MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Wednesday, December 6, 2017

స‌ద్ది రొట్టె ప్రయోజ‌నాలు తెలిస్తే వేస్ట్ చేయరు

03-12-2017: సద్ది రొట్టె(నిన్నలేదా మొన్నటిది) తినేందుకు సాధార‌ణంగా ఎవ‌రూ ఇష్టప‌డ‌రు. అయితే దానిలో ఎన్నో ప్రయోజ‌నాలున్నాయి. పాల‌తో పాటు స‌ద్ది
రొట్టెను తీసుకోవడం వ‌ల‌న మ‌ధుమేహం అదుపులో ఉంటుంద‌ని ఆయుర్వేద వైద్యం చెబుతోంది. దీనికితోడు రోజూ ఈ విధంగా స‌ద్దిరొట్టెను తీసుకోవ‌డం వ‌ల‌న బీపీ కూడా నియంత్రణ‌లో ఉంటుంది. రొట్టె త‌యారుచేసిన ఒక‌టి, రెండు రోజుల త‌ర్వాత దానిలో ప్రయోజ‌నం చేకూర్చే బ్యాక్టీరియా చేరుతుంది. దీనితోపాటు దానిలోని గ్లూకోజ్ శాతం త‌గ్గుతుంది. ఇటువంటి రొట్టెను పాల‌తో తీసుకోవ‌డం వ‌ల‌న ఉద‌ర సంబంధిత వ్యాధుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మ‌ల‌బ‌ద్దకం లాంటి స‌మ‌స్యలు స‌మ‌సిపోతాయి. అలాగే ఇటువంటి రొట్టెలో ఫైబ‌ర్ ఉన్న కార‌ణంగా జీర్ణశ‌క్తి వృద్ధి చెందుతుంది. దీనికితోడు స‌ద్ది రొట్టె శ‌రీర ఉష్టోగ్రత‌ను స‌మ‌తుల్యం చేయ‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా వేస‌విలో ఇటువంటి రొట్టెను తీసుకోవ‌డం వ‌ల‌న వ‌డ‌దెబ్బ ముప్పు నుంచి తప్పించుకోవ‌చ్చు. శ‌రీర బ‌రువును త‌గ్గించ‌డంలో, శ‌రీరానికి శ‌క్తిని స‌మ‌కూర్చడంలోనూ స‌ద్ది రొట్టి ఉప‌యోగ‌ప‌డుతుంది. ముఖ్యంగా రాత్రి స‌మ‌యంలో స‌ద్దిరొట్టెను తీసుకోవ‌డం వ‌ల‌న అధిక ప్రయోజ‌నాలుంటాయి.

No comments: