియోగించుకోవటానికి ఉద్యోగి కుటుంబం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని హెల్త్‌కార్డు పొందాలి. ఎమ్‌ప్యానెల్డ్‌ హాస్పిటల్స్‌లో కార్డ్‌ చూపించి వైద్యం చేయించుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలోని దాదాపు 450 ఆసుపత్రులు ఎమ్‌ప్యానల్‌లో ఉన్నాయి. అవి ప్రధాన నగరాలతో పాటు జిల్లా, డివిజన్‌ కేంద్రాల్లో కూడా వున్నాయి. ఇన్‌ పేషెంట్‌, ఔట్‌ పేషెంట్‌గా అన్ని రకాల జబ్బులకూ వైద్యం చేయించుకోవచ్చు. వివిధ జబ్బులకు వైద్యం కోసం 1885 రకాల చికిత్సలు జాబితాలో ఉన్నాయి. ఔట్‌ పేషెంట్‌ వైద్యానికి సంబంధించి 25అంశాలు పేర్కొనబడినవి. ఎమ్‌ప్యానెల్డ్‌ హాస్పిటల్స్‌ ఎక్కడ వున్నాయో తెలుసుకోవటానికి షషష.వష్ట్రట. స్త్రశీఙ.ఱఅ అనే వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఆయా హాస్పిటల్స్‌లో వుండే ఆరోగ్య మిత్ర సహకారం తీసుకోవచ్చు. జిఓ 176లో పేర్కొన్న ప్యాకేజీ రేట్లు చూస్తే గరిష్ట రేటు రూ.2 లక్షలు దాకా వుంది. అది ఒక ఎపిసోడ్‌కి, అలాంటివి ఎన్నిసార్లయినా వినియోగించుకొనే అవకాశం ఉంటుందని చెప్పబడింది. ఏదైనా ఒక చికిత్స ఖర్చు రూ.2లక్షలకు మించినా వైద్యం చేయబడుతుందనీ జిఓ 174లోని పేరా 4.3లో స్పష్టీకరించబడింది. వైద్య పరీక్షలు, మందులు, శరీరంలో అమర్చే సాధనాలు, ఆహారం, శస్త్ర చికిత్స, చికిత్స అనంతరం కలిగే ఇబ్బందులు, ఫాలోఅప్‌ చికిత్స వంటి అన్నింటినీ కలిపి ప్యాకేజీగా ఉంటుంది. హాస్పిటల్‌లో చేరిన నాటి నుండి డిశ్చార్జి అయిన తర్వాత 10 రోజుల వరకు అవసరమైన వైద్యం, మందులు కూడా ప్యాకేజీలో కలిసే ఉంటాయి.
ఎమ్‌ప్యానెల్డ్‌ హాస్పిటల్స్‌ దాదాపు 450 వున్నా 347 జబ్బులకు చికిత్స ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం చేయటం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగిన వసతులు, సదుపాయాలు, మెరుగైన వైద్యం లేకపోతే డబ్బు చెల్లించి అయినా ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ని ఆశ్రయించే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఔట్‌ పేషెంట్‌ వైద్యానికి సంబంధించిన ప్యాకేజీ రేట్లు, హాస్పిటల్స్‌ గురించి జిఓ 176లోని అనుబంధ పత్రంలో పేర్కొనకపోవటం అనుమానాలు కల్గిస్తున్నది.
                       వైద్య ఖర్చులో 40 శాతం ఉద్యోగులే భరించాలి
ఉద్యోగుల ఆరోగ్య పథకానికి అయ్యే ఖర్చులో 60 శాతం ప్రభుత్వం, 40 శాతం ఉద్యోగులు భరించాలి. ఉద్యోగుల వాటా కోసం 9వ పీఆర్‌సీలోని రూ.6700-20110 నుండి రూ. 14860-39540 పే స్కేళ్లలో ఉన్నవారు నెలకి రూ.90/-లు చొప్పున మిగిలిన పే స్కేళ్లలో వుండేవారు నెలకి రూ.120/-లు చొప్పున కంట్రిబ్యూషన్‌ చెల్లించాలి. రూ.90/-లు చొప్పున చెల్లించే వారికి షేరింగ్‌ రూల్‌ రూ.120/-లు చొప్పున చెల్లించేవారికి సెపరేట్‌ రూమ్‌ సదుపాయం ఉంటుంది. 6 నెలల తర్వాత పథకం అమలు పరిస్థితిని సమీక్షించి కంట్రిబ్యూషన్‌ రేట్లు నిర్థారించబడతాయని చెప్పబడింది. ఆ తర్వాత యేడాదికి ఒకసారి అయినా పథకాన్ని సమీక్షించటం, ప్యాకేజీ రేట్లు, కంట్రిబ్యూషన్‌ రేట్లు పెంచటం అనే ప్రక్రియ ఎలాగూ కొనసాగుతుంది.
మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ పథకంలో ఉద్యోగి జీతం నుండి ఏమీ చెల్లించాల్సిన అవసరం లేకుండానే వైద్య ఖర్చులను ప్రభుత్వమే చెల్లించేది. కొత్త పథకంలో 40% ఖర్చును ఉద్యోగి భరించాల్సి వచ్చింది. ఈ నిష్పత్తి (60:40) భవిష్యత్‌లో తారుమారైనా కావచ్చు. ప్రభుత్వం తన బాధ్యతను క్రమంగా తగ్గించుకొని మొత్తం భారాన్ని ఉద్యోగులపైనే మోపే ప్రమాదము వుండవచ్చు.
                         ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాలి
ఈ పథకంలో లబ్దిదారులుగా అర్హతగలవారు షషష.వష్ట్రట. స్త్రశీఙ.ఱఅ అనే వెబ్‌సైట్‌లోని ఈ ఫారం ద్వారా అప్లై చేసుకోవాలి. ఉద్యోగి ట్రెజరీ కోడ్‌, పాస్‌వర్డ్‌తో సదరు వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావాలి. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో వుండే కాలమ్స్‌ అన్నీ జాగ్రత్తగా పూరించాలి. ప్రింట్‌ అవుట్‌ తీసుకొని ఒకటికి రెండుసార్లు పరిశీలించుకుకొని తప్పులుంటే సరిచేసిన తర్వాతే ఆన్‌లైన్‌లో సబ్‌మిట్‌ చేయాలి. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌తో ఉద్యోగి, కుటుంబ సభ్యుల పాస్‌పోర్ట్‌ సైజ్‌ డిజిటల్‌ ఫోటోలు, సర్వీస్‌ రిజిష్టర్‌లోని 1,2 పేజీలు (పాత పుస్తకం) లేదా 4,5 పేజీలు (కొత్త పుస్తకం) మరియు ఆధార్‌కార్డ్‌ లేదా ఆధార్‌ నమోదు నంబర్‌ కాపీ జత చేయాలి. సంతకం చేసిన ప్రింట్‌ అవుట్‌ కాపీని డిడిఓకి ఇవ్వాలి. ఈ అప్లికేషన్‌ అంగీకరించబడిందా తిరస్కరించబడిందా అనే విషయం ఎస్‌ఎంఎస్‌ ద్వారా దరఖాస్తుదారుకి తెలియజేయబడుతుంది. మిగిలిన విషయాలు డిడిఓలు చూసుకోవాల్సి వుంటుంది. మొదట తాత్కాలిక కార్డ్‌లు యిచ్చి 90 రోజుల తర్వాత శాశ్వత కార్డ్‌లు ఇస్తారు.
                  ఇంతకీ అమల్లోకి వచ్చేది ఎప్పుడు?
నవంబర్‌ 1న యిచ్చిన జిఓ 174 డిసెంబర్‌ 5 నుండి అమల్లోకి వస్తుందని 11వ పేరాలో చెప్పబడింది. అందుకు అవసరమైన చర్యల కోసం చేపట్టాలని శాఖాధిపతులు 7 రోజుల్లోగా ఉత్తర్వులు యివ్వాలని జిఓ 175లో చెప్పబడింది. కానీ అలాంటి ఉత్తర్వులు ఇచ్చిన జాడలేదు. కాగా వచ్చిన జిఓలుపైనా అనేక లోపాలు, అనుమానాలు లోపాలు వున్నాయి. వాటిని సవరించాలి. అదనపు అంశాలు చేర్చాలి. జిల్లా, డివిజన్‌ కేంద్రాల్లోనే నమోదు చేసుకోవాలనే నిబంధన చాలామందికి దూరాభారం అవుతుంది. ప్రతి మండల, పట్టణ కేంద్రంలోనూ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆరోగ్య పథకం ప్రారంభించిన తర్వాత 6 నెలల వరకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ పథకమూ కొనసాగాలి. రెండింటిలో ఏదో ఒకటి వినియోగించుకొనే అవకాశం వుండాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న సూచనలు, ప్రతిపాదనలతో అవసరమైన సవరణలు, చేర్పులు, మార్పులు చేసి పథకాన్ని సద్వినియోగంచ చేసే కృషి కొనసాగాలి.
-నాగటి నారాయణ
(వ్యాసకర్త యుటియఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు)

No comments: